Jump to content

పురుషులపై హింస

వికీపీడియా నుండి
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా

యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:''

—- మనుస్మృతి

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో, అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. కానీ దురదృష్టవశాత్తూ, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక కుమార్తెగా, ఒక భార్యగా అత్యంత అరుదైన గౌరవాలను అందుకోవలసిన స్త్రీ, నేడు అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా ప్రవర్తించి తన పై ఉన్న గౌరవాన్ని తానే చెరిపివేసుకొంటున్నది. విచ్ఛలవిడి పోకడ గల పాశ్చాత్య సంస్కృతికి భారత దేశపు స్త్రీ ఏ మాత్రం మినహాయింపు కాలేదు. పరిస్థితులు తనకు ప్రతికూలించినపుడు బాధితురాలైనట్లు చిత్రీకరించుకొని, అబలగా సంఘం నుండి సానుభూతి పొందటం, చట్టపరమైన నష్టపరిహారాన్ని కోరటం; బాధించేటప్పుడు సబలగా మారి పురుషులను, అతని సంబంధీకులని మనోవేదన, శారీరక హింసలకు గురి చేయటం వంటివి చేస్తూ రెండు వైపులా పదును గల కత్తిగా మారినది. లాలన, ఆలన, పాలన, పోషణలకు మారుపేరైన స్త్రీ జాతి ఇప్పుడు పురుషజాతిని కబళించి వేయటానికే అవతరించినదా? అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నది.
కాలిఘాట్ పైంటింగ్, పురుషునిపై చీపురుతో స్త్రీ హింస (1875)
కాలిఘాట్ పైంటింగ్, పురుషునిపై చీపురుతో స్త్రీ హింస (1875)

పురుషులపై హింస అనగా పురుషుడి పై (స్త్రీలు/పురుషులు/ఇతరులు) జరిపే హింసాత్మక ఆగడాలు. ఇవి కేవలం శారీరకమో, కేవలం మానసికమో, లేదా రెండు విధాలుగానో అయ్యి ఉండవచ్చును. పురుషుడు హింసించేవాడే గానీ, హింసకు లోనవడనే అభిప్రాయం ప్రతి సంఘంలోనూ సర్వసాధారణంగా ఉంది. పురుషులపై లైంగిక దాడులు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా పరిగణించబడుతున్ననూ, ఈ సమస్యను అంతర్జాతీయ న్యాయవిధానం సైతం గుర్తించటం లేదు. అంతర్జాతీయంగా పురుషులపై ఉన్న దురభిప్రాయం ఒకవైపు అయితే, దేశ-కాలమాన పరిస్థితుల ప్రకారం, భారతదేశంలో ఈ హింస పైకి కనబడకుండా చాప క్రింద నీరు అన్న చందాన నిగూఢమై ఉంది. 1970వ సంవత్సరంలో తెలుగునాట తల్లా? పెళ్ళామా? అనే పేరుతో చిత్రం విడుదల అయినది అంటే, ఈ ఇరువురి స్త్రీ పాత్రల నడుమ ప్రతి పురుషుడూ ఎలా నలిగిపోతాడన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. వీరి విషయంలో ఏ మాత్రం సమతూకం తప్పినా పురుషుడే నిందలపాలు అవుతాడు. జీవితాంతం కష్టసుఖాలలో పాలుపంచుకొనే భార్యకు వైపు మొగ్గుచూపితే భార్యాలోలుడని, ఎన్నో కష్టాలు పడి తనని పెద్ద చేసిన తల్లి వైపు మొగ్గు చూపితే అమ్మకూచి అని ముద్ర వేయటానికి ఈ సంఘం కాచుకు కూర్చొని ఉంటుంది.

అవగాహన

[మార్చు]

పురుషులపై హింసపై కూడా చట్టాల అమలు లోపభూయిష్టముగానే ఉన్నవి అని అంతర్జాతీయ న్యాయనిపుణుల వాదన. చట్ట వ్యవస్థలు కూడా పిల్లల/స్త్రీల పై జరిగే అత్యాచారాలనే పరిగణలోకి తీసుకొంటాయి గానీ పురుషుల పై జరిగే అత్యాచారాలను గాలికి వదిలివేస్తున్నాయి. పురుషులు బలవంతులని, స్త్రీలు అబలలని, పురుషులే అత్యాచారాలకి పాల్పడతారని, స్త్రీలు అవి భరించటం తప్పితే ఏమీ చేయలేరనే భావనయే సర్వత్రా నెలకొని ఉండటం దీనికి కారణం. స్త్రీలచే హింసకి గురైన పురుషుల కోకొల్లల కథనాలు, ఈ భావనలో ఎటువంటి మార్పునూ తేలేకపోయాయి. పురుషులు, బాలురపై హింసకు వ్యతిరేకంగా అవగాహన కలిగించేందుకు, ఏటా అక్టోబరు నెలను "పురుషులు, బాలురపై హింసకు వ్యతిరేకంగా అవగాహన కలిగించే నెల"గా గుర్తించారు.

పురుషులపై గృహహింస

[మార్చు]

పురుషులపై గృహహింస అనగానే భర్త పట్ల క్రౌర్యం అని అనిపిస్తుంది. కానీ ఒక కుటుంబంలో పురుషుడు కేవలం భర్తయే కాదు.

ఉదా:

- మొదలగు ఇతర రక్తసంబంధాలు, బాంధవ్యాలలో పురుషుడు అనేక విధాలుగా ఎదుర్కొనే హింసయే పురుషులపై గృహహింస.

పురుషులపై గృహహింస కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా చేయగలరు. సాటి పురుషుడిని అర్థం చేసుకోలేకపోవటం, ఇతరుల మాటలకు ప్రభావితం కావటం మూలాన పురుషుడే పురుషుడి పై గృహహింసకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి.

ఉదా:

  • తండ్రి స్థానంలో ఉన్న పురుషుడిపై పిల్లలకు తల్లే నూరిపోయటం. సరైన మార్గంలో తన సంతానం నడవాలని కోరుకొనే పురుషుడు ఏ కాస్త కఠినంగా వ్యవహరించినా, దానిని అదునుగా తీసుకొని, పిల్లలను మచ్చిక చేసుకొని తండ్రి గురించి పిల్లలకు చెడుగా చెప్పటం. అర్థం చేసుకోలేడని, అసమర్థుడని, డబ్బు మొత్తం తన దుర్వ్యసనాలకే వృథా చేస్తున్నాడని, తమ కోసం ఆయన ఏమీ చేయట్లేదని తల్లి పిల్లల మనసులలో విషబీజాలు నాటే ఆస్కారం ఉంది. దీనితో తండ్రిపై పిల్లల లేతమనసులలో విపరీతమైన ద్వేషభావన ఏర్పడి అది జీవితాంతం వీడకుండా పోయే ప్రమాదం ఉంది. దీనితో కన్న కొడుకులే, తండ్రికి పురుష శత్రువులుగా మారే అవకాశమూ ఉంది.
  • కూమారుడి స్థానంలో ఉన్న పురుషుడి భుజస్కందాలపైనే కుటుంబ భారాన్ని మొత్తం మోపటం. రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చినా అతని జీవితానికి కావలసిన కనీస సదుపాయలను కూడా మరచి అతని సంపాదనను కుటుంబం కోసం హరించివేయటం. సాధారణంగా ఈ బాధ్యతలు పెద్ద కుమారునిపై వేయబడ్డా, చిన్న కుమారులపై కూడా అవసరానికి మించి ఆధారపడిన దాఖలాలు ఉన్నాయి.
  • భర్త తండ్రి అయిన మామపై లైంగిక వేధింపు ఆరోపణలు వేయటం. అతనిని ఆత్మహత్య చేసుకొనేలా చేయటం.[1]
  • కుమార్తె భర్త అయిన అల్లుడికి తగిన గౌరవమర్యాదలు ఇవ్వకపోవటం. అతని తల్లిదండ్రుల నుండి అతనిని వేరు చేయలని చూడటం. వారి ఆలన-పాలనలకు అతను ఖర్చు చేయకూడదు అని అతనితో చెప్పటం.
  • ఆస్తి తగాదాలలో సోదరుల మధ్య తలెత్తే విభాదాలు ఒక్కోమారు సోదరహత్యకు కూడా దారి తీస్తాయి.

గృహహింస

[మార్చు]

గృహహింసకి గురైన పురుషులు దాని గురించి ప్రస్తావించటానికి గానీ, దాని పై సహాయం తీసుకోవటానికిగానీ సుముఖంగా ఉండరు. హింసలో పురుషులు బాధితులై ఉండరనే భావన ప్రజలలో నరనరాన జీర్ణించుకుపోవటమే దీనికి కారణం. స్త్రీలు అబలలైనప్పటికీ, వారు ప్రయోగించే ఆయుధాలు, పెట్టే మానసిక హింసలని లెక్కించపోవటం మూలాన వలన వివాహ, వివాహేతర సంబంధాలలో పురుషుని పై స్త్రీ కొనసాగించే హింస సూక్ష్మవిషయంగా పరిగణింపబడుతోంది.

లైంగిక వేధింపుల ఆరోపణలు

[మార్చు]

రోహ్‌తక్కు చెందిన ఇరువురు అక్క-చెల్లెళ్ళు వారిపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేశారు. తర్వాత అవి కేవలం ధనదాహంతో చేసిన ఆరోపణలు అని తేలినవి.

సేవ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు స్వరూప్ సర్కార్ -

Rape is more painful for a man than a woman. When a woman gets raped there is society and police and law to support her, but when a man gets raped there is no law, no support system, and no one is even going to understand his pain.
మానభంగం స్త్రీకంటే కూడా పురుషునికే బాధాకరమైనది. స్త్రీపై అత్యాచారం జరిగినపుడు మద్దతివ్వటానికి సంఘం, చట్టాలు, న్యాయాలు ఉన్నవి. కానీ పురుషునిపై అత్యాచారం/మానభంగం జరిగితే మాత్రం ఏ చట్టం, ఏ వ్యవస్థ లేదు సరికదా, పురుషుని బాధను అర్థం చేసుకొనేవారు కూడా లేరు.

[2]

అసభ్య ప్రవర్తన ఆరోపణలు

[మార్చు]

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక యువకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతనికి తగిన గుణపాఠం చెప్పాలని, సాంఘిక మాధ్యమాలలో జస్లీన్ కౌర్ అనే యువతి అందరి మద్దతును కూడగట్టినది. పోలీసులు ఆ యువకుడిని అరెస్టు కూడా చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల తెలిపిన దానిని ప్రకారం జస్లీన్ యే ఆ యువకుడిని ముందు కవ్వించినదని, తర్వాత అతను సరదాగా అన్న మాటలని మాత్రం రికార్డు చేసి ప్రజలకు ఆ వీడియోలను అసభ్య ప్రవర్తనగా చిత్రీకరించినది అని తెలిసింది. పైగా విచారణ సమయంలో ప్రత్యక్ష సాక్షులను చూడగానే జస్లీన్ ఆమడ దూరం పరిగెత్తి పారిపోయింది. తర్వాత జస్లీన్ ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ, కళాశాల ఎన్నికలలో పాల్గొంటున్నదని, ఇందులో గెలవటానికి సానుభూతి పొందటానికే ఇటువంటి చర్యకు ఒడిగట్టినదని వెల్లడి అయినది.

పతిహత్య

[మార్చు]

బెంగుళూరులో చిత్తూరుకి చెందిన వివాహిత తన కంటే చిన్న వయసుడైన బంధువుతోనే వివాహేతర సంబంధం ఉండటం వలన, భర్తని హతమార్చి తల్లిదండ్రుల సహాయంతో నగర పొలిమేరలో అతని శవాన్ని పూడ్చిపెట్టినది. తనపై నేరారోపణలేవీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మరిదికి ఫోన్ చేసి, ఆయన ఊరు బయలుదేరాడని, క్షేమంగా వచ్చోడో లేదో కనుక్కుందామని ఫోన్ చేశానంది. తన అన్నయ్య సంసార జీవితంలో ఎన్నడూ ప్రేమ చూపని వదిన ఒక్కసారిగా ఇంత ప్రేమ ఎందుకు చూపుతోందన్న అనుమానం వచ్చి మరిది పోలీసులకి ఫిర్యాదు చేయటంతో నిజాలు బట్టబయలయ్యాయి. కొన్ని వార్తాపత్రికలు మినహా, ఈ ఘటనని దేశంలోని ఏ టీవీ ఛానల్ ప్రసారం చేయకపోవటం కొసమెరుపు.

లైంగిక వేధింపులు

[మార్చు]

ఢిల్లీలో ఒక యువతి తన ఇంటి వరకూ ఆటోలో ప్రయాణించింది. డబ్బు ఇవ్వటానికి ఆటో డ్రైవర్ ని మొదటి అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ లోనికి రమ్మన్నది. అతనికి మంచి నీటిని ఇచ్చి లోపలి నుండి గడియలని బిగించి, అతనితో అసభ్యంగా ప్రవర్తించటం మొదలు పెట్టినది. అతను నిరాకరించటంతో అతనికి మద్యాన్ని ఇవ్వజూసింది. ఈ బాగోతాన్నంతా తనతో బాటు తన ఇంటిలో ఉంటోన్న ఒక విదేశీ వనిత వీడియో తీసినది. ఎంతకీ ఆటో డ్రైవర్ దారికి రాకపోవడంతో అతని దుస్తులని చించివేసి ఆ యువతి అతనిపై విరుచుకు పడినది. అతనిని ఎలా లొంగదీసుకోవాలో చర్చించటానికి ఇద్దరు యువతులు పక్క గదిలోకి వెళ్ళగానే ఆటో డ్రైవర్ బాల్కనీలోనికి జారుకొని అక్కడి నుండి క్రిందకు దూకేశాడు. తనని తాను రక్షించుకొనే ప్రయత్నంలో అతని కాళ్ళు విరిగాయి. ఆటోడ్రైవర్ పోలీసులకి ఫిర్యాదు చేయగా వారు ఆ ఇంటిని తనిఖీ చేశారు. ఆ ఫ్లాట్ లో ముప్ఫైకి పైగా ఇతర ఆటోడ్రైవర్ ల లైసెన్సులు దొరకటంతో వారందరితోనూ ఆ యువతి ఇదే విధంగా ప్రవర్తించి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. నిర్భయ ఘటనలో కోడై కూసి, నిర్భయ చట్టం తేవటంలో కీలకమైన పాత్ర పోషించిన యావత్ ప్రసార మాధ్యమ రంగం ఈ ఘటనపై నోరు మెదపకపోవటం విడ్డూరం.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. పురుషుల హక్కులు
  2. భర్త పట్ల క్రౌర్యం
  3. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

మూలాలు

[మార్చు]
  1. "మామను ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిన కోడలికి బెయిలు నిరాకరణ (ద టెలిగ్రాఫ్ - 24 జూలై 2010)". Archived from the original on 2015-09-24. Retrieved 2015-10-24.
  2. "బజ్ ఫీడ్ న్యూస్ 1 డిసెంబరు 2015". Archived from the original on 2016-03-07. Retrieved 2015-12-05.
  1. https://web.archive.org/web/20150717183406/http://www.bangaloremirror.com/bangalore/crime/After-woman-kills-techie-husband-her-parents-help-get-rid-of-his-body/articleshow/47620297.cms
  2. https://web.archive.org/web/20170528222243/https://in.news.yahoo.com/woman-molested-auto-driver-arrested-091239804.html