Jump to content

బంగారు బుల్లోడు

వికీపీడియా నుండి
బంగారు బుల్లోడు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
నిర్మాణం వి.బి.రాజేంద్ర ప్రసాద్
తారాగణం బాలకృష్ణ,
రమ్యకృష్ణ,
రవీనా టాండన్
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

బంగారు బుల్లోడు 1993 లో విడుదలైన సినిమా. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రమ్య కృష్ణ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఇది రవీనా టాండన్ చేసిన మొదటి తెలుగు సినిమా. బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ కూడా అదే రోజు విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టైంది..[1]

బాల కృష్ణ ( నందమూరి బాలకృష్ణ ) తన మేనమామ రామదాసు ( రావు గోపాలరావు ) కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. రామదాసు రామభక్తుడు. రాముడే చెయ్యమని చెప్పాడు అని తాను చేసే దుష్కార్యాలు చేస్తూ పోతూంటాడు. అతని కుమార్తె రాణి ( రమ్య కృష్ణ ) బాలకృష్ణను ఎంతగానో ప్రేమిస్తుంది. అతని కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంది.

ఈ సమయంలో బాలకృష్ణ నగరంలో ఉండే తన మరో బంధువు ప్రియ ( రవీనా టాండన్ ) ను కలుస్తాడు. ఆమె తన కేర్‌టేకరు తులశమ్మ ( శ్రీవిద్య ) తో గ్రామానికి వస్తుంది. అతడు ప్రియ ప్రేమలో పడతాడు. ఇది రాణికి ఆగ్రహం కలిగిస్తుంది. రాణి, ప్రియలి బాలకృష్ణ ప్రేమ పొందే విషయంలో ఒకరినొకరు సవాలు చేసుకుంటారు.

ప్రియ బాలకృష్ణను నిజంగా ప్రేమించకపోయినా బాలకృష్ణ తన ప్రేమను వెల్లడించినపుడు ఆమె అంగీకరిస్తుంది. ఒక రోజు ప్రియ తన ఉంగరాన్ని పాము పుట్టలో వేసి బాలకృష్ణకు చెప్పి తియ్యమంటుంది. బాలకృష్ణ దాన్ని తీసేటపుడు పాము కాటేస్తుంది. అప్పుడు తనకు నిజంగా అతనిపై ప్రేమ లేదని ఆమె చెబుతుంది. దీనిపై కోపగించిన బాలకృష్ణ, ఆమె మెడలో మంగళసూత్రం కడతాడు. బాలకృష్ణకు ఇకపై ప్రేమ విరిగిపోయినప్పటికీ, మనిషి ఉద్వేగాలతో ఆడుకోవద్దని చెప్పేందుకే అతను దానిని ఆమెకు కట్టాడు. ఇది గ్రామంలో పెద్ద సమస్యగా మారుతుంది. బాలకృష్ణ తల్లి అన్నపూర్ణమ్మ ( అన్నపూర్ణ ) రాణితో పాటు ఈ జంటను తిరిగి కలపడానికి ప్రయత్నిస్తుంది. రాణి అంతరంగంలో బాలకృష్ణను పెళ్ళి చేసుకోనందుకు చాలా నిరాశ చెంది ఉంటుంది.

ప్రియపై ఒక రోజు గూండాలు దాడి చేసినప్పుడు, బాలకృష్ణ ఆమెను రక్షిస్తాడు. ప్రియా అతనితో ప్రేమలో పడతుంది. అయితే, బాలకృష్ణకు ఆమెపై ప్రేమలేదు, ఆమెను తన భార్యగా పరిగణించడు. ప్రియ అన్నపూర్ణమ్మ అంగీకారంతో బాలకృష్ణ ఇంట్లో చేరుతుంది. ఒక రోజు ప్రియను కాల్చడానికి ఒక వ్యక్తి ప్రయత్నించినప్పుడు, ఆమె వెంట హంతకులు ఎందుకు పడుతున్నారని అతడు ప్రశ్నిస్తాడు. తులశమ్మ అప్పుడు ప్రియ చీకటి గతాన్ని వెల్లడిస్తుంది.

వాస్తవానికి తులశమ్మ ఒక పోలీసు అధికారి. ఆమె ప్రియ బావ డిఐజి బెనార్జీ ( దేవన్ ) కి సహోద్యోగి, స్నేహితురాలు. బెనార్జీ నానా ( దేవరాజ్ ) సోదరుడిని చంపి నానాను అరెస్ట్ చేస్తాడు. శక్తివంతమైన ఉగ్రవాది అయిన నానా, బెనర్జీని, అతని కుటుంబాన్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రియ మాత్రమే ప్రాణాలతో బయటపడుతుంది. కాని జైలులో ఉన్నప్పుడు నానా ఆమె కోసం వెతుకుతాడు. ఆమె సురక్షితంగా ఉండటానికి, పోలీసులు ఆమెను నానా యొక్క సొంత పట్టణంలో దాస్తారు. నానా ఆమె అక్కడే ఉంటుందని తెలుసుకోలేడు, ఊహించను కూడా లేడు. వాస్తవానికి ప్రియ బాలకృష్ణ బంధువు కూడా కాదు. వాస్తవం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వారు అతన్ని ఉపయోగించుకున్నారు.

అప్పుడు బాలకృష్ణ ప్రియను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఆమెను నానా నుండి రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇంతలో, ప్రియా తన సొంత ఊళ్ళోనే ఉందని తెలుసుకున్న నానా జైలు నుంచి తప్పించుకుంటాడు. బాలకృష్ణ నానాను చంపుతాడు.  

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."గుడివాడ గుమ్మరో"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర6:24
2."ఎన్నెట్లో చాపేసి"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:54
3."తథిగిణథోం"భువనచంద్రమనో, కె.ఎస్. చిత్ర, మిన్మిని5:02
4."స్వాతిలో ముత్యమంత"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:10
5."మనసు ఆగదు"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ5:51
మొత్తం నిడివి:32:19

మూలాలు

[మార్చు]
  1. http://www.cinejosh.com/news/3/34900/balakrishna-hits-and-flops.html