ప్రాణవాయు పట్టణ అటవీ పార్కు
ప్రాణవాయు పట్టణ అటవీ పార్కు | |
---|---|
రకం | పట్టణ పార్కు |
స్థానం | గాజులరామారం, కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ |
సమీప పట్టణం | హైదరాబాదు |
విస్తీర్ణం | ఎకరాలు |
నవీకరణ | 2022 |
నిర్వహిస్తుంది | తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ |
స్థితి | వాడులో ఉంది |
ప్రాణవాయు పట్టణ అటవీ పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో ఏర్పాటుచేసిన పార్కు.[1] గాజులరామారంలోని 142 ఎకరాల విస్తీర్ణంలో 60 ఎకరాలలో 16 కోట్ల రూపాయలతో స్వచ్ఛమైన ఆక్సిజన్ హైదరాబాదు మహానగర పాటక సంస్థ ఈ పార్కును అభివృద్ధి చేసింది.[2]
ప్రారంభం
[మార్చు]2022 జనవరి 25న రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ పార్కును ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖామంత్రి సిహెచ్. మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[3]
సదుపాయాలు
[మార్చు]పార్కు ప్రధాన ద్వారంతోపాటు కంపౌండ్ వాల్‌పై జంతువుల ప్రతిరూపాలను చిత్రీకరించడంతోపాటు అక్కడక్కడ హంస, సింహం, పులి, జింక వంటి బొమ్మలను ఏర్పాటుచేశారు. వన భోజనాలకు వీలుగా నర్సరీ, వాచ్ టవర్, విశ్రాంతి గదులతోపాటు ఇతర సదుపాయాలు కల్పించబడ్డాయి.[4]
వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, వాష్ రూమ్స్, యోగ షెడ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండు ఓపెన్ క్లాస్ రూలు, పిక్నిక్ ఏరియా, పాఠశాలలు-కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు పార్కు ప్రత్యేకతను వివరించేలా ఓపెన్ క్లాస్ రూంలు, ఏర్పాటుచేయబడ్డాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-01-22). "హైదరాబాద్‌లో ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్". www.ntnews.com. Archived from the original on 2022-01-22. Retrieved 2023-04-26.
- ↑ ABN (2022-01-30). "ప్రాణవాయు పార్కులు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-26. Retrieved 2023-04-26.
- ↑ "Pranavayu Urban Forest Park to boost lung space". The New Indian Express. Archived from the original on 2022-01-25. Retrieved 2023-04-26.
- ↑ telugu, NT News (2021-11-01). "హైదరాబాద్‌లో త్వరలోనే ప్రాణవాయు పార్కు ప్రారంభం". www.ntnews.com. Archived from the original on 2021-11-01. Retrieved 2023-04-26.
- ↑ krishna (2022-01-29). "జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు". Mana Telangana. Archived from the original on 2022-01-31. Retrieved 2023-04-26.