Jump to content

చిరతపూడి

అక్షాంశ రేఖాంశాలు: 16°38′40.09″N 81°54′40.68″E / 16.6444694°N 81.9113000°E / 16.6444694; 81.9113000
వికీపీడియా నుండి
చిరతపూడి
పటం
చిరతపూడి is located in ఆంధ్రప్రదేశ్
చిరతపూడి
చిరతపూడి
అక్షాంశ రేఖాంశాలు: 16°38′40.09″N 81°54′40.68″E / 16.6444694°N 81.9113000°E / 16.6444694; 81.9113000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంఅంబాజీపేట
విస్తీర్ణం3.48 కి.మీ2 (1.34 చ. మై)
జనాభా
 (2011)
3,349
 • జనసాంద్రత960/కి.మీ2 (2,500/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,686
 • స్త్రీలు1,663
 • లింగ నిష్పత్తి986
 • నివాసాలు936
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533229
2011 జనగణన కోడ్587798

చిరతపూడి, ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం.[2]. ఈ గ్రామం. రావులపాలెం నుండి అమలాపురం వెళ్ళే దారిలో వస్తుంది. కోనసీమ ప్రాంతంలో వున్న ఈ గ్రామంలో వరి ప్రధాన పంట. కూరగాయలు పండించడంతో పాటు చిరాతపూడిలో అరటి, కొబ్బరి తోటలు ఎక్కువగా కానవస్తాయి. చిరతపూడి గ్రామ పంచాయతీ కోడ్ 201792.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]

చిరతపూడి గ్రామంపూర్వ కాలమునుండి కోనసీమలోని పంచకేశవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిపొంది యుండెడిది. ఈ గ్రామంలో పెద్దాపురం మహారాజావారు అయిన శ్రీ వత్సవాయి తిమ్మజగపతి రాజా వారిచే నిర్మించబడిన రెండు ప్రసిద్ధ దేవాలయములు ఉన్నాయి. ఒకటి శ్రీ భూసమేత కేశవ స్వామి దేవాలయము, పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయము. ఇవి చాల పురాతన దేవాలయములు. కాని, ముస్లిముల దండయాత్రల సమయములో స్వామివారి విగ్రహము ఖండమయినది అని, తరువాత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము నిర్మించారు. ఈ వేణుగోపాలస్వామిని దర్శించుకున్నవారికి వారు కోరుకోకుండానే వారికి కలిగిన ఆపదలు, కోరికలు తీరుస్తాడని, అదేవిధంగా ఈ స్వామి కళ్యాణగోపాలుడని అంటారు. వివాహముకానివారు ఈ స్వామికి అభిషేకము, అర్చన చేసినంతనే వారికి వివాహము జరుగుతుందని, వివాహము జరిగిన పిదప సతీసహితముగ స్వామివారికి కళ్యాణము నిర్వహించితే వారి దాంపత్యము సుఖసౌఖ్యాలతో ఉంటుందని ప్రతీతి. 1996 కోనసీమలో సంభవించిన తుఫాను సమయములో పై రెండు దేవాలయములలోని ధ్వజ స్తంభములు పడిపోయినవి. శివాలయములోని ధ్వజ స్తంభమును పునరుద్దరించారు. కాని, ఎండోమెంట్ వారి నిర్లక్ష్యము కారణంగా, వేణుగోపాల స్వామి వారి ఆలయములో ధ్వజస్తంభమును పునరుద్దరించలేదు. సదరు దేవాలయమునకు ఆదాయమున్నను, ఆలయమును సరిగా నిర్వహించుటగాని చేయుటలేదు. తగిన శ్రద్ధ తీసుకొమ్మని, ధ్వజస్తంభమును పునరుద్దరించమని ప్రజలు ఎండోమెంట్ వారిని కోరినా వారు స్పందించలేదు..

చివరకు..2018 వ సంవత్సరంలో, భక్తుల సహకారంతో..నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేశారు...

శివాలయమునందు వెలసిన పార్వతీ బ్రహ్మేశ్వరస్వామి వారు సర్వగ్రహపీడలను తొలగిస్తాడని, స్వామికి సోమవారము అభిషేకం చేయించిన వారికి గ్రహబాధలు తొలగి, రోగపరిహారము కలుగుతుందని పెద్దల మాట. ప్రతి సంవత్సరం కనుమ పండుగరోజు ప్రభల ఉత్సవం, తీర్ధం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆ ఉత్సవంలో పాల్గొంటారు.,, 2011 మే 23 వ తేదీన గ్రామంలోషిర్డీ సాయిబాబా ఆలయము కూడా నిర్మించారు. గ్రామం, పచ్చని కొబ్బరి తోటలతో, వరి చేలతో, కళకళ లాడుతూ, దేవాలయములతో ఆధ్యాత్మికతతో నిరంతరము భాసిల్లుతున్నది. గ్రామంలోని, వేణు గోపాలస్వామి ఆలయము, శివాలయము, సాయిబాబా గుడి, వనుములమ్మ గుడి చూడదగిన స్థలములు.

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 3,349 వారిలో పురుషుల సంఖ్య 1,686 మంది ఉంచగా, స్త్రీల 1,663 మంది ఉన్నారు. గ్రామ పరిధిలో నివాస గృహాల 936 ఉన్నాయి.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 3,273.ఇందులో పురుషుల సంఖ్య 1,633, మహిళల సంఖ్య 1,640, గ్రామంలో నివాస గృహాలు 860 ఉన్నాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిరతపూడి&oldid=4254802" నుండి వెలికితీశారు