తేరా చిన్నపరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేరా చిన్నపరెడ్డి

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 జూన్ 2019 - 4 జనవరి 2022
తరువాత ఎంసీ కోటిరెడ్డి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు పెద్ద రామ్ రెడ్డి, కోటమ్మ
జీవిత భాగస్వామి కల్పన రెడ్డి
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

తేరా చిన్నపరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తేరా చిన్నపరెడ్డి నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం, పిన్నవూర గ్రామంలో 10-1963 ఆగస్టులో పెద్ద రామ్ రెడ్డి, కోటమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1985లో పిజి పూర్తి చేశాడు.[2] ఆయన ఫార్మా రంగంలో చేసిన సేవలకు గాను 2008లో అమెరికాలోని వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

డా. తేరా చిన్నపరెడ్డి 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక 2014లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

తేరా చిన్నపరెడ్డి 2015 డిసెంబరులో తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నల్లగొండ స్థానిక సంస్థల స్థానం నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 192 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తేరా చిన్నపరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆయన శాసనమండలి సభ్యుడిగా 2019 జూన్ 19న ప్రమాణస్వీకారం చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 June 2019). "ఎమ్మెల్సీగా డాక్టర్‌ తేరా చిన్నపరెడ్డి విజయం". Sakshi. Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.
  2. Sakshi (20 February 2015). "టీఆర్‌ఎస్ వైపు టీడీపీ నేత చిన్నపురెడ్డి చూపు". Sakshi. Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.