నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్
తెలంగాణ ప్రభుత్వం
పటం
భౌగోళికం
స్థానంచార్మినార్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం, 500002
నిర్దేశాంకాలు17°21′38″N 78°28′30″E / 17.3605319°N 78.4750474°E / 17.3605319; 78.4750474
Services
పడకలు180
చరిత్ర
ప్రారంభమైనది1938

నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ప్రభుత్వ యునాని హాస్పిటల్‌) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్. జనరల్ మెడిసిన్, యునానీ మెడిసిన్ ఈ హాస్పిటల్ ప్రత్యేకత. నిజాం కాలంలో స్థాపించబడిన ఈ హాస్పిటిల్ చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఉంది.[1] ఈ ప్రాంగణంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల కూడా ఉంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

యునాని ఆసుపత్రి శంకుస్థాపనలో 7వ నిజాం అసఫ్ జా (ఎడమ), ఆర్థిక మంత్రి అక్బర్ హైదరీ (కుడి)
ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్

చరిత్ర

[మార్చు]

హైదరాబాదు రాజ్య చివరి (7వ) నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1926లో ఈ నిజామియా జనరల్ హాస్పిటల్ ను నిర్మించాడు.[2]

హాస్పిటల్

[మార్చు]

ఈ హాస్పిటల్ లో గైనకాలజీ, శస్త్ర చికిత్స, డెంటిస్ట్రీ, నేత్ర వైద్యం, పాథాలజీ మొదలైన విభాగాలు ఉన్నాయి. పక్షవాతం, ఫంక్షనల్ న్యూరోలాజికల్ డిజార్డర్స్, వైరల్ హెపటైటిస్ మూత్రపిండ కాలిక్యులి, నెఫ్రిటిస్, పైలోనెఫ్రిటిస్, మధుమేహం, డయాబెటిక్ అల్సర్స్, సైనసైటిస్, ఉబ్బసం, స్థూలకాయం, మొలలు, ఫిస్టులా-ఇన్-అనో, క్రానిక్ నాన్-స్పెసిఫిక్ అల్సర్స్, లైంగిక సమస్యలు, వ్యాధులు, వంశ రుగ్మతలకు చెందినవాటిలో ఈ హాస్పిటల్ యునానీ ఔషధ సేవలను అందిస్తుంది.[3]

వివరాలు

[మార్చు]
  1. ఇందులో మొత్తం 180 పడకలు ఉన్నాయి.
  2. హౌస్ సర్జన్‌షిప్ పూర్తి చేయడానికి 50 హాస్పిటల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి.
  3. 63మంది ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉన్నారు. 104మంది మినిస్టీరియల్, పారా మెడికల్, 4వ తరగతి సిబ్బంది ఉన్నారు.
  4. రోజుకు సగటు 600-700మంది ఔట్ పేషెంట్స్, 120-130మంది ఇన్ పేషెంట్ ఉంటుంది.

ఇతర వివరాలు

[మార్చు]

కరోనా వ్యాధి వచ్చిన సమయంలో ఈ వ్యాధి సోకిన వారిని ఈ హాస్పిటల్ చేర్చుకొని చికిత్స అందజేశారు.[4][5]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "CM on inauguration spree in Old City". The Times of India. 2011-06-06. Archived from the original on 2012-09-05. Retrieved 2021-08-26.
  2. "UNANI". Health.ap.nic.in. Archived from the original on 30 September 2011. Retrieved 2021-08-26.
  3. "Nizamia General Hospital needs repairs". The Times of India. 2 October 2003. Archived from the original on 26 September 2012. Retrieved 2021-08-26.
  4. "ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో 91 శాతం బెడ్స్ ఖాళీ.. ప్రైవేట్‌కు రోగుల క్యూ". News18 Telugu. Retrieved 2021-08-26.
  5. "Begin COVID-19 testing and treatment at Hyd's Nizamia Hospital, activists demand". The News Minute (in ఇంగ్లీష్). 2020-06-23. Retrieved 2021-08-26.

బయటి లింకులు

[మార్చు]