వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Nuvola apps important blue.svg కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. నెనర్లు :)

ధన్యవాదాలు[మార్చు]

వైజాసత్య గారికి నమస్కారములు, మీరు మీ సభ్య పేజీలో "మర్యాదకు మూల సూత్రాలు" చాలా బాగున్నవి. యివి తెవికీ లోనే కాకుండా అందరూ సమాజంలో అనుసరించవలసినవి. వీటిని అనుసరిస్తే ఎక్కడా అభిప్రాయ భేదాలు గానీ, సమస్యలు గాని రావని నాభిప్రాయం.యివి తెవికీలో ప్రతిఒక్కరు అనుసరించవలసిన సూత్రాలని నా అభిప్రాయం. వీటిని స్వాగత సందేశంతో కొత్త వాడుకరులకు పంపిస్తే బాగుండునని నా అభిప్రాయం.మనం యితరులనుండి ఏమి కోరుకుంటున్నామో మనం కూడా ఇతరులకు అదే అందించాలనే సూత్రం ప్రతిఒక్కరు మరువరానిది.మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.(  కె. వి. రమణ. చర్చ 11:47, 21 ఫిబ్రవరి 2013 (UTC))

సత్యాగారికి ధన్యవాదాలు. వీలున్నంతవరకూ ఎపుడూ వికీలో నా సేవలు అందింస్తూనే ఉంటాను. నిజనికి ఇందులో ఏదో ఒకటి రాయకుండా ఉబుసుపోని పరిస్థితి అయిపోయింది. అభిప్రాయబేధాలు ఉండేవే అందర్కీ. మీలాంటి వారు ముందుండి నడిపిస్తే ఎలాంటి భేదాలైనా అభిప్రాయాలైనా తొలగిపోతాయి. ఒకప్పటి మంచి వాతావరణం మళ్లీ కల్పించవచ్చు.విశ్వనాధ్ (చర్చ) 12:43, 21 ఫిబ్రవరి 2013 (UTC)
వైజాసత్య గారు మీరు మళ్ళీ తెవికీ నాయకత్వానికి సమీపిస్తున్నందుకు సంతోషమే. కాని ఒక సభ్యుడి చర్చాపేజీలో నన్ను రెడ్డిగారితో కలిపి నందుకు బాధవేసింది. రెడ్డిగారితో నాకు ఎలాంటి సంబంధం లేదని మీరు తెలుసుకుంటే మంచిది. నిబంధనలకు విరుద్ధంగా మిగితా సభ్యులు ప్రవర్తించినప్పుడు వద్దని చెప్పాను కాని రెడ్డిగారికి మద్దతు ఇస్తున్నట్లు మీరు అనుకోనవసరం లేదు. అలా రాయడానికి మీ ఉద్దేశ్యం ఏమిటో కాని నన్ను మాత్రం ఆలోచనలకు గురిచేసింది. నేను ఎవరి వ్యక్తిగత విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోను. తప్పని పరిస్థితుల్లోనే కొన్ని సార్లు అలా చేయవలసి వచ్చింది. నాలుగైదు ఐదురోజుల నుంచి ఒక సభ్యుడు నాపై ఏకవచనం ప్రయోగిస్తే చూసిచూసి చివరకి నేనూ అలాగే సమాధానం ఇవ్వవలసి వచ్చింది. ఏకవచనం తప్పు కాదని చెప్పిన ఒక్క మాటకే ఆ సభ్యుడే ఏ విధంగా ప్రవర్తించాడో మీకు తెలుసు. అంతమాత్రాన నేనెవరినీ బలపర్చలేను. సెలవులో ఉండటం మూలానా చర్చలు పూర్తిగా తెలిసిరాలేదు. అసలు ఆ వాక్యం కోసమే ఇంత సుధీర్ఘ చర్చ జరిగిందని తర్వాత అర్థమైంది. ఇంతవరకు నేనైనేను మొదటగా ఎవరినీ ఇబ్బంది పెట్టలేను. ఒకటిరెండు సార్లు చూసి నేను వారి విధానాన్నే అవలంబించాను. అయితే మొదట చెప్పిన వారిని కాకుండా తర్వాత చెప్పినవారినే దోషిగా నిర్థారించడం సమంజసం కాదని తెలియజేస్తున్నాను. మొత్తం నిర్వహణ బాధ్యత మీరు చేపట్టాలని నేను చెప్పిన ఉద్దేశ్యం కూడా అదే. మొత్తం నిర్వహణ మీరే చేపడితే నేను నిర్వహణ చేసే పరిస్థితి ఉండదు, ఈ తలనొప్పులు ఉండవు, ఇతరుల నుంచి చివాట్లూ ఉండవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:45, 21 ఫిబ్రవరి 2013 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

నమస్కారం. నేను దాదాపు జూన్ 2012 నుంచి ఆంగ్ల వికిపీడియాలో వాడుకరిని. కానీ ఎందుకో ఒక్కసారి తెవికీ చూసాను. ఆంగ్లం లాగనే ఉండతంతో ఇందులోనూ సభ్యుడయ్యాను. మీ స్పందనకు కృతజ్ఞుడను. నాకు భవిష్యత్తులో తెవికీ పరంగా అవసరాల్లో సాయం చేస్తారని ఆశిస్తున్నాను.Pavanjandhyala (చర్చ) 09:44, 25 ఫిబ్రవరి 2013 (UTC)

అభ్యర్ధన[మార్చు]

నమస్కారం. మహిళా దినోత్సవ సందర్భంలో http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/International_Women%27s_Day,_India#Event_details లో మీరు 'Suggested Articles' లో కొన్ని తెలుగు అంశాలను సూచిస్తే చాలా బావుంటుంది. విష్ణు (చర్చ)Vishnu 14:51, 27 ఫిబ్రవరి 2013 (UTC)

సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం[మార్చు]

వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం సృష్టించాను. ఈ నెల రోజులు అందరూ వీలైనన్ని మహిళలకు సంబంధించిన వ్యాసాలను విస్తరించడం లేదా మొదలుపెడితే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:00, 5 మార్చి 2013 (UTC)

Talkback[మార్చు]

Nuvola apps edu languages.svg
నమస్కారం వైజాసత్య గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 03:50, 10 మార్చి 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

అర్జున (చర్చ) 03:50, 10 మార్చి 2013 (UTC)

విక్షనరీ[మార్చు]

స్వాగతం[మార్చు]

వైజాసత్యగారు, మీరు విక్షనరీలో తిరిగి ప్రవేశించడం మా భాగ్యం. ఇందులో ప్రస్తుతం సుమారు 70,000 పైగా వ్యాసాలు చేరాయి. వర్గీకరణ ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. దీనికోసం హాట్ కాట్ ను ఇక్కడ స్థాపించాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనిని నిర్వాహకులు మాత్రమే చేయగలరని అర్జునరావు గారు చెప్పారు. మీరు నాకీ సహాయం చేసి; దాన్ని అక్కడ స్థాపించగలరా.Rajasekhar1961 (చర్చ) 04:33, 10 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

వైజాసత్య గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

వైజా సత్య గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:44, 13 మార్చి 2013 (UTC)

మీరు వికీపీడియా సమావేశానికి హాజరు కావడానికి తప్పకుండా ప్రయత్నించండి. వీలుకాని పక్షంలో తమ సందేశాన్ని వీడియో/ఆడియో ఫైలుగా ఈ వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు విభాగంలో చేర్చండి. వాటిని సమావేశం సమయంలో అందరికీ తెలియజేస్తాము. మీరు వెన్న నాగార్జున గార్కి సందేశం పంపించగలరా. అలా వీలైతే ఆయననుండి సమావేశానికి వారి సందేశాన్ని కూడా పంపమని ప్రార్ధించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:36, 26 మార్చి 2013 (UTC)

స్త్రీల కొరకు అవుట్ రీచ్ ప్రోగ్రామ్: మీరు తప్పక ధరఖాస్తు చేయగలరు[మార్చు]

వైజా సత్య గారూ ! ఈ దిగువ ఇచ్చిన లంకెలు చూడండి. మీరు ధరఖాస్తు చేస్తే బాగుంటుంది. https://live.gnome.org/OutreachProgramForWomen/2013/JuneSeptember/SpreadTheWord https://www.mediawiki.org/wiki/Outreach_Program_for_Women విష్ణు (చర్చ)18:48, 16 మార్చి 2013 (UTC)

విష్ణు గారూ, పేరులో సత్య చూసి పొరబడినట్టున్నారు. ఫర్లేదు. నా పేరు రవి. ఇంటి పేరు వైజాసత్య --వైజాసత్య (చర్చ) 16:52, 17 మార్చి 2013 (UTC)
అయ్యొ తప్పుజరిగిపోయింది వైజాసత్య రవి గారు. క్షమించండి :-( విష్ణు (చర్చ) 07:52, 18 మార్చి 2013 (UTC)

బాటు ప్రతిపాదన[మార్చు]

బాటును హోదా లేకుండా ఒక వంద మార్పులు చేసి చూపగలరు. అలాగే మీరు ఎలాంటి మార్పులు చేసేది బాటు పేజీలో ఏ ఏ అక్షరదోషాలను సరిచేస్తున్నారో ఒక చిట్టా నిర్వహిస్తే మంచింది. అక్షరదోషాలు సరిచేసే బాట్లును చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి --వైజాసత్య (చర్చ) 05:07, 24 మార్చి 2013 (UTC)

వంద మార్పులు పూర్తి అయినవి. మార్పులు ఇక్కడ చూడండి. RahmanuddinBot (చర్చ) 13:06, 26 మార్చి 2013 (UTC)

ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ప్రాజెక్టు[మార్చు]

వైజాసత్య గారు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ప్రాజెక్టు 2007 తర్వాత ఆగిపోయింది. తర్వాత కాలంలో కొంతమంది వారివారి గ్రామాల గురించి పెద్దగా అభివృద్ధి సాధించలేదనే చెప్పాలి. ఒకసారి ప్రాజెక్టు పేజీని, చర్చ పేజీని అవలోకించి, మళ్లీ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీ విలువైన సలహాలను అందించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 18:24, 31 మార్చి 2013 (UTC)

మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు తీసుకొంటున్న చొరవకు నా వంతుగా నేను తయారుచేసిన వైద్య శాస్త్రానికి చెందిన మొలక వ్యాసాల్ని విస్తరించడం ప్రారంభించాను.Rajasekhar1961 (చర్చ) 08:55, 3 ఏప్రిల్ 2013 (UTC)

మొలకల విస్తరణ[మార్చు]

మీరు సూచించిన మొలకల జాబితా వికీపీడియా:మొలకల జాబితా/1.5 చాలా వరకు విస్తరింపబడినట్లున్నవి. అవి మొలక స్థాయి దాటినట్లు భావించవచ్చా. మొలక స్థాయి దాటటం అంటే ఒక వ్యాసం ఎన్ని బైట్లు గా నిర్ణయించారు? కొన్ని వ్యాసాలు జలుమూరు, సారవకోట వంటి వ్యాసాలు 3000 బైట్లు దాటి ఉన్నవి. ఇది తాజాకరించిన జాబితా యేనా? --తెలుగు భాషాభిమాని కె.వెంకటరమణ చర్చ 09:22, 4 ఏప్రిల్ 2013 (UTC)

పేజీ చరిత్రలో కనిపించే పరిమాణం చూసి మొలకస్థాయి దాటిందని అనుకోకూడదు. మొలక స్థాయి దాటటం అంటే 2 కేబీలు (2048 బైట్లు) సమాచారం ఉండాలి. ఈ పరిమాణం అంచనాలో సమాచారపెట్టెలు, మూసలు వగైరా పరిగణించబడవు. కాబట్టి సారవకోట వ్యాసం పేజీ చరిత్రలో 3000 బైట్లు దాటినా నిజానికి అందులో 1.5 కేబీల సమాచారం మాత్రమే ఉంది. మీ అభిరుచుల్లోకి వెళ్ళి ఉపకరణాల్లో నావిగేషన్ పాపప్స్ (వికీపీడియా:ముంజేతి కంకణం) సచేతనం చేసుకొని మీకు కావలసిన వ్యాసపు లింకుపై కుడినొక్కు నొక్కితే అప్పుడు దాని పరిమాణం చూపిస్తుంది. --వైజాసత్య (చర్చ) 09:40, 4 ఏప్రిల్ 2013 (UTC)
వ్యాస పరిమాణం తెలుసుకొనే విధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు--తెలుగు భాషాభిమాని కె.వెంకటరమణ చర్చ 09:44, 4 ఏప్రిల్ 2013 (UTC)

సలహా కావలెను[మార్చు]

వైజాసత్య గారూ! నమస్కారం! నాకొక సలహా కావలెను. వికీపిడియా వాడుకరి పేజీలో నా వివరాలతో పాటూ వ్యక్తిగత ఫొటోను అప్ లోడ్ చేయాలనుకుంటున్నాను. తీవ్రవాదం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఫొటోలను ఎవరైనా అపరిచితులు డౌన్ లోడ్ చేసుకొని దుర్వినియోగం చేసే అవకాశమున్నది. వాడుకరి వివరాలను కూడా సవరణ చేసే అవకాశమున్నది. కనుక నేను నా వాడుకరి పేజీని లాక్ చేసుకొనే అవకాశమున్నదా? దయచేసి సలహా చెప్పగలరు. సెక్యూరిటీపరంగా ఇది వికీపిడియన్లకు ఎంతో మేలు జరుగుతుంది. (115.242.116.144 15:45, 4 ఏప్రిల్ 2013 (UTC)) వాడుకరి: భూపతిరాజు రమేష్ రాజు

తప్పనిసరిగా ఉండవలసిన వ్యాసాలు[మార్చు]

నేను 1.5 కె.బి మొలకల విస్తరణ కు కృషి చేయుచున్నాను. అలాగే తెవికీ లో తప్పనిసరిగా ఉండవలసిన వ్యాసాల జాబితా ఏదైనా కలదా?ఒక వేళ ఉంటే వాటిని కూడా విస్తరించవచ్చు. లేకపోతే జాబితా తయారు చేయండితెలుగు భాషాభిమాని కె.వెంకటరమణ చర్చ 02:35, 5 ఏప్రిల్ 2013 (UTC)

వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు మరియు వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 06:15, 5 ఏప్రిల్ 2013 (UTC)

విన్నపము[మార్చు]

వైజాసత్య గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు విగత నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:48, 5 ఏప్రిల్ 2013 (UTC)

మీ నిర్వాహకత్వం ఎందుకు విగతమైంది? మీరు ఏం చెబుతున్నారో నాకు సరిగా అర్థం కాలేదు. క్షమించి వివరించగలరు --వైజాసత్య (చర్చ) 09:06, 5 ఏప్రిల్ 2013 (UTC)
అక్కడికి వెళ్ళి కొన్ని చర్చలు చూశాను. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఒకవైపు పనిచేసేవాళ్లు ఎవరూ లేరంటూనే, పనిచేసేవాళ్లకు ఇలా ప్రతిబంధకాలు ఏర్పరచటం చాలా చోద్యంగా ఉంది. దీన్ని రచ్చబండలో చర్చించాలి --వైజాసత్య (చర్చ) 09:17, 5 ఏప్రిల్ 2013 (UTC)
వైజాసత్య గారూ, నా విన్నపమునకు మీరు వెనువెంటనే స్పందించినందులకు ధన్యవాదములు. నేను ఇది వరకు ప్రతిపాదన చేశాను. అది 6 మాసముల వరకు నిర్వాహక అవకాశము ఇచ్చారు. ఆ తదుపరి నాకు అవకాశము పొడిగించ లేదు. ప్రస్తుతము విక్షనరీలో మాజీ నిర్వాహకుడినని మీకు తెలియ జేసాను. ఈ [1], [2], [3],[4], లింకులు వీలయితే తమరు చూడగలరు. తదుపరి నా అభ్యర్ధనకు [5] వికీమీడియాలోనూ, నా విన్నపము అధికారము కోసము కాదు కేవలము (పని) అవకాశము కోసమేనని వారికి నా (ఆంగ్ల)భాషలోని భావము స్ఫురించకనో ఏమో సద్దుమణిగినట్లు సద్దుతో ఇంత వరకు స్పందించనే లేదు. ఎవరు మద్దతు ఇస్తారో తెలియక, నేను ఇంకా తగిన తగు అర్హత అభ్యర్ధన పత్రములో నా పేరు పెట్టి జత జేయలేదు. సభ్యుల మనసుల్లోని మాటల స్పందనలను, మారు మాటాడక మంచి మనసుతో తోటి వారిని తెలుసుకుని, ఆ తదుపరి నాకు తగిన అర్హత ఉన్నదని తెలిసిన తదుపరి, అభ్యర్ధన పత్రములో అభ్యర్ధిద్దామని ఆగి వేచి చూస్తున్నాను అని తమరు గ్రహించగలరు అని ఆశిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 09:42, 5 ఏప్రిల్ 2013 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

గండపెండేరం బహూకరించి తెవికీ లో నా బాధ్యతను మరింత పెంచారు. నా కృషిని పెంపొందించు కొనే అవకాశాన్ని కల్పించిన అధికార్లకు, ప్రోత్సాహాన్ని అందిస్తున్న నిర్వాహకులకు, సభ్యులకు ధన్యవాదాలు. మీ సూచనల మేరకు తెవికీని అభివృద్ధిపథంలో నడిపించుటకు నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 04:05, 10 ఏప్రిల్ 2013 (UTC)

వికీసోర్స[మార్చు]

వికీసోర్స్ గూర్చి తెలుపగలరు.Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 05:13, 13 ఏప్రిల్ 2013 (UTC)

వికీపీడియా ఎన్‌సైక్లోపీడియా అయితే వికీసోర్స్ గ్రంథాలయమనమాట. en:Wikisource చూడండి. క్లుప్తంగా ఒక ఉదాహరణతో చెప్పాలంటే భగవద్గీత రాయటం వేరు, భగవద్గీతను గురించి వ్యాసం రాయటం వేరు. భగవద్గీత గురించి వ్యాసం వ్రాస్తే అది వికీపీడియాలో ఉండాలి. భగవద్గీతను యధాతధంగా దించితే వికీసోర్స్ (వికీమూలాలు)లో ఉండాలి. భగవద్గీతను సొంత వ్యాఖ్యానంతో వ్రాస్తే దాన్ని వికీబుక్స్‌లో ఉంచాలి --వైజాసత్య (చర్చ) 05:30, 13 ఏప్రిల్ 2013 (UTC)

తెలుగు ప్రముఖులు[మార్చు]

వికీపీడియాలో తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును ప్రారంభించాను. మొన్న సమావేశంలో ఎక్కువమంది ఇది ఉపయోగపడ్తుందని భావించారు. కానీ నాకిది మొదటి ప్రాజెక్టు తయారుచేయడం. ఒకసారి మీరు చూసి మీ విలువైన సలహాలు అందించి; సమయం ఉంటే సరిదిద్దమని మనవి. ముఖ్యంగా వర్గీకరణ మరియు తరగతి విభజన మూసలు ఎలా చేయాలో తెలియడాం లేదు. అది మీరు తయారుచేస్తే; ఇంతవరకు ఉన్న వ్యాసాల్ని తరగతుల వారీగా వర్గీకరిస్తాను. ఆ తర్వాత ప్రణాలిక సిద్ధం చేసుకోవచ్చును. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 18:13, 17 ఏప్రిల్ 2013 (UTC)

విలీనం మూసల గూర్చి[మార్చు]

విలీనం మూసను విలీనం చెయవలసిన రెండు వ్యాసాలలోనూ ఉంచాలా? లేక ఏదో ఒక వ్యాసంలో ఉంచాలా?--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 11:09, 1 మే 2013 (UTC)

ఎక్కడ విలీనం చెయ్యాలో నిర్ణయించకపోతే {{విలీనం}} మూస ఉంచాలి. రెండు వ్యాసాల్లోను ఉంచడానికి {{విలీనము అక్కడ}}, {{విలీనము ఇక్కడ}} అనే మూసలు కూడా ఉన్నాయి. రెండు వ్యాసాల్లోనూ ఉంచాలనేది ఆంగ్ల వికీ పద్ధతి. ఏ విధంగా చేసినా ఫర్వాలేదు. --వైజాసత్య (చర్చ) 11:45, 2 మే 2013 (UTC)
సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 11:49, 2 మే 2013 (UTC)

గ్రామాల గణాంకాలు[మార్చు]

Nuvola apps edu languages.svg
నమస్కారం వైజాసత్య గారూ. మీకు రహ్మానుద్దీన్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

వైజాసత్య గారూ, [censusindia.gov.in/PopulationFinder/Population_Finder.aspx జనాభా లెక్కల అధికారిక జాలగూడు] వద్ద మనకు గణాంకాలు లభిస్తున్నాయి. నేరుగా గ్రామం పేరు ద్వారా వెతకవచ్చు లేదా రాష్ట్రం->జిల్లా->మండలం, ఈ విధంగా మనకు కావాల్సిన మండలంలోని గ్రామాల గణాంకాలు తెలుసుకోవచ్చు. మొదట రాజశేఖర్ గారు ఇంకా ఇతరులు సమీకరించిన గణాంకాలు అందిస్తామని చెప్పారు, వారు ఆ గణాంకాలు తెచ్చే లోపు ఇలా కృష్ణా జిల్లాలోని మండలాలతో మొదలుపెట్టాను. ప్రస్తుతం ప్రత్యేక గ్రామంలోని స్త్రీ-పురుష జనాభాతో పాటుగా గడపల సంఖ్య మనకు తెలుస్తోంది. అదే రాజశేఖర్ గారి జాబితా వస్తే, అక్షరాస్యత, సాగుకి సంబంధించిన అంశాలు కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం నేను మండల స్థాయిలో జాబితాలు చేర్చుతున్నాను, ఆపై గ్రామాల స్థాయికి వెళదామని నా ఆలోచన, కానీ మధ్యమధ్యలో యాదృచ్ఛిక పేజీల ద్వారా దయినా గ్రామం కనిపిస్తే అందులో జనాభా లెక్కలు చేరవేస్తున్నాను. నా బద్దకం వలన వనరులు రాయటం వదిలివేస్తున్నాను. క్షమించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 08:56, 3 మే 2013 (UTC)

Forced user renames coming soon for SUL[మార్చు]

Hi, sorry for writing in English. I'm writing to ask you, as a bureaucrat of this wiki, to translate and review the notification that will be sent to all users, also on this wiki, who will be forced to change their user name on May 27 and will probably need your help with renames. You may also want to help with the pages m:Rename practices and m:Global rename policy. Thank you, Nemo 17:16, 3 మే 2013 (UTC)

బాట్ ద్వారా చేయదగినవి[మార్చు]

నమస్కారం ప్రస్తుతం నేను బాట్ వాడి replace.py స్క్రిప్ట్ తో అక్షరదోషాలను సరి చేస్తున్నాను. ఇంకా ఏమేమి చేయవచ్చు, తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 15:56, 7 మే 2013 (UTC)

క్షమించాలి మీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు కొంత ఆలస్యమైంది. పదదోషాలు, మూసలు చేర్చటంలాంటి పనులకు పైవికీపీడియా దాకా వెళ్ళనవసరం లేదు. en:Wikipedia:AutoWikiBrowser వాడి చూడండి. అది చాలా సులభం. నా బాటు, ముఖ్యంగా ప్రదీపు బాటు పేజీలో ఉన్న స్క్రిప్టులు చూస్తే మీకు మరికొన్ని ఉపయోగాలు కనిపిస్తాయి. ఈ ప్రశ్నకు కూలంకషంగా మళ్ళీ సమాధానమిస్తా --వైజాసత్య (చర్చ) 09:28, 14 మే 2013 (UTC)
ధన్యవాదాలు. మీ పూర్తి జవాబుకై వేచి ఉన్నాను :) . రహ్మానుద్దీన్ (చర్చ) 16:54, 14 మే 2013 (UTC)

అధికార హోదా ప్రతిపాదన[మార్చు]

చంద్రకాంతరావు గారూ, మిమ్మల్ని అధికార హోదా కొరకై ప్రతిపాదించాను. ప్రతిపాదనకు మీ సమ్మతిని ఇక్కడ తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 05:15, 6 మే 2013 (UTC)

వైజాసత్య గారూ, అధికారి హోదాకొరకు నా పేరు ప్రతిపాదించినందులకు కృతజ్ఞతలు. కాని ఈ హోదా స్వీకరించుటకు నాకు ఆసక్తి లేనందున మీ ప్రతిపాదనపై సమ్మతి తెలుపడం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:04, 8 మే 2013 (UTC)

తెలుగు శాసనాలు[మార్చు]

నమస్కారాలు, తెలుగు శాసనాల ప్రాజెక్టు మీరు నడిపారని మొన్న సమావేశంలో తెలుసుకున్నాను. అర్జునవారు వికీసోర్సులో చేర్చిన పుస్తకాలలో వెతుకుతుండగా తెలుగు శాసనాల గురించిన మంచి గ్రంధం లభించింది. దీనిని జి. పరబ్రహ్మ శాస్త్రి రచించి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 1975లో విడుదలచేశారు. దీనిని నేను మన వికీసోర్సులో చేర్చాను. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:39, 9 మే 2013 (UTC)

శాసనసభ నియోజక వర్గాలు[మార్చు]

ఈ జాబితాలు భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు [6] లో ఉన్నాయి. 1955 శాసనసభ ఎన్నికల ఫలితాలు [7], 1957 ఫలితాలు [8], 1962 ఫలితాలు [9], 1967 ఫలితాలు [10], 1972 ఫలితాలు [11], 1978 ఫలితాలు [12], 1983 ఫలితాలు [13], 1985 ఫలితాలు [[14], 1989 ఫలితాలు [[15], 1994 ఫలితాలు [16], 1999 ఫలితాలు [17], 2004 ఫలితాలు [18] ఇక్కడ వున్నాయి. దయచేసి అన్ని శాసనసభ నియోజక వర్గాలకు పట్టికలను తయారుచేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:52, 12 మే 2013 (UTC)

ప్రత్యుత్తరం[మార్చు]

Nuvola apps edu languages.svg
నమస్కారం వైజాసత్య గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 06:30, 13 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

అర్జున (చర్చ) 06:30, 13 మే 2013 (UTC)

అధికార హోదాకు ప్రతిపాదన[మార్చు]

నన్ను తెలుగు వికీపీడియాలో అధికారిగా ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. నన్ను అధికారిగా చేసి నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. నాకు మద్దతునిచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మీనుండి మరొక సహాయం కావాలి. అధికారిగా నా బాధ్యతలు తెలియజేయమని మనవి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:13, 13 మే 2013 (UTC)

ప్రవాసాంధ్రులు[మార్చు]

తెలుగువారిలో చాలా మంది వివిధ దేశాలలొ ఉన్నత పదవులను అలంకరించి; భారతదేశానికి కీర్తిని తెస్తున్నారు. వీరి గురించి సమాచారం ఎక్కడ లభిస్తుంది. అంతర్జాలంలోనే లభించాలి; మరియు అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లంలోనే లభించాలి. వారిగురించి మీరు కొంచెం సమాచార సేకరణ చేస్తే; అనువాదాన్ని; నేను; సుజాత గారు ఆ బాధ్యతను తీసుకుంటాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:00, 15 మే 2013 (UTC)

యక్షగానము[మార్చు]

వైజాగారు,తప్పకుండా యక్షగానంను తెలుగులోకి అనువాదంచేస్తాను.పాలగిరి (చర్చ) 04:04, 17 మే 2013 (UTC)

వైజాగారు,యక్షగానం వ్యాసంకై మీరిచ్చినలింకులోని దానికి,ప్రస్తుత్తం తెవికీలో వున్న యక్షగానం పుటలో తేడా వుంది.ఈపుటలో కన్నడలోని విషయాన్ని మొత్తంతొలగించారు..5 ఏప్రిల్ న కొంత అనువాదంచేశారు. అందులో యక్షగానంలోని రకాలు/రీతులను(యక్షగానద ప్రభేదగళు)పరిచయపీఠికలో చేర్చారు.అలాగే వేషధారణ,భావగవతారు వంటివికుదించారు.మీరిచ్చిన లింకు ప్రకారం అనువాదంచెయ్యమంటారా?అలాగైనచో రహన్ముద్దిన్ గారి మార్పులను యక్షగానంలోనిరకాలులోనికి మార్చవలసివున్నది.మీరిచ్చిన లింకుప్రకారం అనువాదం చెయ్యమంటారా? పాలగిరి (చర్చ) 05:27, 17 మే 2013 (UTC)
చాలా రోజులు అలా ఉంచి ఇక కన్నడ భాగాలు ఎప్పటికి అనువాదం కావేమోనని నేనే తొలగించేశాను. మీరు కన్నడ వ్యాసాన్ని (kn:ಯಕ್ಷಗಾನ) పక్కన పెట్టుకొని, ప్రస్తుత తెలుగు వ్యాసంలో లేని సమాచారం కన్నడ నుండి అనువదిస్తే సరిపోతుంది. ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 05:37, 17 మే 2013 (UTC)
మీ అభినందనలకు ధన్యవాదాలు.వ్యాసంలోని చిత్రమాలికను కె.వి.రమణగారు తీర్చిదిద్దారు.పాలగిరి (చర్చ) 02:05, 20 మే 2013 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

ధన్యవాదాలు సత్యగారు. అహ్మద్ నిసార్ (చర్చ) 03:57, 20 మే 2013 (UTC)

ప్రముఖుల బొమ్మలు[మార్చు]

ప్రధాన న్యాయమూర్తుల బొమ్మలు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వెబ్ సైటులో ఉన్నాయి. వాటిని మనం ఫైర్ యూస్ క్రింద ఉపయోగించుకోవచ్చునని ఒక బొమ్మను తీసుకున్నాను. పి. సత్యనారాయణ రాజు సరిగా ఉన్నదా. ఒకసారి చూడండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 12:20, 24 మే 2013 (UTC)

ఒక వ్యాసంలో ఆ వ్యాసపు ప్రధాన వస్తువు లేదా వ్యక్తిని చూపటానికి ఒక బొమ్మ సముచిత వినియోగంగా వాడుకోవటం అ.సం.రా కాపీహక్కుల చట్టం పరిధిలోకే వస్తుంది. కానీ వికీ నిబంధనలు ఈ కాపీహక్కుల చట్టాలకంటే కాస్త పైపెచ్చులో ఉన్నవి. ప్రస్తుతానికి ఫర్వాలేదు కానీ ఇలాంటి బొమ్మలను దొరికినప్పుడల్లా ఉచితమైన బొమ్మలలోకి మారుస్తుండాలి. ఈ మధ్య కాలంలో వ్యక్తులకు సంబంధించిన బొమ్మలపై వికీ మరింత కఠినమైన నియమాలు చేసింది. ఒక వ్యక్తి మరణించి ఉండి, ఆ వ్యక్తికి సంబంధించిన ఉచితమైన బొమ్మలు అసలు దొరికే అవకాశం ముమ్మాటికి లేదు అన్న సందర్భంలో మాత్రమే సముచిత వినియోగపు బొమ్మలను అనుమతిస్తున్నారు. ఈ కఠినమైన నియమం వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలు మాత్రమే అని గమనించాలి. --వైజాసత్య (చర్చ) 02:05, 25 మే 2013 (UTC)

zwnj కీ తెలుపేది[మార్చు]

పైజాసత్య గారూ, నమస్తే. ము అజ్జిన్ (muazzin) తెలుగులో వ్రాయుటకు 'ము ' తరువాత 'అ ' వ్రాయుటకు కీ తెలుపగోరుతున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 10:23, 25 మే 2013 (UTC)

నిసార్ గారూ, zwnj వ్రాయాలంటే ^ నొక్కాలి. కానీ ముఅజ్జిన్ వ్రాయటానికి zwnj అవసరం లేదు 'ము' తర్వాత ఒక స్పేసు ఇచ్చి అజ్జిన్ వ్రాయండి. ఆ తర్వాత కాస్త వెనక్కి వచ్చి ఆ మధ్యలో స్పేసు తుడిచెయ్యండి. ఇది వ్రాయటంతో సమస్య కాదు తెలుగు లిప్యాంతరీకరణ సాధనాలు ము వెంటనే అ వచ్చే సందర్భాలను ఊహించలేదు. zwnjని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే అది కనిపించదు కాబట్టి చాలా సమస్యలొస్తాయి. --వైజాసత్య (చర్చ) 13:30, 25 మే 2013 (UTC)
ధన్యవాదాలండి, మీరిచ్చిన రెండవ సూచన బాగుంది, అలాగే చేసాను. అహ్మద్ నిసార్ (చర్చ) 13:36, 25 మే 2013 (UTC)

వ్యాస విస్తరణ గురించి[మార్చు]

నాకు లభించిన సమాచారాన్ని పొందుపరుస్తున్నాను. మరికొంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. Pranayraj1985 (చర్చ) 07:21, 30 మే 2013 (UTC)

స్వాగతం[మార్చు]

రవిచంద్ర గారూ, తెవికీలో మీరు మళ్ళీ కనిపించడం చాలా సంతోషం. మీకు వీలుంటే తిరిగి తెవికీలో క్రియాశీలకంగా పనిచేయాలని విజ్ఞప్తి --వైజాసత్య (చర్చ) 14:39, 2 జూన్ 2013 (UTC)

ధన్యవాదాలు వైజాసత్య గారూ! ఇక మీదట వీలున్నప్పుడల్లా రాస్తుంటాను. ఈ రోజే బెంగుళూరులో వికీ సమావేశానికి వెళ్ళి వచ్చాను. రవిచంద్ర (చర్చ) 17:03, 2 జూన్ 2013 (UTC)

గణాంకాలు[మార్చు]

తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు గణాంకాలు చేర్చినందుకు ధన్యవాదాలు. ఏప్రిల్ మరియు మే నెల ప్రారంభంలోని గణాంకాలను చేర్చగలరా. అది చేయగలిగితే మొదటి పట్టికను తొలగిస్తాను. Rajasekhar1961 (చర్చ) 19:38, 3 జూన్ 2013 (UTC)

అలాగే ప్రయత్నిస్తాను. పూర్వస్థితిని అంచనా వెయ్యటం నాకు కొంత సాంకేతికంగా ఛాలెంజింగ్ పనే. కానీ కొన్ని మార్గాలున్నాయి --వైజాసత్య (చర్చ) 06:13, 10 జూన్ 2013 (UTC)

మెల్బోర్న్[మార్చు]

మెల్బోర్న్ వ్యాసం ఎందుకు కనిపించడం లేదు. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 04:23, 7 జూలై 2013 (UTC)

మొలకల బాధ్యత[మార్చు]

మీరు రచ్చబండలో "ఎవరి మొలకల బాధ్యత వారికి" లో సూచించిన విధంగా నా యొక్క మొలకల జాబితాను తయారుచేయండి. వాటిని విస్తరిస్తాను.--Quill and ink.svg కె.వెంకటరమణ చర్చ 18:15, 7 జూలై 2013 (UTC)

వెంకటరమణ గారూ, ఎప్పటిలాగానే మొలకలను విస్తరించడానికి చొరవగా ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. మీ మొలకల జాబితా ఇక్కడ ఉంది చూడండి --వైజాసత్య (చర్చ) 02:32, 8 జూలై 2013 (UTC)

కొత్త నిర్వహకుడిగా వెంకటరమణ[మార్చు]

కొత్త నిర్వహకుడిగా వెంకటరమణ సరైన వ్యక్తి అని నాకనిపిస్తున్నది. చాలాకాలంగా వ్యాస రచనలోనే కాకుండా నిర్వహణ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ విశేషమైన కృషిచేస్తున్నారు. వీరు మాస్టర్స్ డిగ్రీ చదివిన శాస్త్ర విద్యావేత్త కనుక తెవికీ నిర్వహణ బాధ్యతలను మరింత బాగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వీరిని నిర్వహకునిగా మీరు ప్రతిపాదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.Rajasekhar1961 (చర్చ) 10:06, 9 జూలై 2013 (UTC)

అవును, రమణ గారు తెవికీలో ఖాతా తెరిచినప్పటి నుండి అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రాజశేఖర్ గారి ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:42, 9 జూలై 2013 (UTC)
అవును. నేనూ అదే అనుకున్నాను. నేనొకసారి, చంద్రకాంతరావు గారు ఒకసారి అడిగిచూసాము. ఆయన అదనపు బాధ్యత అని అనుకున్నారో, ఏమో, సమ్మతించలేదు. తప్పకుండా ప్రతిపాదిస్తాను. సమ్మతిస్తే నాకూ ఆనందమే. --వైజాసత్య (చర్చ) 22:35, 9 జూలై 2013 (UTC)
నేను ఫోనులో మాట్లాడినప్పుడు; వారు అంగీకరించారు. దయచేసి రమణగారిని నిర్వహకునిగా ప్రతిపాదించండి.Rajasekhar1961 (చర్చ) 07:27, 10 జూలై 2013 (UTC)