వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 143: పంక్తి 143:
Greetings వైజాసత్య!!Could I ask you to translate [[:en:Qin Shi Huang]]([[m:List of articles every Wikipedia should have|listed in 1000 vital articles]]) and [[:en:Wuhan]](a chinese city,my hometown) into your language?You may shorten them as possible to contain only the basic informations,one or two sentences are enough. If you want me to translate any article into Chinese or Vahcuengh,contact me without hesistation.
Greetings వైజాసత్య!!Could I ask you to translate [[:en:Qin Shi Huang]]([[m:List of articles every Wikipedia should have|listed in 1000 vital articles]]) and [[:en:Wuhan]](a chinese city,my hometown) into your language?You may shorten them as possible to contain only the basic informations,one or two sentences are enough. If you want me to translate any article into Chinese or Vahcuengh,contact me without hesistation.
Thank you very much!--[[za:User:Biŋhai|Biŋhai]]
Thank you very much!--[[za:User:Biŋhai|Biŋhai]]

== నా పేరును తెలుగులోకి మార్చగలరా? ==

Kiranmayee నుంచి కిరణ్మయి గా మార్చగలరా? ధన్యవాదాలు!
[[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 20:05, 29 జూలై 2009 (UTC)

20:05, 29 జూలై 2009 నాటి కూర్పు


కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. నెనర్లు :)

సత్యాగారూ! నమస్తే. మధ్యలో కలగచేసుకుని సద్ది చెప్పినందుకు ధన్యవాదములు. ఒక పరిణితి చెందిన నిర్వాహకునిగా మంచి పాత్ర నిర్వహించారు. కొన్ని కొన్ని మాటలు ఆవతలి వారు ఎందుకన్నది తెలియదు, మనం వాటిని అర్ధం చేసుకోవచ్చును లేదా అపార్ధం చేసుకొనవచ్చును. చంద్రకాంతరావు గారు "సబ్యత" వంటి మాటలు వాడేసరికి కొంత కోపం వచ్చిన మాట నిజం. OK ఇక ఈ విషయం సాగతీయదలుచుకోలేదు. వారి చర్చా పేజీలోకూడ నా స్పందన వ్రాసి విషయం ముగించాను. ఇక ఇక్కడ బెంగుళూరులో ఇంకా పూర్తిగా స్థిరపడలేదు. మరి కొన్ని రోజులలో ఇంటర్‌నెట్ కనెక్షన్ రావచ్చును. మళ్ళీ చురుకుగా రచనలు/దిద్దుబాట్లు చెయ్యలనే ఉన్నది. మరొక్కసారి మీకు ధన్యవాదములతో శలవు.--S I V A 10:10, 4 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సహృదయంతో అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు --వైజాసత్య 16:31, 8 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణల అవసరం

వైజా సత్యగారూ నమస్తే. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంటినుండి వికీలో వ్రాయగలుగుతున్నాను. నేను వికీలోకి వచ్చిన తరువాత మీరు మరియు కాసుబాబుగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మీరిచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను అనేక వ్యాసాలు, దిద్దుబాట్లు చెయ్యగలిగాను, చెయ్యటానికి ఉత్సాహం వచ్చింది. కాని, ఈ మధ్య జరిగిన (అతి చిన్న విషయం మీద)జరిగిన సంఘటన(ఎంత కాదని మర్చిపోదామన్నా) చాలా చీకాకు పరుస్తున్నది, మళ్ళీ వ్రాయటానికి మనస్కరించటంలేదు. అందువలన దయచేసి, నాకు కొన్ని వివరణలు ఇవ్వగలరా.

  1. ఈ వారం బొమ్మగా ఒక బొమ్మను పెట్టటానికి ఎన్ని రోజులు, గంటలు,నిమిషాలు, సెకండ్లు వేచి చూడాలి లేదా వ్యవధి ఉండి తీరాలి. అలాంటి నియమం గనుక ఉంటే ఆ నియమం ఆ పుటలోనే ఎందుకు పొందుపరచలేదు. ఆపైన ఈ పని నిర్వాహకులే చెయ్యనక్కర్లేదు, సభ్యులెవరైనా చొరవగా చెయ్యచ్చు అని ఎందుకు వ్రాశారు.
  2. వెరొకరి చర్చా పుటలో మరొక సభ్యుడు వ్యాఖ్య వ్రాసేప్పుడు, ఇక్కడే వ్రాయాలని (కిందనే) అని నియమేమన్నా ఉన్నదా? ఉంటే ఆ నియమం ఎక్కడ వ్రాసి ఉన్నది?
  3. నేను పైన ఉదహరించిన వాటిగురించి లిఖిత నియమాలు లేక పోతే,ఎవరైనా సభ్యుడుగాని, నిర్వాహకుడుగాని లేని నియమాన్ని ఉదహరిస్తే సామాన్య సభ్యుని పరిస్థితి ఏమిటి.
  4. ఏదైనా విషయం గురించి ఇతర సభ్యులు వ్రాయదలచుకొన్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన చర్చా పుటలో కాకుండా, నేరుగా ఆ సభ్యుని చర్చా పుటలో వ్రాయవచ్చునా లేక నిర్వాహకులకు అటువంటి ప్రత్యేక అధికారాలు ఏమన్న ఉన్నాయా. ఉంటే, వికీ నియమాలలో ఎక్కడ ఉన్నాయి.
  5. విషయానికి సంబంధించిన చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్య, నాకు సంబంధించిన చర్చా పుటలో వ్రాస్తే, ఆ వ్యాఖ్య నా చర్చా పుటలో నేను అనవసరం అని బావిస్తే ఆ మాటే వ్రాసి నేను తొలగించకూడదా
  6. చిన్న అభిప్రాయ భేదం వస్తే నిర్వాహకుడైనవారు(ఆ సభ్యునితో ఏమాత్రం చనువు లేని), సభ్యుని వెంటనే "నువ్వు" "నీవు" అని సంభొదించవచ్చునా(మనం వ్యాసాలలో ఎంత గొప్పవారి గురించైనా అతను అని వ్రాయటానికి ఈ విషయం ఒకే గాటన కట్టలేమని నా మనవి), ఒక చిన్న విషయానికి "సభ్యత" వంటి మాటలు వ్రాయవచ్చా.

నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే.

ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--S I V A 03:05, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో చాలా నియమాలు అభివృద్ధి క్రమబద్దీకరించడానికి అభివృద్ధి చెందుతున్న కొద్ది ఏర్పరచుకొన్నవే. మీకో చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక ఊళ్లో ఒక కాలిబాట ఉందనుకోండి అందులో ఎవరిష్టం వచ్చినట్టు వస్తూ వెళుతూ ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లు, రైట్ అఫ్ వేలు, ఏడమవైపునే నడవటాలు ఇవన్నీ ఉండవు. కానీ ఆ కాలిబాటలో రద్దీ ఎక్కువై అది అభివృద్ధి చెందే కొద్ది కాస్త ఆ విషయం ఆలోచన చేసిన వ్యక్తి వచ్చి బాటలో నడిచేవాళ్లందరూ ఎడమవైపున నడుస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంటాడు. చాలామంది ఏదో ఒక పద్ధతి బాగానే ఉంది అనుకుని ఆయన చెప్పింది పాటించడం మెదలెడతారు. అదే కాలక్రమంలో మరింత ధృడమై ఒక నియమం అవుతుంది. అలా ఏర్పడే తొలి దశలోనే కొందరు ఎడమ వైపు ఎందుకు నడవాలి కుడివైపున నడిస్తే ఏం పోయింది అని ప్రశించవచ్చు. నష్టమేం లేదు అలాగే నిక్షేపంగా నడవవచ్చు. అలా నియమాలు ఏర్పడే ముందస్తుగా కొంత ఇబ్బంది ఎదురౌతుంది దానికి అనుగుణంగానే కాస్త ఇలా చేస్తే బాగుంటుందేమో ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రతిపాదిస్తారు.
ఇక అసలు విషయానికొస్తే బొమ్మ చేర్చిన ఎన్ని ఘడియలు, విఘడియలకు అది ఈ వారం బొమ్మగా పెట్టగలమో ఇప్పటివరకు తెలుగు వికీలో నియమమేమి లేదు. ఇక్కడ చిన్న ఇబ్బంది ఎదురైంది కాబట్టి ఇప్పుడే మనం కలిసి ఒక నియమం సృష్టిద్దాం. ఒక బొమ్మను ఈ వారం బొమ్మగా పెట్టే ముందు దాన్ని ఈ వారం బొమ్మ పరిగణన అన్న మూస తగిలించి దిన్నీ మొదటి పేజీలో పెట్టాలనుకుంటున్నాం అని తెలియజేయటం కొన్నాళ్ళుగా నడిస్తున్న సంప్రదాయామే. అది కొత్తేమీ కాదు. అలా చేయటం వలన అది ప్రదర్శించడానికి ఇతర సభ్యులకేమైనా అభ్యంతరాలు కానీ ఇతర చర్చలు కానీ చేయటానికి కొంత సమయం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ వారం బొమ్మ పరిగణన మూస అంటించిన తర్వాత కనీసం ఒక నెల రోజులైనా ఆగి దాన్ని మొదటి పేజీలో ప్రదర్శిస్తే బాగుంటుంది. మీరు ప్రదర్శించాలనుకున్న బొమ్మకు ఎవరూ అభ్యంతరపెడతారని కాదు, ఒక పద్ధతి కోసమని అంతే. మీకు ఇతర సూచనలు, ఇతర పద్ధతులు కానీ తొచితే అలాగే చేద్దాం.
ఎవరైనా ఒక పద్ధతిని ప్రతిపాదిస్తే కాలిబాట విషయంలో జరిగినట్టు మొదట ఆ పద్ధతినే ఎందుకు పాటించాలి అని కొంతమందికి అనిపించవచ్చు. అది సహజం. ఎడమవైపే వెళ్ళాలని ప్రతిపాదించిన వ్యక్తిని అలానే ఎందుకు చేయాలో అడిగి తెలుసుకోవచ్చు. అది నచ్చకపోతే ప్రత్యామ్నాయ పద్ధతిని మీరూ ప్రతిపాదించవచ్చు. నియయాలు చేయటానికి నిర్వాహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. చాలా మందికి సభ్యులకు ఏది సబబుగా అనిపిస్తే అదే నియమమౌతుంది. ఉదాహరణకు నాతో పాటు కొందరు నిర్వాహకులు, సభ్యులకు తెవికీ వ్యాసాల్లో ఏకవచనమే ఉపయోగిస్తే బాగుంటుందని అనిపించింది. దాన్ని రచ్చబండలో చర్చించాం. ఆ నియమానికి మద్దతుగా కొన్ని విషయాలను సేకరించి నేను ఒక నియమపు పేజీ వ్రాశాను. రాజశేఖర్ గారితో పాటు కొందరు సభ్యులకు ఆ నియమాన్ని పాటించడం సబబుగా అనిపించలేదు. అందుకే ఆయన వ్రాసేవి ఆయన బహువచనంలోనూ, నేను వ్రాసేవి ఏకవచనంలోనూ ఉంటాయి. చివరకు ఏ పద్ధతి ఎక్కువమంది సభ్యులు పాటిస్తే అదే నెగ్గుతుంది. ఇలాంటి పద్ధతుల్లో తేడా ఉన్నా అందరం కలిసి పనిచేయటానికి ఏనాడూ అడ్డురాలేదు. అయితే మీరు ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రతిపాదిస్తే దాన్ని గల కారణాలు వివరిస్తే చాలా మంది సభ్యులు ఆ పద్ధతి ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
క్రిందనే వ్రాయాలని నియమేమీ లేదు. అదో ఆనవాయితీ మాత్రమే. కొత్త సందేశం వచ్చిందనగానే వెతుక్కోకుండా క్రిందనే ఉంటుందనే ఒక సౌకర్యం. ఆంగ్ల వికీలో నియమంగా ఉందో లేదో కానీ మర్యాదపూర్వకంగా పాటిస్తుంటారు. మీరు పైనే ఎందుకు వ్రాయాలో అని వివరించండి అది బాగుందనుకుంటే అలాగే వ్రాద్దాం ( కాలిబాట ఉదాహారణ లాగా కుడో, ఎడమో ఏదో ఒకటి పద్ధతుంటే బాగుంటుంది). చంద్రకాంతరావు ఇప్పటివరకు ఉపయోగంలో ఉన్న పద్ధతి చెప్పారంతే. నిజానికి వికీలో ఖచ్చితంగా అమలుపరచే నియమాలు ఐదే ఉన్నాయి. మిగిలినవి మార్గదర్శకాలు మాత్రమే.
ఒక వ్యాసం గురించి చర్చను సాధారణంగా ఆ వ్యాసం చర్చా పేజీలోనూ, వెంటనే దానికి సంబంధించిన సభ్యులు కూడా చూడాలనుకుంటే ఆ సభ్యుల చర్చా పేజీల్లోనూ వ్రాస్తారు. ఇది కూడా ఒక పద్ధతి మాత్రమే.
చర్చా పేజీలలో విషయం ఆ సభ్యుని చెందుతుందా, వికీకి చెందుతుందా అన్ని విషయం ఆంగ్ల వికీలో సుదీర్ఘమైన తాత్విక చింతన జరిగింది. దాని పర్యవసానంగా సభ్యుల చర్చాపేజీలను వారు తొలగించమని అడిగినా పూర్తిగా తొలగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెవికీలో దీని గురించి చర్చించలేదు కానీ, చర్చా పేజీలను తొలగించడం అంతమంచి పద్ధతి కాదు. దానికి అనేక హేతువులున్నాయి. అవి తర్వాత వ్రాస్తాను. మీరు పైన వ్రాసిన పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అవలంబిగలరనుకుంటే ఇది మొదటిది కావాలని నా కోరిక.
నువ్వు, మీరు అన్నదాని గురించి నేను చర్చించలేను. అది మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. రాయలసీమలోనూ, తెలంగాణలోనూ నువ్వు అనటం పెద్ద అగౌరవసూచకంగా భావించరు అని మాత్రం చెప్పగలను. వికీ చాలా ప్రత్యక్ష మాధ్యమం కాబట్టి అవతలి వ్యక్తికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వదిలెయ్యండి. ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగానో, ఫోన్లోనో అయితే రెండు నిమిషాల్లో అనుకున్నదనుకున్నట్టు వివరంచగలిగి ఉండేవాడిని అయితే ఒక పేజీ మొత్తం టకటకలాడించినా మీకు సరైన అర్ధంలో స్ఫురిస్తుందో లేదో తెలియదు. చంద్రకాంతరావు గారు ఇప్పటిదాకా ఉన్న పద్ధతులను వివరించే ప్రయత్నం చేశారనుకుంటాను. అది ఆ స్పిరిట్ తోనే తీసుకొని వదిలెయ్యండి.
చివరిమాటగా వికీలో పట్టూ విడుపూ రెండూ ఉంటాయి. అందరూ ఎవరి పద్ధతిని వారు వెళితే ఇది హైదరాబాదు రోడ్డవుతుంది. కానీ మార్గదర్శకాలు చేయటానికి, వాటిని ప్రభావితం చేయటానికి ప్రతి సభ్యునికి అధికారం ఉంది. నిర్వహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. వికీ పద్ధతులలో అనుభవమున్న వాళ్ళు కొత్తవాళ్లకు మార్గదర్శకం చేస్తూ ఉండటం సాధారణమే దానికి నిర్వాహకుడే కానక్కర్లేదు.

వైజాసత్య 04:25, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిర్యాదు

సత్యాగారూ, నమస్తే. కాసుబాబుగారి చర్చాపుటలో ఈ క్రింది ఫిర్యాదు వ్రాశాను. దయచేసి, మీరు ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ లో పాలు పంచుకోమని మనవి.--S I V A 18:11, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి దయచేసి కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా సంయమనం ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా. చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది ఏమిటీ దాష్టీకం, పిడివాదం సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా. -- C.Chandra Kanth Rao-చర్చ 20:47, 26 ఏప్రిల్ 2009 (UTC)

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb" నుండి వెలికితీశారు


ఇంతవరకు జరిగిన సంఘటనలు

  • నేను ఒక మంచి బొమ్మను(ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన కార్టూన్ పాత్ర సామాన్యవ్యక్తి విగ్రహం) వికీలోకి ఎక్కించి, నలుగురికీ బాగా తెలియాలన్న సంకల్పంతో, వెంటనే ఈ వారపు బొమ్మ మూస తగిలించి, అప్పటికే ఉన్న బొమ్మల వరసలో చివరగా ఉంచాను. నేనేమి ఉన్న వరుస చెదర్చలేదు, ఈ బొమ్మకు ప్రాధాన్యమిచ్చి ఇతర బొమ్మలను వెనుకకు తొయ్యలేదు. ఒక నిర్వాహకుల వారు, ఈ బొమ్మ ఏమిటి? బొమ్మ ప్రాశస్త్యమేమిటి? అన్న విషయాలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఈ వారపు బొమ్మ పుటలో లేని నియమాలను ఉట్టంగిస్తూ బొమ్మ ను ఈ వారపు బొమ్మల వరుసలోనుండి తొలగించారు. ఆపైన ఆ బొమ్మ చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్యను నా చర్చా పుటలో వ్రాశారు. అటువంటి వ్యాఖ్య నా చర్చా పేజీలో ఉండటం అనవసరం అని తోచి, అదే మాట వ్రాసి తొలగించాను.
  • దీనికి ఈ నిర్వాహకులవారు మళ్ళీ నా చర్చా పుటలో "ఇది సభ్యత కాదు" అన్న హెడ్డింగు పెట్టి ఎమేమో వ్రాసి తన అక్కస్సును వెళ్ళగక్కారు. ఇంత చిన్న విషయానిమి సభ్యత వంటి మాటలు వ్రాసి ఆవతలి వారిని క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయటం భావ్యం కాదని తలచి, నేను ఆ నిర్వాహకుని పుటలో హెడ్‌మాస్టర్ లాగ ప్రవర్తించవద్దని, సభ్యులను నిరుత్సాహపరచవద్దని నా వ్యాఖ్యలు వ్రాశాను. దానికి వారుకూడ తన చర్యలను సమర్ధించుకుంటూ తాను వ్రాయగలిగినది వ్రాశారు. నేనుకూడ సామరస్యపూర్వకంగ స్పందిస్తూ విషయాన్ని ముగించాను.
  • ఈలోగా దేవాగారు, ఈ నిర్వాహకులవారి చర్చాపుటలో సహనం పాటించమని వారిని కోరుతూ రెండు వ్యాక్యాలువ్రాస్తే, దానికి వీరు దాదాపు పేజీడు వ్యాఖ్యవ్రాసి అందులో చాలా ఇండైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇది చూసిన నాకు అనిపించింది, అసలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, నియమాలు ఏమిటి తెలుసుకుందామని.
  • కాబట్టి మన వికీ రూల్స్ ప్రకారం మూడవ వ్యక్తులను (వైజా సత్య గారిని, కాసుబాబుగారిని)వివరణ కావాలని అడిగాను. ఈ నిర్వాహకుడి తొందరపాటుతనం ఇంతకుముందే తెలుసు కనుక, నేను వివరణలు అడగటానికి పురికొల్పిన సంఘటనలకు కారణమైన వారు దయచేసి కలుగచేసుకొనవద్దు అనికూడ చివరలో వ్రాశాను(వారి పేరును ఎక్కడా కూడ వ్రాయలేదు).
  • వైజా సత్యగారు ఎంతో పెద్దమనిషి తరహాలో నాకు కొంత సంయమనపరచటానికి చల్లటి మాటలతో నా చర్చా పేజీలో వ్యాఖ్య వ్రాశారు. కాసుబాబుగారు, లైట్ తీసుకోండి అన్నారు. నేను సత్యా గారు వ్రాసిన పాయింట్లకు నా పక్కనుండి కొన్ని సూచనలు (వారు వారి వ్యాఖ్యలో కోరిన ప్రకారం)వ్రాద్దామనుకున్నాను.
  • ఈలోగా, ఈ నిర్వాహకులవారు తన తోటి నిర్వాహకులైన సత్యాగారు, కాసు బాబుగారు వ్రాసిన వ్యాఖ్యలు లెక్క చెయ్యకుండా(వీరి వ్యాఖ్యలకిందే ఈ నిర్వాహకులవారు వ్రాశారు) ఎక్కడలేని తామసాన్ని ప్రదర్శిస్తూ, నన్ను ఏకవచన ప్రయోగం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు(పైన కాపీ చేసినవి). ఇప్పటికి కూడ నేను నా సభ్యతను కోల్పోకుండా వారిని గౌరవంగానే సంభోదిస్తున్నాను.

నిర్వాహకుడైనటువంటివారికి తామసం పనికిరాదు. ఓర్పు అవసరం అసహనం పనికిరాదు. విషయం విలువ పట్టించుకోకుండా ఎక్కడా వ్రాతలో కనపడని నియమాలు బోధించటానికి ప్రయత్నించటం,తాను చెప్పినదే వేదమన్నట్టుగా వ్యవహరించటం, దురుసైన భాష, పిడివాదం కాక మరేమవుతుంది. సామాన్య సభ్యులమీద కోప తాపాలు చూపటం, అనుచిత భాష వాడటం, తటాలున (at the drop of a hat, with least provocation)ఆవతలి వ్యక్తిని ఏకవచన ప్రయోగం చెయ్యటం, సభ్యత అంటూ వారి కారెక్టర్ గురించి వ్యాఖ్యలు చెయ్యటం ధాష్టీకం కాక ఏమిటి. వికీ అంటే ఈ నిర్వాహకుల వారు తమ సొంత జాగీర్దారు అనుకుంటున్నారా. మాట్టాడితే నేను గమనిస్తున్నాను, నేను గమనిస్తున్నాను అని వ్యాఖ్యలు. సామాన్య సభ్యులు కూడ గమనిస్తూనే ఉంటారు వారు చేస్తున్న పనులు, చేస్తున్న వ్యాఖ్యలు. వారు వ్రాసిన ప్రతి మాటలోను తాను నిర్వాహకుడినన్న అహంకారం తొణికిసలాడుతూ ఉంటుంది. నేను వికీలో చేరినది మొదలు కాసుబాబు, వైజాసత్య, రాజశేఖర్ గార్లు తదితర నిర్వాహకులు ఎంతో చక్కగా తోటి సభ్యులను ప్రోత్సహిస్తూ, అవసరమైన చోట సున్నితంగా చక్కటి ఆహ్లాదకరమైన భాషలో వారిని సరిచేస్తూ చెప్తూంటారు. వారెక్కడ, ఈ నిర్వాహకులవారెక్కడ

నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.

నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--S I V A 17:58, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కార్టూనిస్ట్‌ల మీద వ్యాసాలు

సత్యా గారూ! నమస్తే. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మరిన్ని వ్యాసాలు, శంకు, సత్యమూర్తి, బాలి, గీతా సుబ్బారావు, AVM, శ్రీధర్ లగురించి వివరాల సేకరణలో ఉన్నాను. ఈ వ్యాసాలు కూడ త్వరితగతిన పూర్తి చెయ్యాలని నా ఆకాంక్ష. పాయింట్ల విషయం మీద మరొక్కసారి అవలోకించి అవసరమైన మార్పులు చెయ్యటానికి ప్రయత్నిస్తాను. వేటపాలెం గ్రంధాలయంలో కీర్తి శేషులు భగవాన్ గారి కార్టూన్లు ఉన్నాయని తెలిసింది. ఆ దగ్గరలో ఉన్న సభ్యులెవరైనా మీకు తెలిస్తే, వారికి ఆ కార్టూన్లను సేకరించమని చెప్పగలరా. అనుమతి విషయం ప్రముఖ కార్టూనిస్ట్ బాబు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను సంప్రదించి ఉంచారు. ఈ కార్టూన్లు కూడ లబించినట్లయితే, పూర్తిగా మరుగునపడిపోయిన మరొక ప్రముఖ కార్టూనిస్ట్ గురించి సమగ్ర వ్యాసం తయారవుతుంది.--S I V A 01:21, 10 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మూసల అతికింపు

వైజాసత్య గారు, 19వ శతాబ్దం‎ మరియు 20వ శతాబ్దం‎ మూసలను ఆయా పేజీలలో బాటు ద్వారా అతికించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:25, 3 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మధ్య ఇంట్లో ఇంటర్నెట్టు లేక ఆ పని చేపట్టలేకపోయాను. రెండ్రోజుల్లో పూర్తి చేస్తాను --వైజాసత్య 09:48, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

NOT ABLE TO WRITE IN TELUGU

Suddenly, I found today (04 01 2009) that I am unable to write in Telugu in Wiki. This is happening while I am logged in. When I am not logged in, I am able to write in Telugu. This is quite strange phenomenon. Can youkindly let me know, what could be the reason and how to rectify this.--S I V A 07:31, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞుడిని

వైజాసత్యగారూ, నమస్తే, నాపై ఉంచిన విశ్వాసానికి, నా నిర్వాహక హోదా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు, కృతజ్ణుణ్ణి, ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 04:55, 24 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • వైజాసత్య గారూ, నమస్తే నాకు నిర్వాహకునిగా ప్రకటించి మరింత బాధ్యతాయుతుడిగా చేసినందుకు, మనఃపూర్వక కృతజ్ఞతలు, తెవికీ అభివృద్ధికి నా శాయశక్తులా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని విన్నవిస్తున్నాను. సోదరుడు అహ్మద్ నిసార్ 05:39, 29 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మేళకర్త రాగాలు

మేళకర్త రాగాలు మూసలో ఇంకా లింకులు కొన్ని కనిపిస్తున్నాయి. వీటిని మార్చాల్సినదిగా అభ్యర్ధిస్తున్నాను. ఇంగ్లీషు వికీ en:Melakanta రాగాలలోని అన్ని రాగాల ప్రాథమిక లక్షణాలకు స్వరాల స్థితి లక్షణాలను తెలుపుతూ బొమ్మలు ఉన్నాయి. ఇవి తెలుగులోకి తీసుకొని వస్తే చదివేవాళ్ళకు ఇంకా సులభంగా అర్ధం అవుతుంది. ఈ సహాయం మీరు చేయగలరని భావిస్తున్నాను. ఇవి కామన్స్ లో ఉన్నది లేనిదీ తెలియడం లేదు. ధన్యవాదాలు.

ఈ రాగాలకు సంబంధించిన కీర్తనలకు నేను ఇచ్చిన వికీమూలాల లింకులు సరిగా కనిపించడం లేదు. కారణం తెలియదు. ఒక్కసారి చూచి సవరించండి.Rajasekhar1961 06:07, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, మూసలో లింకులను సవరించాను. ఇప్పుడు మూస రంగు పోయినట్టుంది. అది సరిచేస్తాను. స్వరాల స్థితి లక్షణాల బొమ్మలన్నీ కామన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ పేరుతోనే ఇక్కడ నేరుగా ఉపయోగించుకోవచ్చు. వీకీమూలాల లింకులు సరిగా కనపోవడకపోవటమంటే కాస్త వెలిసిపోయిన రంగులో కనిపిస్తున్నాయని మీ భావమైతే మామూలు లింకులను ఆ వికీమూలాల లింకులను వేరుగా చూపించడానికి ఇతర ప్రాజెక్టుల లింకులు అలా వెలిసిపోయిన రంగులో సూచిస్తారు. కావాలంటే మనమా రంగును మార్చవచ్చనుకుంటా. నేను మీ ఉద్దేశాన్ని సరిగా అర్ధం చేసుకున్నానా? --వైజాసత్య 09:42, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్యగారు! మీరుచెప్పినట్లుగా బొమ్మలు కామన్స్ లో ఉన్నడం వలన నేరుగా కాపీచేస్తున్నాను. ఇంకొక సలహా సందేహం కావాలి. అన్యధా భావించవద్దు. రాగాలకు చక్కని ఆడియో లింకు ఉంచితే ఆ రాగాన్ని వింటే ఇంకా ఈ వ్యాసాలు రసవంతమౌతాయి. భారతీయ శాస్త్రీయ సంగీతం మీద మంచి వెబ్ సైటు మీకు తెలిస్తే ఆ పేజీలో ఉంచితే బాగుంటుంది. నాకు తెలియజేస్తే ఆడియో లింకులు ఎలా ఇవ్వాలో తెలియజేస్తే నేను ఆ పని చేస్తాను.ధన్యవాదాలు.Rajasekhar1961 04:29, 12 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Bot flag for User:Darkicebot

Hi there. Could you please grant Darkicebot the bot flag? Thanks, Razorflame 04:15, 8 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రాజు నారిశెట్టి

పేరును రాజు నరిశెట్టి గా మార్చగలరా?Kumarrao 15:25, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల పునర్వ్యవస్థీకరణ

వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)లో "సినిమా వ్యాసాల పునర్వ్యవస్థీకరణ" గురించి నేను వ్రాసింది ఒకమారు చూడగలవా? ప్రారంభంలో ఈ పేజీలపై చాలా ఎక్కువగా శ్రమించింది నువ్వే గనుక ఈ ప్రతిపాదన గురించి నీ అభిప్రాయం తెలుసుకోగోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:27, 14 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మనవి

చంద్రకాంతరావు గారూ, ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్లూ, ఫిర్యాదులు తెవికీకి కొత్త కాబట్టి నాక్కూడా నియమాలు పద్ధతులు తెలియవవు. కానీ కామన్‌సెన్సుతో ఈ అభ్యర్ధన చేస్తున్నాను. దయచేసి శివగారి ఫిర్యాదులను పరిశీలించే క్రమంలో మీరు కలుగజేసుకోకుండా సంయమనం పాటించాలని అభ్యర్ధన --వైజాసత్య 18:42, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ, మీరు మొదటినుంచి అన్నీ పరిశీలిస్తున్నారనుకుంటాను. చిన్న విషయానికి ఇంతవరకు రావడానికి కారణం ఆ సభ్యుడి రెచ్చగొట్టే వ్యాఖ్యలే తప్ప మరేమీ కాదు. అంతమాత్రాన నేను సంయమనం కూడా కోల్పేలేను. కేవలం ఏకవచనం ప్రయోగించినంతమాత్రాన సంయమనం లేదని ఆ సభ్యుడు ఎలా చెప్పగలుతున్నాడు. ఏకవచన ప్రయోగం తప్పు కానేకాదు. ఏకవచనం ఉపయోగించిననంతమాత్రాన విమర్శించినట్లుకాదు, తిట్టినట్లు అసలే కాదు. నేను ఏకవచనం ప్రయోగించడం ఉద్దేశ్యపూర్వకంగానే అని ఒప్పుకుంటాను. గౌరవం ఇవ్వనంతమాత్రాన ఇది విమర్శకాదుకదా! నా వ్యాఖ్యలకు గౌరవం ఇవ్వని సభ్యుడికి నేను గౌరవం ఎలా ఇవ్వగలను! అలాగని నేనెప్పుడూ ఎదురుదాడికి దిగలేను. ఆ సభ్యుడి ప్రవర్తన మొదటి నుంచే గమనిస్తున్నాను. గౌరవంగా చెప్పినట్లు చెప్పి చివరగా వెక్కిరించడం అతడికి బాగా అలవాటు. మొన్ననే వ్రాసిన వ్యాఖ్యలో చూడండి - "దయచేసి కలుగజేసుకోవద్దు" అనడం బాగానే ఉంది, "నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే" అనడం ఎందుకు? ఇదివరకు ఏ కొత్తసభ్యుడికైనా దాష్టీకం, పిడివాదానికి గురిచేశామా? మరెంతో వెనక్కి పోవడమెందుకు, ఇటీవలి కాలంలో సభ్యత్వం పుచ్చుకొని చురుగ్గా రచనలు చేస్తున్నా నాగరాజు గారి చర్చా పేజీ చూస్తే తెలుస్తుంది కొత్త వారికి ఎలా సహకారం అందిస్తున్నామో. నాగరాజు గారు తెలియని విషయాలు తెలుసుకుంటూ, చేసిన వ్యాఖ్యలకు గౌరవం ఇస్తూ మళ్ళీ అలాంటి పొరపాటు చేయడం లేదు. సభ్యుడంటే అలాగుండాలి. నాకెవరూ చెప్పవద్దు, నా చర్చాపేజీలో వ్రాయవద్దు అనడానికి అర్థమేమిటి? నాకు తెవికీ పాలసీల పట్ల అవగాహన వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన వాటిని కొత్త సభ్యులకు చెప్పి అవగాహన కల్పించడమే నా బాధ్యతగా (నిర్వాహకుడిగా హోదా కంటె ముందు నుంచే) పెట్టుకున్నాను. ఈ బాధ్యత ఎవరో ఇచ్చించి కాదు, మరెవరో తీసుకోకూడనిదీ కాదు. నేను ఆ సభ్యుడి చర్చా పేజీలో వ్రాయడానికి "ధాష్టీకానికి, పిడివాదం" పదాలే కారణం, ఆ పదాలే లేకుంటే నేను ఆ చర్చలో పాలొనే వాడిని కాను. అయిననూ నా గురించి విమర్శనాత్మకంగా వ్రాసి నాకు చర్చలలో పాల్గొనవద్దని అనడమెందుకు? అయిననూ అతడి అనవసరపు ప్రశ్నలకు జవాబు చెప్పలేను. ఒక్కోదానికి టన్నులకొద్దీ జవాబు చెప్పే అవకాశం, అవగాహన నాకు ఉంది. ఇక బొమ్మ విషయానికి వస్తే నేను బొమ్మను తొలిగించలేను. కేవలం ఈవాబో పేజీ నుంచి మాత్రమే తొలిగించాను. బొమ్మను అప్లోడ్ చేసినవెంటనే బొమ్మ చర్చాపేజీలో ఈవాబొ మూస పెడితే సరిపోయేది. ఏకంగా మొదటి పేజీలోనే ప్రదర్శనకు పెట్టడం ఎంతవరకు సమంజసం? అదే విషయము అతడి చర్చా పేజీలో వినయంగానే చెప్పాను. పాలసీలు, గీలసీలు నాకు అక్కరలేదు, నేను పెట్టిన బొమ్మను ఎలా తొలిగించావని పెద్ద కోపం వచ్చి, నేను చెప్పిన తెవికీ వ్యాఖ్యలను "అనవసర వ్యాఖ్య"గా సారాంశంలో వ్రాసి ఏకంగా తొలిగించివేశాడు. మామూలుగా తొలిగించినా నేను బాధపడేవాడిని కాదు, తెవికీ సంప్రదాయాన్ని అనవసర వ్యాఖ్యగా కామెంట్ చేయడం తెవికీ అభివృద్ధికి నిబద్ధులైన వారందరూ బాధపడవసిందే. బొమ్మ చర్చాపేజీలోనే వ్రాసేవాడిని కాని ఆ సమయంలో చురుకుగా లేని సభ్యుడి దృష్టికి ఆ వ్యాఖ్యను తేవడం అంతకన్నా దగ్గరిమార్గం లేదు. అయిననూ ఎవరి పొరపాటో, ఎవరి బొమ్మ చర్చనో ఆ సభ్యుడికి తెలియజేయలేను. అతడి బొమ్మ, అతడి పొరపాటును అతడి చర్చాపేజీలో వ్రాయడం గురించి నేను చేసింది సమంజసమేనని ఇప్పటికీ భావిస్తున్నాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలిసిందే. ఆ సభ్యుడికి ఎలా చెప్పిననూ అర్థం కావడం లేదు. తాను చేసిందే సరైనదనే భావనతో ఉన్నాడు. నేను పాలసీలను చెప్పడమే అతడికి నచ్చడం లేదు, పైగా నాపై విమర్శలు చేస్తున్నాడు. అయిననూ నాకెలాంటి బాధలేదు. ఒక బృహత్కార్యంలో ఇలాంటి అలజడులు, విమర్శలు మామూలే, అసలు ఇలాంటివి పట్టించుకుంటే మనం సాఫీగా గమ్యం చేరలేము. నా ఓర్పు, సహనం గురించి అతడు చెప్పేపనిలేదు. అతడికెంత ఓర్పుందో అందరూ చూస్తున్నారు. బొమ్మను తొలిగించినవెంటనే అంతెత్తున లేవడమెందుకు? నిజానికి అతడికి ఒకవేళ సహనం ఉండి ఉంటే గనుక ఆ పనిచేసేవాడే కాదు, నాపై విమర్శలు గుప్పించేవాడేకాదు. అతడికి లేని సహనం గురించి ఎదుటివారికి చెప్పడం దేనికి? సామాన్య సభ్యులమీద కోపతాపాలు, అనుచిత బాష అంటున్నాడు. అసలు నా బాష అర్థం చేసుకుంటున్నాడా? కేవలం ఏకవచనం దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా చెప్పడం దేనికి? అయిననూ ఏకవచనం తప్పు కాదని మరోసారి చెప్పుతున్నాను. నాపై లేని విమర్శలు గుప్పించి పదేపదే చెప్పడం దేనికి? ఇంత అహంకారం పనిరాదు. నా గురించి నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పడం బాగుండదు. అసలు ఎవరి మీద చర్య తీసుకోవాలి? తప్పంతా అతడిలో ఉంచుకొని నాపై ఫిర్యాదా? మళ్ళీ పెద్ద సహనం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. కేవలం పాలసీలు, సంప్రదాయాల గురించి చెబితే భరించలేకపోతున్నాననడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇలా ఒక్కో పదం, వాక్యంపై నేను వివరణ ఇచ్చుకోగలను, అయిననూ దాని అవసరం లేదు, ఎందుకంటే ఆ విషయాలు సభ్యులందరికీ తెలిసినవే. ఇక చివరగా వైజాసత్యగారికి తెలియజేయడం ఏమనగా నేను చర్చను ఇదివరకే ముగించాను. ఆ సభ్యుడి రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే మళ్ళీ చర్చ పొడిగించాల్సి వచ్చింది. అయిననూ మీ మనవిని దృష్టిలో ఉంచుకొని ఇక ఈ చర్చను మరోసారి ముగించాలనుకుంటున్నాను. అయిననూ తుది ఫలితం ఆ సభ్యుడి ప్రవర్తనపైన ఆధారపడి ఉంటుంది. నాకు ప్రత్యక్షంగాకాని, పరోక్షంగాకాని, విమర్శనాత్మకంగాకాని, రెచ్చగొట్టేవిధంగా కాని వ్యాఖ్యలుచేస్తే నేనూ దానికి తగిన విధంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 22:08, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ, మొదట శివగారి వాదనను విని మీ వివరణ కోసం వద్దామనుకున్నాను. మీరు చెప్పవలసినది చెప్పారు కాబట్టి, తిరిగి మిమ్మల్ని ఏదైనా నిర్ణీత విషయం గురించి సంప్రదించేదాకా కాస్త ఆగండి. (మీరు వికీ దిద్దుబాట్లు ఆపమని చెప్పట్లేదు) --వైజాసత్య 08:55, 30 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

వైజాసత్య గారూ! నేను తెలుగులోకి అనువాదం అని పెట్టిన వాక్యాలను శాశ్వతంగా తొలగించే అవకాశం ఏదైనా ఉంటే తొలగించాలని మనవి. ఇది నా వ్యక్తిగతమైన చర్చ, మరియు వికీపీడియాకు అసలు సంబంధంలేని చర్చ గనుక ఆ చర్చకు సంబంధించిన నా వాక్యాలు మరియు ఇతర సభ్యుల వ్యాఖ్యలను తొలగించమని ప్రార్థన (నేను, మీరు, నిసార్ గారూ, రవిచంద్ర గారు చేసిన మార్పులను తొలగించమని ప్రార్థన). నా సభ్య పేజీలో నేను చేసిన మార్పులను కూడా తొలగించమని ప్రార్థన. δευ దేవా 17:56, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అలా చేసే అవకాశమేదీ లేదు. కాకపోతే మీ సభ్యుని పేజీని తొలగించి మళ్ళీ ఆ వాక్యాల్లేకుండా సృష్టించుకోవచ్చు. అయినా పాతకూర్పులను నిర్వాహకులు చూడగలిగే అవకాశముంది --వైజాసత్య 00:37, 20 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్సుకు తరలింపు

వైజా సత్యా! వ్యాసాలను వికీసోర్సుకు ఎలా తరలిస్తారో నాకు తెలియదు. క్రింది వాటిని వికీసోర్సుకు తరలించగలవా? --కాసుబాబు 17:56, 19 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లోకి వెళ్ళి ప్రత్యేక పేజీలలో పేజీ దిగుమతి నుండి ఈ పనిని చేయవచ్చు. దానికి సోర్సులో నిర్వాహకహోదా ఉండాలి. నేను అక్కడికి తరలించాను. --వైజాసత్య 00:33, 20 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శివ నుండి సందేశం

సత్యాగారూ! నమస్తే. చాలాకాలానికి మళ్ళీ వికీలోకి వచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదు మీద ఏమాత్రం స్పందించకపోవటం శోచనీయం.మీ సమాధానంకోసరం ఎదురు చూస్తూనే ఉన్నాను. తరువాత ఒకసారి 20 వారంనికి ఈవారం బొమ్మని చూడండి. బొమ్మ అద్భుతంగా ఉన్నది ఆ బొమ్మ ఈ వారం బొమ్మగా పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఫొటో తీసినవారికి, ఈ వారం బొమ్మగా పెట్టినవారికి నా అభినందనలు . కాని, నాకు ఒక సందేహం. వ్రాసి ఉన్న నియమాలు (బొమ్మ ఏదో ఒక వ్యాసంలో ఉండి తీరాలి)కాక వ్రాసిలేని, ఊహాజనిత నియమాలు, నాకు ఉపదేశించటానికి ప్రయత్నించబడిన నియమం(బొమ్మ కొన్నళ్ళు ఊరగాయలాగ ఊరాలి) కూడ ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటంలో పాటించలేదు. నేను ఈ వ్యాఖ్య చేయటంలో ఉద్దేశ్యం ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటం ఎద్దేవా చెయ్యటం ఎంతమాత్రం కాదు. నియమాలు ఉండాలి కాని వాటికి మినహాయింపులుకూడ ఉండాలి,బొమ్మ విలువని బట్టి. నా వాదన 20 వ వారం బొమ్మ తొ సరైనదని తేలుతున్నది.

ఏది ఏమైనా నిర్వాహకుడైన వారు అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం, దురుసుగా ప్రవర్తించటం తగదు (సామాన్య సభ్యులు చెయ్యచ్చు అని కాదు నా అభిప్రాయం). అందుకనే నా ఫిర్యాదు. మీరు తగిన విధంగా స్పందించగలరు, మళ్ళినేను ఉత్సాహంగా వికీలో వ్యాసాలు వ్రాయటానికి ప్రొత్సాహాన్ని అందించగలరు.--S I V A 12:48, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఫిర్యాదుకు త్వరలోనే స్పందిస్తాను. ఆలస్యానికి క్షమించండి. ఏకబిగిన రెండు పేజీలు వ్రాయటానికి ఉత్సాహము, ఓపిక, సమయం లేకే ఇన్నాళ్ళూ బద్దకించాను. ఈ వారాంతంలోపు వ్రాస్తాను. --వైజాసత్య 13:13, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యాగారూ!క్షమించటం వంటి పెద్ద మాటల అవసరం లేదండీ. మనం ఇక్కడకు వచ్చి వ్రాయటానికి ప్రయత్నించేది మనదగ్గరున్న సమాచారాన్ని నలుగురితో పంచుకోవటానికి కాని, ముక్కూ మొహం తెలియనివారితో మాటలు పడటానికి కాదుకదా. నా ఉద్దేశ్యంలో, నియమాలు ఏమయినా సరే వ్రాతలో నే ఉండాలి, సంప్రదాయం, ఆచారం లాంటివి అనవసర వివాదాలకు అపార్ధాలకు దారి తీస్తాయి. వ్రాసిన నియమాలను అవసరమైన మినహాయింపులు సమయానుకూలంగా చేస్తూ ఉండాలి. మన రాజ్యాంగమే అందుకు మంచి ఉదాహరణ (అనేక సార్లు మార్చబడిన వ్రాసి ఉన్న రాజ్యాంగం).ఈ వివాద పరిష్కారం మీకే ఒదిలిపెడుతున్నాను.--S I V A 12:04, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
"ఆ బొమ్మ"ను 20వ వారపు బొమ్మతో పోల్చడం అస్సలు తగదు. 20వ వారపు బొమ్మను మొదటి పేజీలో పెట్టడానికి (ఎన్నికల్ పలితాల దృష్ట్యా) రవిచంద్ర గారు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులెవరూ అభ్యంతరపర్చలేదు కాబట్టి 3 వారాల అనంతరం దానిపై ఇప్పుడు ఇతర బొమ్మలతో పోల్చే అవసరం లేనే లేదు. "ఆ బొమ్మ"పై నేను చేసిన చర్యలు మమ్మాటికీ సరైనదే. రెండు నెలల క్రితం ఆ సభ్యుడి చర్చాపేజీలో (ఏప్రిల్ 2న - 6వ పాయింటు) సరిగ్గా ఇదే విషయం చెప్పాను. పాలసీలు, నియమాలకు కొంత భిన్నంగా వ్యవహరించేటప్పుడు సభ్యుల దృష్టికి తేవడం చాలా మంచి ఆచారం. రవిచంద్ర గారు సరిగ్గానే వ్యవహరించారు. ప్రస్తుతం ఈ బొమ్మకు ఆ బొమ్మతో పోల్చడం దురదృష్టకరం. ఇన్నాళ్ళు శోధించి ఆ సభ్యుడు ఒక తెవికీ పాలసీని తెలుసుకోవడం సంతోషమే కాని అదీ అసంపూర్ణంగా అర్థం చేసుకోవడం శోచనీయం. ఏ పాలసీ అయినా, ఏ చట్టమైనా, ఏ ప్రకరణమైనా దానికదే కాకుండా మొత్తం స్థూలంగా, విశాల దృష్తితో శోధించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదా.కు రాజ్యాంగం ప్రతి పౌరులకు స్వేచ్ఛను ప్రసాదించింది. అంతమాత్రాన ప్రతి ఒక్కరి తమ ఇష్టమున్నట్లు వ్యవహరించలేము. దానిపై ఎన్నో నిర్భంధాలు ఇతర ప్రకరణాలతో ఉన్నాయి. అంటే విశాల దృష్టితో స్థూలంగా అర్థం చేసుకోనప్పుడు ఏనుగును నలుగురు గుడ్డివాళ్ళు వర్ణించినట్టే అవుతుంది. ఇక పైన ఆ సభ్యుడు వ్రాసిన రెండో పేరా చూడండి. ఇది వరకు నేను చెప్పినట్లు "చెప్పినట్లే చెప్పి వెక్కిరించడం ఆ సభ్యుడికి బాగా అలవాటు" అన్నది మరోసారి రుజువైంది. నేను చెప్పినది అక్షరసత్యమని సభ్యులందరూ గమనించారు. మళ్ళీ మళ్ళీ నాపై అభాండాలు వేయడం అతడికి అలవాటైపోయింది. తన తప్పును ఇతరులపై నెట్టడం సమంజసం కాదు. ఆ సభ్యుడు మళ్ళీ మళ్ళీ నిర్వాహకుడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు కాని తెవికీలో ఎవరూ కూడా తాము నిర్వాహకులని చెప్పుకోవడం లేదు. అంతేకాకుండా చేసిన చర్యలన్నీ సభ్యహోదాలోనే చేసినవే, నిర్వాహక హోదాను అస్సలు ఉపయోగించలేము. అయిననూ సభ్య హోదాకు, నిర్వాహక హోదాకు తేడా కూడా తెలుసుకోకపోవడం విచారకరం. వైజాసత్య గారు, మీ మనవి దృష్ట్యా నేను మరీ లోతుగా పోవడం లేదు. చర్చకు మరియు నాపై విమర్శకు సమాధానం మాత్రమే ఇచ్చాను. చర్చా పేజీలనేవి చర్చలు జరుపడానికే, ఒకరికి వ్రాస్తే ఇతరులు సమాధానం చెప్పడం ఎందుకని కొందరు అభ్యంతరపర్చవచ్చు కాబట్టి నేను ముందుగానే ఈ విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:17, 6 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శివ గారి ఫిర్యాదుకు నా సమాధానం

ఇది చాలా చిన్న విషయం. చిలికి చిలికి గాలివాన చేశారు. ఇందులో ఇరుపక్షాలకూ బాధ్యత ఉంది అని నేను భావిస్తున్నాను. శివ గారు సగటు మనిషి బొమ్మను అప్లోడు చేసి ఉత్సాహంతో దాన్ని ఈ వారం బొమ్మ మూస తొడిగి వరుసలో ఉంచారు. అది హఠాత్తుగా అక్కడ చేరటం సాంప్రదాయనికి విరుద్ధంగా ఉంది అని చంద్రకాంతరావు గారు దాన్ని తొలగించి, అందుకు కారణాన్ని వివరిస్తూ శివ గారి సభ్యుల పేజీలో వ్యాఖ్యను వ్రాశారు. దాన్ని ఈ దిద్దుబాటు లింకులో చూపినట్టు దాన్ని శివగారు అనవసర వ్యాఖ్యగా దిద్దుబాటు మార్పులో వ్రాసి తొలగించారు. అది శివగారు తొలగించాల్సింది కాదు. అది తొలగించినా అనవసర వ్యాఖ్యగా కొట్టివేయాల్సిన అవసరం అసలు లేదు. ఇంతకు ముందు కూడా నేను ఈ విషయంపై ఆయనకు జవాబిస్తూ వ్రాసినట్టూ, మనల్ని విమర్శించడం, మన వ్రాతల్ని విమర్శించడం చాలా భిన్నమైన విషయాలు. ఎదుటి వ్యక్తి మంచిమనసుతోనే ఏదైనా మార్పు చేశాడని భావించడం వికీ మర్యాదల్లో ఒకటి. అది శివగారికి తెలుసో, తెలియకో ఉల్లంఘించారు. కానీ ఆ తర్వాత చంద్రకాంతరావు గారు "ఇది సభ్యత కాదు" అన్న వ్యాఖ్యలో శివగారిని వ్యక్తిగతంగా విమర్శించారు. ఇక్కడ చంద్రకాంతరావు గారు, శివగారికి తనపై కోపం వచ్చి ఆ వ్యాఖ్యను తొలగించారని అన్వయించి ఏకవచన ప్రయోగం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. ఆ తర్వాత మరోచోట ఏకవచన ప్రయోగం అగౌరపూర్వకం కాదని సమర్ధించుకున్నారు. కానీ అదే వ్యాఖ్యలో కావాలనే ఏకవచన ప్రయోగం ఉపయోగించినట్టు ఆయనే ఒప్పుకున్నారు.[1].


ఇక్కడ మళ్లీ లక్షన్నొక్కసారి మనవి చేసుకునేదేవిటంటే వికీ అప్రత్యక్ష మాధ్యమం. అవతలి వారి అంతరంగాన్ని ఇక్కడ చర్చా పేజీల వ్రాతల్లో చాలామటుకు పట్టలేం కాబట్టి వీలైనంత ఎదుటి వారికి బెనిఫిట్ ఆఫ్ డౌటివ్వాలి. చంద్రకాంతరావు గారికి ఈ విషయం తెలుసనే నేను భావిస్తున్నాను. కానీ దీన్ని విస్మరించడం శోచనీయం. దీన్ని ఇంతటితో శివగారు కూడా ఆపలేదు. ఆయనా చంద్రకాంతరావు గారి మీద పిడివాదం, కొత్త సభ్యుల దాష్టీకం అంటూ వ్యక్తిగత దాడికి దిగారు. ఇంతకంటే వివరణాత్మకంగా ఈ విషయంలో వెళ్ళటం అనవసరం అని అనుకుంటాను. శివగారు, ఈ వ్యాఖ్యలోని ఆరవ పాయింటులో అన్నట్టు ఇది చిన్న అభిప్రాయ భేధమే. ఇద్దరిలో ఏ ఒక్కరైనా సంయమనం పాటిస్తే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఈ ఇద్దరూ తమదైనా శైలిలో తెలుగు వికీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసినవారే. మీ ఇరువురి అవసరం తెవికీకి ఉన్నది. ఇద్దరూ పరస్పరం క్షమాపణలు చెప్పుకొని విబేధాల్ని మరచిపోయి అంతర్జాలంలో తెలుగు పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనందరం చేరింది ఒక తరతరాలకు నిలిచిపోయే ఒక మహోన్నత కార్యం కోసమని గుర్తుంచుకోవాలి. పెద్దపెద్ద దేశాల్లో చిన్న చిన్న సంగతులు జరుగుతూనే ఉంటాయి లైట్ తీసుకోండి బ్రదర్స్. --వైజాసత్య 05:58, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


వైజాసత్య వ్రాసినట్లుగా ఈ వివాదం అనవుసరంగా పెద్దదయ్యింది. క్షమాపణల సంగతి కూడా వదిలేయండి. ఫలానా వారిది తప్పు అని తేల్చడం వలన ఒరిగేదేమీ లేదు. పై సూచనలను చదివి, ఇక్కడితో ఈ విషయాన్ని ముగించమని సభ్యులను కోరుతున్నాను. ఈ ఇద్దరు సభ్యుల రచనలూ తెలుగు వికీకి చాలా చాలా అవుసరమని మనవి చేస్తున్నాను. --కాసుబాబు 07:26, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఇద్దరు సభ్యులకూ మనఃపూర్వకంగా విన్నవించడమేమంటే, ఇద్దరూ ప్రతిభావంతులే, ఇద్దరూ చొరవతీసుకుని, తెవికీలో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి. మాటామంతీ వుంటే బాగుంటుందని, మాటామాటా వుంటే అభివృద్ధి కుంటుపడుతుందని తెలుపుతున్నాను. జరిగినదాన్ని విశాలహృదయంతో మరచిపోయి భవిష్యత్తు కార్యక్రమాలలో పాల్గొంటారనీ ఆశిస్తున్నాను. అహ్మద్ నిసార్ 10:09, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయంలో ఒకరి వ్యాఖ్యల వల్ల మరొకరి అహం దెబ్బతిన్నదని నాకు స్పష్టంగా అర్థమవుతోంది. నేను మీకన్న వయసులో చిన్న వాణ్ణే. అయినా చొరవతో అంటూన్నాను. రెండు చేతులు కలిస్తేనే శబ్దం. దయచేసి మీరిరువురూ (కనీసం ఒకరైనా) తమ చేయిని వెనక్కి తీసుకోండి. ఒకసారి ఇప్పటి దాకా మీ మనసులో ఆలోచలని పక్కనబెట్టి విశాల థృక్పథంతో ఆలోచించండి. పైన అందరూ చెప్పనదే నేనూ పునరుద్ఘాటిస్తున్నాను. ఇది చాలా చిన్న విషయం. శివగారిని ఆ విషయాన్ని అంతటితో మరిచిపొమ్మని అభ్యర్థిస్తున్నాను. వ్యక్తిగతంగా నేను కూడా ఇలాంటి సంఘటన(లు) ఎదుర్కొన్నాను. తెవికీని అభివృద్ధి చేయాలన్న మహోన్నత లక్ష్యం ముందు ఇవి చాలా చిన్న చిన్న విషయాలని మరిచిపోవద్దు. జరిగింది ఒక పీడకలగా మరిచిపోమని, యధావిధిగా తమ విధులు నిర్వర్తించమని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. -- రవిచంద్ర(చర్చ) 10:53, 8 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని విషయాలు - గ్రామాలు, సినిమాలు

వైజా సత్యా!

  • నేను నీకు ఈ-మెయిల్‌లో పంపిన డేటాబేస్ గురించిన విషయం మరికొంత - శ్రీ భాస్కర్ గుజ్జి గారు ఖమ్మం, నల్గొండ జిల్లాలకు పంపిన డేటాబేస్ ఆధారంగా నేను ఒక గ్రామం పేజీ గుమ్మదవల్లి ప్రయోగాత్మకంగా చేశాను. గణాంకాలతో పాటు పనిలో పనిగా విస్తరణకు అనుకూలమైన శీర్షికలు కూడా ఉంచాను. క్రొత్తగా ప్రయత్నించే సభ్యులకు ఇది మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తున్నాను.
  • ఆయన ఇచ్చిన డేటాబేస్‌ను నేను "మైక్రోసాఫ్ట్ పదం" (MS Word) లోకి మార్చాను. మిగిలిన గ్రామాలకు ఇది బాట్ ద్వారా చేయడం వీలవుతుందా పరిశీలించు.అలాగైతే నేను నీకు వర్డ్ ఫార్మాట్ ఫైలు పంపుతాను. అలా వీలు కాదంటే ఇలాగే మాన్యువల్‌గా చేస్తాను. ఇంకా ఏమైనా మార్పులు కూడా ఆలోచించు.
  • గడచిన రెండు నెలల్లోను చాలా సినిమా పేజీలు విస్తరించాను. ఇప్పుడు 2 కెబిలు దాటిన సినిమాలెన్నో మళ్ళీ చూడగలవా? ఎందుకంటే విస్తరణ అవకాశాలను బేరీజు వేయడానికి ఇది పనికొస్తుంది.
-కాసుబాబు 07:34, 19 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నాలుగు రోజులు ఊళ్ళో లేకపోవటం వళ్ళ మెయిలు చూసినా డేటాబేసు తెరిచి చూడలేదు. నా తొలి అంచనాగా ఇవి బాటుతో చెయ్యటం వీలవుతుంది అనుకుంటున్నాను. అయితే ముందస్తుగా దానికి కొంత మనం హోంవర్క్ చెయ్యాలి. ఈ డేటాబేసులోని గ్రామాల పేర్లు ఇంగ్లీషులో ఉంటాయి. అయితే దాని ఇంగ్లీషు పేరు పక్కనే ఒక కొత్త కాలమ్ పెట్టి అందులో తెవికీలో ఆ గ్రామం పేజీ ఏ పేరుతో ఉందో అలాగే ఉన్నదున్నట్టుగా తెలుగు పేరును అక్కడ చేర్చితే బాటు మిగిలిన పనంతా చేసుకొని పోగలదు. క్షుణ్ణంగా పరిశీలించి మరేదైనా మార్పులుచేర్పులు చెయ్యగలమేమో మళ్ళీ వ్రాస్తాను. సినిమా గణాంకాలు ఇప్పుడే తాజాకరించాను --వైజాసత్య 05:14, 22 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఓసారి పరికించండి

సత్యాగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 16:57, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Translation request

Greetings వైజాసత్య!!Could I ask you to translate en:Qin Shi Huang(listed in 1000 vital articles) and en:Wuhan(a chinese city,my hometown) into your language?You may shorten them as possible to contain only the basic informations,one or two sentences are enough. If you want me to translate any article into Chinese or Vahcuengh,contact me without hesistation. Thank you very much!--Biŋhai

నా పేరును తెలుగులోకి మార్చగలరా?

Kiranmayee నుంచి కిరణ్మయి గా మార్చగలరా? ధన్యవాదాలు! కిరణ్మయీ 20:05, 29 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]