వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 13

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Nuvola apps important blue.svg కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. నెనర్లు :)

సభ్యనామము మార్పు కొరకు[మార్చు]

వైజాసత్య గారు నా సభ్యనామము ఇంతకు ముందేమీరు మార్చారు కానీ కొన్ని రోజులు నామీద నిషేదము విధించుట వల్ల నేను దిద్దుబాట్లు చేయలేకపోయాను కానీ నామీద ఉన్న నిషేద కాలం ముగిసినది కనుక మరలా దిద్దుబాట్లు చేసే అవకాశం లభించింది కానీ నా సమస్యేమిటంటే నా సభ్యనామము ఇంకా సురేష్ డానియేల్ గానే కనిపిస్తుంది దయచేసి దానిని సూరి గా మార్చగలరు సూరి


నోవహు వ్యాసాన్ని బైబిల్ పాత్రలు అనే వర్గంలో చేర్చండి.[మార్చు]

వైజాసత్యగారు నేను {నోవహు} అనే ఒక వ్యాసం రాశాను అది బైబిల్ పాత్రలు అనే ఉప వర్గంలో ఈ వ్యాసాన్ని చేర్చగలరు. సూరి

కొత్త వర్గం[మార్చు]

తెలుగు సినిమా శృంగార నటీమణులు వర్గాన్ని సృష్టించగలరు.

బొమ్మల సహాయం[మార్చు]

బెజవాడ రాజరత్నం ఉచిత బొమ్మ ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ వెబ్ సైటులో ఉన్నది. దయచేసి తెలుగు వికీలోకి బదిలీ చేయమని మనవి. ఆ లింక్ : http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp మరికొన్ని బొమ్మలు ఇక్కడ లభించవచ్చును. ధన్యవాదాలు.Rajasekhar1961 08:24, 4 నవంబర్ 2010 (UTC)

రాజశేఖర్ గారూ, చాలా విలువైన సమాచారమున్న సైటును కనుగొని తెలియజేసినందుకు ధన్యవాదాలు. అయితే మీరిచ్చిన లింకు ద్వారా వెళితే సైటుకు వెళ్ళగలిగాను కానీ రాజరత్నం గారి బొమ్మ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళ లేదు. అంత పెద్ద సముద్రంలో వెతికి పట్టుకోవటం కష్టమనిపించింది. ఆ బొమ్మ ఏ పత్రికలో ఏ సంచికలో ప్రచురితమైందో తెలియజేస్తే అది వికీపీడియాలో చేర్చగలను --వైజాసత్య 23:28, 8 నవంబర్ 2010 (UTC)
http://www.pressacademyarchives.ap.nic.in/ లో Archives ఎంపిక చేసి తరువాతAnandavani 1944, August 20 ఎంపిక ద్వారా చూసి, pdf లింకు పై న నొక్కితే బొమ్మ స్థానానికి చేరుకుంటారు. --అర్జున 12:59, 1 డిసెంబర్ 2010 (UTC)
అర్జున రావు గారూ, ధన్యవాదాలు మీ సహాయం వలన ఆ బొమ్మ చేర్చగలిగాను --వైజాసత్య 05:59, 23 డిసెంబర్ 2010 (UTC)
అదేముంది లేండి. చాలా రోజుల తర్వాత మరల వికీలో కనిపించారు. గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల గురించి కొంత సమయం కేటాయించి స్పందించగోరుచున్నాను.--అర్జున 04:53, 24 డిసెంబర్ 2010 (UTC)

విక్షనరీలో కూడా తెలుగు[మార్చు]

వైజాసత్య గారికి,

  • నమస్కారములు.
  • నేను మీకు కొత్త, పరిచయము లేనివాడిని.
  • వికీపీడియాలో వ్రాసుకుని విక్షనరీలోకి మార్చవలసి వస్తున్నది.
  • విక్షనరీలో కూడా తెలుగులో అక్కడే వ్రాసుకునే విధముగా ఏమైనా అవకాశము ఉన్నదంటారా ?
  • విక్షనరీలో తెలుగు ప్రయోగశాల పుట అయినా కేటాయించితే బావుంటుంది.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:42, 9 నవంబర్ 2010 (UTC)

    • విక్షనరీలో ఇంతకు ముందు అక్కడే వ్రాసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం అది పనిచేయడం లేదు. వైజాసత్య గారు దాని సాఫ్ట్ వేరు సరిచేయగలరని విజ్ఞప్తి.Rajasekhar1961 05:10, 9 నవంబర్ 2010 (UTC)
  • సత్య గారూ తెలుగు వికీని సి డి గా రాసుకొనె వీలు ఉన్నదా?. ఎలా రాసుకొవఛు. నాకు కొంత సమాచరమ్ కావాలి. దానిని నెట్ లెని చోట కూడా ఓపెన్ చేసుకొనే లా డేటా బేశ్ రాసుకోవఛా? ఎలా సిడి లేదా డివిడి ఋఆసుకొవాలి దయచేసి తెలుపగలరు.

భాషాదోషాల పట్టిక[మార్చు]

వికీపీడియా భాషాదోషాల పట్టికలో చాలా వరుకు అక్షర దోషాలున్న పదాలను చేర్చాను కాని మీ Vyzbot బాటు చాలా రోజులు నుండి పని చేయడం లేదు. మీరు ఈ బాటును నడపవలసిందిగా కోరుచున్నాను. నేను పొందు పరచిన అక్షర దోషాలున్న పదాలను ఈ లంకెలో చూడండి. http://te.wikipedia.org/wiki/వికీపీడియా:భాషాదోషాల_పట్టిక --జయంత్ కుమార్ 10:17, 19 నవంబర్ 2010 (UTC)

సినిమా పేజీలు[మార్చు]

తెలుగు సినిమాల గురించి 2000 వరకు అన్నింటికి ఒక పేజీ కేటాయించి అభివృద్ధి చేస్తున్నాము. దీనిలో నేను ఒక భాగస్వామిని. 2000 నుండి 2010 వరకు సినిమాలకు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువ. దయచేసి వీటి గురించి బాటు ద్వారా ప్రతి సినిమాకు పేజీ సృష్టించమని మనవిచేస్తున్నాను. IMDB లో పూర్తి వివరాలున్నాయి. దీని వలన మనం 50,000 పేజీల వికీ మైల్ స్టోన్ ను 2010 పూర్తయే లోపుగా చేరగలము. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి.Rajasekhar1961 11:01, 30 నవంబర్ 2010 (UTC)

వినతి[మార్చు]

అంతర్జాలం లో తెలుగు ఉచ్చారణకు సంబంధించిన సైట్లు ఏవైనా ఉన్నాయో, లేదో కొంచెం తెలుపగలరు... ముఖ్యంగా... పరభాషా మాధ్యమాల్లో చదివినవారికి " శ, ష, జ్ఞా, ణ " లు సరిగా ఎలా పలకాలో తెలియటం లేదు..

మీ నుండి మంచి వ్యాసాలూ చాలా రావాలి అని కోరుకుంటూ...

missing bureaucrat noticeboard on this wiki[మార్చు]

Hi. You are listed as a bureaucrat on this wiki, but so is at least one other person. To contact a bureaucrat, in order to usurp accounts and similar, users have to send duplicate messages, rather than post at a single place. Please create a bureaucrat noticeboard of some sort and list it at meta:Index of pages where renaming can be requested. If it already exists, please list it there! Thank you. --Joy-temporary 11:50, 5 ఆగష్టు 2011 (UTC)

అధికారి హోదా[మార్చు]

వికీపీడియా:అధికార_హోదా_కొరకు_విజ్ఞప్తి/అర్జున చూచి సహాయం చేయండి. --అర్జున 13:46, 27 డిసెంబర్ 2011 (UTC)

విజ్ఞప్తి[మార్చు]

వైజా సత్య గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000

బావున్నారా, చాలా కాలానికి పునర్ధర్శనం.విశ్వనాధ్ (చర్చ) 06:21, 3 సెప్టెంబర్ 2012 (UTC)

స్వాగతం[మార్చు]

వైజాసత్యగారు మీరు తిరిగి వికీపీడియాలోనికి చూడడం మా అదృష్టం. మీకు మా అందరి తరపున హార్థిక సుస్వాగతం. మీలాంటి మూలస్తంభాల వంటి వ్యక్తులు మాకు సలహా సహకారాలు అందిస్తే మనమందరం తెలుగుదనాన్ని ప్రపంచానికి తెలియజేద్దాము. మాలో ఎవరైనా మీకు బాధను కలుగజేస్తే పెద్ద మనసుతో క్షమించండి. Rajasekhar1961 (చర్చ) 07:13, 3 సెప్టెంబర్ 2012 (UTC)

చాలా రోజుల తర్వాత వైజాసత్య గారి దిద్దుబాటు చూసి సంతోషం కలిగింది. తెవికీ అభివృద్ధి మందగిస్తున్న ప్రస్తుత దశలో అనుభవం, నైపుణ్యం ఉన్న అధికారిగా వైజాసత్య గారి సేవలు తెవికీకి చాలా అవసరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:09, 3 సెప్టెంబర్ 2012 (UTC)
మీరు మరల క్రియాశీలం కావటం ఆనందాన్నిచ్చింది. --అర్జున (చర్చ) 13:50, 4 సెప్టెంబర్ 2012 (UTC)

వైజాసత్యగారు ! వికీపీడియాలోకి పునఃస్వాగతం. మీ రాకతో వికీపీడియా పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆశిస్తున్నాను.--t.sujatha (చర్చ) 15:04, 5 సెప్టెంబర్ 2012 (UTC)

పలకరించిన అందరికీ కృతజ్ఞతలు. జవాబివ్వకూడదని కాదు కానీ, ఉన్న కాస్త సమయం నాకిష్టమైన పనిలోనే (దిద్దుబాట్లు చేయటంలో) పెట్టాలని ఆశ..అంతే --వైజాసత్య (చర్చ) 05:31, 18 సెప్టెంబర్ 2012 (UTC)

చూస్తుంటే మీరు ఊరు వచ్చినట్టుందే. నిజమేనా..06:56, 22 సెప్టెంబర్ 2012 (UTC)

లేదండి. నేను ఇండియాకి వచ్చి కనీసం ఐదేళ్లయింది. కాస్త తీరిక దొరికింది, మళ్లీ వికీపీడియా జ్వరం పట్టుకుంది :-) --వైజాసత్య (చర్చ) 07:07, 22 సెప్టెంబర్ 2012 (UTC)

మంచి జ్వరం. ఇపుడే కంగారు పడకు, మెల్లగా తగ్గుదువుగని :) ..విశ్వనాధ్ (చర్చ) 08:21, 22 సెప్టెంబర్ 2012 (UTC)

తెవికీ మారథాన్[మార్చు]

మిమ్మల్ని కలవాలని ఉన్నది. నా నంబర్ 9246376622 కి ఫోన్ చెయ్యగలరా. (మీ నంబర్ నా వద్ద లేదు) రచ్చబండలో ప్రతిపాదించిన తెవికీ మారథాన్ కోసం మీ సలహాలు ఇవ్వండి.Rajasekhar1961 (చర్చ) 07:36, 16 అక్టోబర్ 2012 (UTC)

  • ఈ రోజు పగలంతా ఎప్పుడైనా ఫోను చేయండి ఫరవాలేదు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:34, 17 అక్టోబర్ 2012 (UTC)

(SUL)-->Deepak[మార్చు]

I want to usurp User:Deepak for complete SUL . conformation link here--117.231.189.74 15:45, 10 నవంబర్ 2012 (UTC)

చరిత్రలో ఈ రోజు లో సవరణ కొరకు[మార్చు]

వైజాసత్య గారికి నమస్కారములు,

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వ్యాసంలో నవంబరు 11 న జన్మించినట్లు ఉన్నది.దీనిని మొదటి పేజీలో కూడా సరిచేయగలరు.( కె.వి.రమణ- చర్చ 05:52, 11 జనవరి 2013 (UTC))

రచ్చబండలో స్పందన గూర్చి[మార్చు]

వైజాసత్య గారికి నమస్కారం, తెవికీ అభివృద్ధికి రచ్చబండ లో చర్చలు ఎంతో ఉపయోగపడతాయని మీవంటి ప్రజ్ఞా వంతులకు తెలియనిది కాదు. రచ్చబండ లో "ఏకవాక్య వ్యాసాలు" నివారణ గూర్చి చర్చజరుగుతుంది. మీవంటి నిర్వాహక సభ్యులు మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిన అవసరం ఉన్నది. తెవికీ నాణ్యతా ప్రమాణాల మెరుగుదలకు మీ వంటి వారి సలహాలు సూచనలు అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి మా వంటి అనేక సభ్యుల కు సందేహ నివృత్తి చేయగలరు. రచ్చబండ లో చర్చలకు సభ్యులులేక కొన్ని అర్థాంతరంగా ఆగిపోవుచున్నవి. మీ నిర్వాహకులైనా పాల్గొంటె బాగుంటుందని నేను భావిస్తున్నాము. నిర్వాహకులు ఉదాసీనంగా ఉండటం తగదు.తెవికీ నాణ్యతా ప్రమాణాల మెరుగుదలకు చంద్రకాంతరావు గారు ప్రవేశపెట్టిన "మీకు తెలుసా" మరియు అర్జునరావు గారు ప్రవేశపెట్టిన "బ్లాగులింకుల నియమాలు" చర్చలలో సభ్యులు లేనికారణంగా ముగిసినవని మీకు తెలియంది కాదు. దయచేసి చర్చలలో పాల్గొనండి.(Somu.balla (చర్చ) 06:14, 25 జనవరి 2013 (UTC))

సత్యా గారికి నాకు తెలిసి మీతో మరింత మంది ప్రస్తుతం క్రియాశీలకంగా లేని సభ్యులతో, నిర్వహకులతో కూడా పని చేసాను. మెకు తెలుసు నేనెవ్వరినీ ఇబ్బంది పెట్టిందిలేదు. వీలయినంత ప్రోత్సాహమివ్వడమే తప్ప. అయితే రెడ్డిగారి యొక్క విషయం నాకు అర్ధం కాలేదు. ఆయన కావాలనే చేస్తున్నాడనేది మాత్రం నిర్ధారణ అయింది. ఉదాహరనకు ఆయన పేజీలో మొదట్లో ఇలా రాయండి, వీటిని మార్చండి అని రాసాను. నాతో పాటు ఇతర సభ్యులు రాసిన అలాటి అన్నిటినీ ఆయన చెరిపేసుకుంటున్నాడు. తిరిగి ఏమీ తెలియనట్టు అదే చేస్తున్నాడు. ఆయన ఒక వ్యాసం చర్చ:పిప్పలి ని చూడండి. పిప్పలు ఓకరకపు మిరియపు రకం అని మాత్రమే రెడ్డి గారు రాసారు. దానిని విస్తరించినది రాజశేఖర్ గారు. మిగిలిన వారూను. ("పిప్పలి" కూర్పుల చరితం)దీని బట్టి ప్రాధాన్యతా వ్యాసలను నేను వ్యతిరేకిని కాను అని మీకు తెలుపుతున్నాను. ఒక వ్యాసం విలీనం చేసి దానినే విస్తరించండి అన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ సృష్టించడానికి కారణం అర్ధం కాలేదు. ఎవరి మాటా వినడు సీతయ్య అనా :) మీకిలా రాయడానికి కారణం ముందు ముందు కూడా నేను ఆయన వ్యాసాలలో వేలు పెడతాను. మీకు తెలుసు ఒకసారి వికీలో రాసాక అది మనది కాదు అని. కాని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అయనకు అర్ధం అయ్యేలా ఎంతకాలం ఎందరు చెప్పాలో నాకు తెలియడం లేదు.విశ్వనాధ్ (చర్చ) 07:39, 19 ఫిబ్రవరి 2013 (UTC)

మీ అభిప్రాయం తెలుపగరు[మార్చు]

వైజాసత్య గారు, చాలా రోజుల తర్వాత నా చర్చా పేజీలో మీ దిద్దుబాటుకు సంతోషం. ప్రస్తుత దశలో ఒక్కో సభ్యుడు తమకిష్టమైన విధంగా ప్రవర్తించడం కారణంగా నేను తెవికీకి దూరంగా ఉండవలసివచ్చింది. ఒకప్పుడు మీమార్గదర్శకంలో వైభవంగా వెలుగొందిన తెవికీకి మళ్ళీ 2008 నాటివలె చూడాలని ఉంది. మీరు మళ్ళీ తెవికీని ముందుండి నడిపిస్తారంటే నేనూ మళ్ళీ చురుగ్గా దిద్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సుజాతగారు కూడా నా చర్చాపెజీలో ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీ ప్రతిస్పందన చూసి నేను తెవికీ భవిష్యత్తు కార్యక్రమం గురించి ఆలోచిస్తాను. లేనిచో పరిస్థితులు చక్కబడేవరకు సెలవులోనే ఉంటాను. ప్రస్తుతానికి "పాలమూరు జిల్లా విజ్ఞాన సర్వస్వం" బ్లాగు రూపకల్పనలో నిమగ్నమైయున్నాను, వాటిని త్వరలోనే ఆవిష్కరించగలను. నా తెవికీ భవిష్యత్తు కార్యక్రమం ఆలోచించడానికి మీ అభిప్రాయం వెల్లడించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:25, 20 ఫిబ్రవరి 2013 (UTC)

Talkback[మార్చు]

Nuvola apps edu languages.svg
నమస్కారం వైజాసత్య గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 08:37, 21 ఫిబ్రవరి 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

అర్జున (చర్చ) 08:37, 21 ఫిబ్రవరి 2013 (UTC)