Jump to content

తిరుమలగిరి (సికింద్రాబాద్)

అక్షాంశ రేఖాంశాలు: 17°28′16″N 78°30′34″E / 17.47111°N 78.50944°E / 17.47111; 78.50944
వికీపీడియా నుండి
తిరుమలగిరి
రెయిన్బో షాపింగ్ మాల్, తిరుమలగిరి
రెయిన్బో షాపింగ్ మాల్, తిరుమలగిరి
తిరుమలగిరి is located in Telangana
తిరుమలగిరి
తిరుమలగిరి
భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉనికి
Coordinates: 17°28′16″N 78°30′34″E / 17.47111°N 78.50944°E / 17.47111; 78.50944
దేశం India
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
Government
 • Bodyసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు C
భాషలు
 • జనాభాతెలుగు
Time zoneUTC+5:30 (ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
500015
లోక్‌సభనియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం

తిరుమలగిరి, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ, శంషాబాద్ జోన్, హైదరాబాద్ జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామం.[1] అదే పేరుతో ఉన్న తిరుమలగిరి మండలానికి కేంద్రం.[2] ఇది హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ, శంషాబాద్ జోన్, హైదరాబాద్ జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామం. ఇది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక ప్రాంతం. అంతకు ముందు భారతదేశంలోని సికింద్రాబాద్ ప్రధాన శివారు ప్రాంతం.ఇది హైదరాబాద్ జిల్లాకు ఉత్తరాన ఉంది. తిరుమలగిరి శివారు ప్రాంతంలో చాలా చిన్న నివాస పట్టణాలు ఉన్నాయి. ప్రక్కనే ఉన్న శివారు ప్రాంతాలైన కార్ఖానా, సైనిక ఆయుధ సామాగ్రి కేంద్రం (ఎఒసి) తరచుగా తిరుమలగిరిలో భాగంగా భావిస్తారు. గత 15 సంవత్సరాలలో, ఈ శివారు జంట నగరాల్లో ఒక ముఖ్యమైన నివాస ప్రాంతంగా మారింది. ఈ శివారులో అనేక కాలనీలు, పట్టణనివాసాలు,బహుళ అంతస్తులు నిర్మించబడ్డాయి.సికింద్రాబాద్ చరిత్రాత్మకంగా పరిశీలిస్తే, తిరుమలగిరి, బోయినపల్లి, మారెడ్‌పల్లి అనే ఈ మూడు గ్రామాల కలయికతో సికింద్రాబాద్ ఏర్పాటైనట్లుగా తెలుస్తుంది.ఈ ప్రాంతం బ్రిటిష్ కాలంనాటి  బ్రిటిష్ కారాగారం, వైద్యకళశాల వంటి కొన్ని చారిత్రక భవనాలను కలిగి ఉంది. మలేరియా నివారణను కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ పేరుతో 'సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసిటాలజీ' ఈ ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఉంది, కానీ ప్రస్తుతం అది పని చేయటలేదు.

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

ఈ శివారుప్రాంతంలో అన్ని రకాల అవసరాలకు చాలా షాపులు ఉన్నాయి. 2002 లో అనేక వస్త్ర కర్మాగార కేంద్రాలు వెలిసాయి. ఇక్కడ రాయితీ ధరలకు అన్ని శ్రేణులవారి కోసం అనేక బ్రాండెడ్ దుస్తులు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.నగరంలోని అంతటా ఉన్న దుకాణదారులను ఆకర్షిస్తుంది. సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం వాహనాల సంఖ్య (ఎపి 10) నమోదుకు సేవలు అందించే రవాణా శాఖ కార్యాలయం (ఆర్టీఏ) ఇక్కడ ఉండటం ఒక ప్రధాన మైలురాయి.ఈ శివారులో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా, ఎస్బిఐ వంటి అనేక బ్యాంకులు 2002 నుండి పనిచేస్తున్నాయి.

చిల్లర వ్యాపారులు

[మార్చు]

ఫాబిండియా, ఫుడ్ వరల్డ్ వంటి స్పెషలిస్ట్ కిరాణా షాపులు ఇక్కడ ఉన్నాయి.ఒక ఆధునిక మాల్, రెయిన్బో మాల్ లో ఫాబ్ ఇండియాతో సహా కొన్ని మంచి షాపులు రెస్టారెంట్లు ఉన్నాయి. పాత మోండా మార్కెట్ హస్మత్‌పేట్ సరస్సు సమీపంలోకి మార్చబడింది.కూరగాయలు అమ్మకాలు కోసం బోయినపల్లి విఫణి యార్డును (ఆసియాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ అని నమ్ముతారు) అని పిలువబడే పెద్ద టోకు విఫణి సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది.

రెస్టారెంట్లు

[మార్చు]

ఈ శివారులలో కాంటినెంటల్, చైనీస్, భారతీయ వంటకాలుకు చెందిన కొన్ని ఖరీదైన రెస్టారెంట్లు ఉన్నాయి.వివిధరకాలకు చెందిన చాలా ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు ఉన్నాయి. 2007 జనవరి జనవరిలో, మెక్‌డొనాల్డ్స్ తన రెండవ రెస్టారెంట్‌ను ఈ ప్రాంతలో ప్రారంభించింది. ఈ ప్రాంతంలోని ఇతర తినుబండారాలు కెఎఫ్‌సీ, కేఫ్ లాట్టే, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్, ఆలివ్ చీజ్, కాఫీ కేబాబ్స్, బాస్కిన్ రాబిన్స్, పిజ్జా హెవెన్, వాక్స్ పేస్ట్రీ, కేక్ బాస్కెట్ వంటి అనేక బేకరీలు, ప్రత్యేక హైదరాబాదీ రెస్టారెంట్లు, హైదరాబాద్ హౌస్, బిర్యానీ దర్బార్, ది ప్రైడ్ రెసిడెన్సీ లాంటిబసలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా పంజాబీ ఎఫైర్, జీట్స్ కిచెన్, గణేష్ ధాబా, ఘన్‌గ్రూ రెస్టారెంట్ వంటి పంజాబీ రెస్టారెంట్లు, పెప్పర్ పాడ్స్ వంటి బహుళ వంటకాల రెస్టారెంట్ ఇక్కడ ఉన్నాయి..

ఉత్సవాల వసతి భవనాలు

[మార్చు]

ఎస్ఎంఆర్ జయలక్ష్మి గార్డెన్స్ (ఆర్టీసీ కాలనీ), టీచర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ కమ్యూనిటీ హాల్ (టీచర్స్ కాలనీ), అనుభావ్ గార్డెన్స్ (ఆర్టీఏ సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద ), జూలూరి వజ్రమ్మ కళ్యాణ మండపం, మోడరన్ ఫంక్షన్ ప్లాజా (లాల్‌బజార్), లీలా గార్డెన్స్ (టీచర్స్ కాలనీ సమీపంలో), మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ (మెయిన్ ఆర్డి లాల్‌బజార్) ఉత్సవాల జరుపుకునే వసతి భవనాలు ఉన్నాయి

పాఠశాలలు

[మార్చు]

డిల్లీ పబ్లిక్ స్కూల్, న్యూ ఉషోదయ ఉన్నత పాఠశాల (సుభాష్ నగర్), షేర్వుడ్ పబ్లిక్ స్కూల్, సెయింట్ ఆండ్రూస్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాల, హోలీ ఫ్యామిలీ గర్ల్స్ ఉన్నత పాఠశాల, కేంద్రీయ విద్యాలయ గౌతమ్ మోడల్ పాఠశాల, సైనిక పాఠశాల (ఆర్కె పురం) లాంటి కొన్ని మంచి పాఠశాలలు ఉన్నాయి.సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాల, కెన్ డిగ్రీ కళాశాల, లిటిల్ ఫ్లవర్ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఈ ప్రాంతలో ఉన్నాయి.ఈ ప్రాంతం హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాల రోడ్లతో ఉత్తర తెలంగాణ జిల్లాలను కలిపే రాజీవ్ రహదారి (హైవే) బాగా అనుసంధానించబడి ఉందిఇది ఈ శివారు గుండా జాతీయ రహదారి 7 (ఎన్‌హెచ్‌7) 4 ఈ శివారు నుండి కి.మీ. ఎన్.హెచ్ 7 ను ఇసిఐల్ క్రాసు ' రోడ్లతో అనుసంధానించే లింక్ రోడ్ ఉంది. ఈ జంక్షన్లు జంట నగరాల్లో ప్రధాన కూడళ్లలో ఒకటిగా మారి,.గరిష్ఠ సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించింది. చాలా ట్రక్కులు ఈ రహదారిని ఉపయోగిస్తాయి. ఇక్కడకు అతి సమీపంలో ఎమ్ఎమ్టిస్ రైలు స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నాయి. సమీపంలోని అల్వాల్ వద్ద సబర్బన్ రైల్వే స్టేషన్ ఉంది.21 నుంచి 25, 147 సంఖ్యలుగల అన్నిఆర్టీసీ బస్సులు తిరుమలగిరికి వస్తాయి.

తిరుమలగిరిలోని కాలనీలు

[మార్చు]

తిరుమలగిరిలో ఉన్న కొన్ని బాగా అభివృద్ధి చెందిన కాలనీలు క్రింద ఇవ్వబడ్డాయి.ఈ ప్రాంతంలో ఇంకా ఇందిరా నగర్ కాలనీ, కనాజిగూడ, శ్రీ పద్మ నాభ నగర్ కాలనీ (ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీతో పాటు), తిరుమల ఎన్క్లేవ్, టీచర్స్ కాలనీ, నెహ్రూ సెంచనరీ కాలనీ జూపిటర్ కాలనీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ, సూర్య ఎన్క్లేవ్,ఎడబ్ల్యుహెచ్ఒ వేద కాలనీ, దుర్గావిహార్ ఐఒబి కాలనీ, రవి కాలనీ, సర్దార్ పటేల్ కాలనీ, చంద్రగిరి కాలనీ, పి అండ్ టి కాలనీ, అరుణ ఎన్క్లేవ్, శ్రీ నగర్ కాలనీ, భూదేవినగర్, బంజారా నగర్, ఎల్బి నగర్, శ్రీ సాయి ఎన్క్లేవ్, సాయి సాగర్ ఎన్క్లేవ్, మన్సరోవార్ బట్ లాంటి సహకార గృహ సముదాయ నివాస ప్రాంతాలు ఉన్నాయి.

తిరుమలగిరి శివారు ప్రాంతాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "HMDA List of Villages". www.hmda.gov.in. Archived from the original on 2020-01-09. Retrieved 2020-10-19.
  2. "Mandals & Villages – THE OFFICIAL WEBSITE OF HYDERABAD DISTRICT". web.archive.org. 2019-01-10. Archived from the original on 2019-01-10. Retrieved 2020-10-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]