చింతలపూడి (పొన్నూరు మండలం)
చింతలపూడి (పొన్నూరు మండలం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°2′31.99999″N 80°32′30.00001″E / 16.0422222194°N 80.5416666694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పొన్నూరు |
విస్తీర్ణం | 8.71 కి.మీ2 (3.36 చ. మై) |
జనాభా (2011) | 8,223 |
• జనసాంద్రత | 940/కి.మీ2 (2,400/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,062 |
• స్త్రీలు | 4,161 |
• లింగ నిష్పత్తి | 1,024 |
• నివాసాలు | 2,272 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522124 |
2011 జనగణన కోడ్ | 590370 |
చింతలపూడి (పొన్నూరు మండలం), గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పొన్నూరు నుండి 3 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2272 ఇళ్లతో, 8223 జనాభాతో 871 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4062, ఆడవారి సంఖ్య 4161. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2112 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 455. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590370.[1]
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]
భట్టిప్రోలు మండలం
[మార్చు]భట్టిప్రోలు మండలం లోని శివంగులపాలెం, భట్టిప్రోలు, అద్దేపల్లి, వెల్లటూరు గ్రామాలు ఉన్నాయి.
పొన్నూరు మండలం
[మార్చు]పొన్నూరు మండలం లోని ఆరెమండ, ఉప్పరపాలెం, చింతలపూడి, జడవల్లి, జూపూడి, దండమూడి, దొప్పలపూడి, నండూరు, పచ్చలతాడిపర్రు, బ్రాహ్మణ కోడూరు, మన్నవ, మామిళ్లపల్లె, మునిపల్లె, వడ్డిముక్కల, వెల్లలూరు గ్రామాలున్నాయి.
గ్రామ భౌగోళికం
[మార్చు]సమీప గ్రామాలు
[మార్చు]ఈ గ్రామానికి సమీపంలో వడ్డెముక్కల,కసుకర్రు,మాచవరం,వల్లభరావుపాలెం,ములుకుదురు గ్రామాలు ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
సమీప బాలబడి పొన్నూరులో ఉంది.
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పొన్నూరులోను, ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు పొన్నూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం పొన్నూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]చింతలపూడిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]తాగు నీరు
[మార్చు]గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]చింతలపూడిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]చింతలపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 68 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 21 హెక్టార్లు
- బంజరు భూమి: 2 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 778 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 8 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 772 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]చింతలపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 558 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 213 హెక్టార్లు
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]విద్యుత్తు సౌకర్యం
[మార్చు]- ఈ గ్రామంలోని,లో ఓల్టేజి సమస్య తీర్చటానికి, రు.1.2 కోట్లతో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రం పూర్తి అయినది. రు. 9 లక్షలతో నూతన భవనం నిర్మించారు.[3]
- వీధి దీపాలు:- విద్యుత్తు పొదుపు చేయాలనే ఉద్దేశంతో, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని 265 వీధి దీపాలకుగాను, 100 దీపాలకు ఎల్.యి.డి. దీపాలను ఏర్పాటుచేసారు. మిగిలినవాటిని గూడా త్వరలో ఏర్పాటుచేయనున్నారు.[4]
అంగనవాడీ కేంద్రం
[మార్చు]గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]చింతలపూడి గ్రామ శివారులోని తుంగభద్ర డ్రెయిన్‌పై ఒక ఎత్తిపోతల పథకం నిర్మించారు. చింతలపూడి, ములుకుదురు, వల్లభనేనివారిపలె గ్రామాలలోని 750 ఎకరాలకు పైగా సాగుభూమికి ఈ పథకం ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఈ పథకం మరమ్మత్తులకు గురికాగా, 45 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మత్తులు పూర్తి చెసినారు. త్వరలో అందుబాటు లోనికి రాగలదు.[5]
ఊర చెరువు
[మార్చు]ఈ చెరువు చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసారు.[6]
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గంటా ప్రసాద్, సర్పంచిగా ఎన్నికైనాడు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి కోశాధికారిగా ఎన్నికైనారు.[7]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]గ్రామదేవత శ్రీ మెంటలమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలోని అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలను, 2017,ఆగస్టు-13వతేదీ శ్రావణమాసం, ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ప్రభలతో కనకతప్పెట్లు, మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.[8]
శ్రీ మొగదారమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2017,మార్చి-12వతేదీ ఆదివారం, ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పండుగరోజున, వైభవంగా నిర్వహించారు.[9]
శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయo
[మార్చు]ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా 2017,ఫిబ్రవరి-25వతేదీ శనివారంనాడు, ఆలయంలోని స్వామివారికి ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించినవి. గ్రామస్థులు, చింతలపూడి ఇంజనీరింగ్ కలాశాల విద్యార్ధులు, భక్తులకు అన్నసంతర్పణగావించారు.[10]
గ్రామంలోని ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలోని ప్రధాన వృత్తులు
[మార్చు]గ్రామ ప్రముఖులు
[మార్చు]- కోగంటి ఆదిశేషయ్య
- ధూళిపాళ్ల వీరయ్య చౌదరి: 1968 నుండి 1981 వరకూ ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై పనిచేశారు. 1979 నుండి 1985 వరకూ సంగం డైరీ ఛైర్మనుగా ఉన్నారు. 1983లో పొన్నూరు శాసనసభకు పోటీచేసి గెలిచారు. 1985లో మధ్యంతర ఎన్నికలలోనూ పొన్నూరు శాసన సభ్యులుగానూ పోటీచేసి గెలిచారు. 1988-89 వరకు రెవెన్యూశాఖా మంత్రిగా పనిచేశారు. 1992 నుండి 1994 వరకూ మళ్ళీ సంగం డైరీ ఛైర్మనుగా పనిచేశారు. సంగం డైరీని అభివృద్ధి బాటలో నిలపటమేగాక, పాల రైతులకు వెన్నుదన్నుగా నిలవటంతో ఈయన "పాలవీరయ్య" గానూ, పాలవాళ్ళ ధూళిపాళ్ళ గానూ గుర్తింపు పొందినారు. 1994 లో నారాకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకస్మాత్తుగా అసువులుబాశారు.[11]
- ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, పొన్నూరు శాసనసభ్యులు.
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ వూరిలో కటికల కాంతమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ హెల్త్ కేర్ సొసైటీ అను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. ఈ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కటికల శివభాగ్యారావు ఐ.ఆర్.యస్. వీరు తల్లిదండ్రుల స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన విద్యార్థులకు, విద్యకు ఎటువంటి ఆటంకం కలుగకుండా తమ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందించుచున్నారు. ఈ సంస్థ జూన్ 29-2013 న 13 వ వార్షికోత్సవం జరుపుకొనుచున్నది.[12]
ఈ గ్రామానికి చెందిన రావులపల్లి లక్ష్మీతులసి , ఒంగోలులోని క్విస్ సాంకేతిక విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, క్విస్ సెట్ అకడమిక్ డీన్ గా పనిచేస్తున్నారు. వీరు కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో, హైదరాబాదులోని జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జె.ఎన్.టి.యు) నకు సమర్పించిన న్యూ డైరెక్షన్ ఇన్ డొమైన్ అంటాలజీ బేస్డ్ ఇంటలిజెన్స్ సెమాంటిక్ సెర్ఛ్ పరిశోధనా పత్రానికి, వీరికి, జె.ఎన్.టి.యు, డాక్టరేట్ ప్రదానం చేసింది.[13]
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8774. ఇందులో పురుషుల సంఖ్య సంఖ్య 4413, స్త్రీల సంఖ్య 4361,గ్రామంలో నివాసగృహాలు 2241 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 871 హెక్టారులు.
మూలాలు
[మార్చు]- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్, 11 జులై 2013. 8వ పేజీ.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్, పొన్నూరు-మొదటి పేజీ.జూన్ 28, 2013.
- ↑ ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,జూన్-13; 1వపేజీ.
- ↑ ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు;2017,జులై-23; 1వపేజీ.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ
- ↑ ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,ఆగష్టు-14; 1వపేజీ
- ↑ ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,మార్చ్-13; 1వపేజీ
- ↑ ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,ఫిబ్రవరి-26; 1వపేజీ
- ↑ ఈనాడు గుంటూరు రూరల్, 13 జులై,2013. 8వ పేజీ.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్, పొన్నూరు-మొదటి పేజీ. జూన్ 28, 2013.
- ↑ ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,ఆగష్టు-12; 2వపేజీ.