బాలూర్ఘాట్
Balurghat | |
---|---|
Town | |
Coordinates: 25°13′N 88°46′E / 25.22°N 88.76°E | |
Country | India |
రాష్ట్రం | West Bengal |
జిల్లా | Dakshin Dinajpur |
Government | |
• Type | Municipality |
• Body | Balurghat Municipality |
• Chairman | Ashok Kumar Mitra (TMC) |
• MLA | Ashok Kumar Lahiri (BJP) |
• MP | Sukanta Majumdar (BJP) |
• DM | Bijin Krishna, I.A.S. |
• SP | Rahul De |
విస్తీర్ణం | |
• Total | 10.76 కి.మీ2 (4.15 చ. మై) |
Elevation | 24 మీ (79 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 1,51,416 |
• జనసాంద్రత | 14,000/కి.మీ2 (36,000/చ. మై.) |
Languages | |
• Official | Bengali[3][4] |
• Additional official | English[3] |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 733101 |
Telephone code | 03522 |
Vehicle registration | WB-61/WB-62 |
Lok Sabha constituency | Balurghat |
Vidhan Sabha constituency | Balurghat |
బాలూర్‌ఘాట్, భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక నగరం. ఇది పురపాలిక పట్టణం. ఇది దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాకు కేంద్రం. జాతీయ రహదారి 512 ద్వారా అనుసంధానించబడిన ప్రధాన నగరాల్లో ఇది ఒకటి. ఈ పట్టణంలో సంగ్రహశాల, ఉద్యానవనాలు, ఉన్నత శ్రేణి ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రి ఉన్నాయి. జిల్లా కోర్టు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయం, రక్షకభట నిలయం, రైల్వే స్టేషన్, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మొదలైనవి ఉన్నాయి. ఆత్రేయ నది ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఇది ప్రశాంతంగా జీవించడానికి మంచి అనువైన ఒక ప్రదేశం/పట్టణం చెప్పవచ్చు. దీనిని అక్టోబరు, నవంబరు నెలలలో సందర్శించటానికి అనువైన ప్రదేశం. ఆచార, మతపరమైన పండుగలను ఆస్వాదించవచ్చు. బాలూర్‌ఘాట్ లోపలి ప్రాంతం నుండి భారతదేశ-బంగ్లాదేశ్ సరిహద్దును చూడగలిగే గ్రామీణ ప్రాంతం అయిన హిల్లికి ఇక్కడ నుండి వెళ్లి తిలకించవచ్చు.
భౌగోళిక శాస్త్రం
[మార్చు]స్థానం
[మార్చు]బాలూర్ఘాట్ పట్టణం 25°13′N 88°46′E / 25.22°N 88.77°E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది.[5] ఇది సముద్ర మట్టానికి 25 మీటర్లు (82 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.పట్టణం 10.76 కి.మీ2 (4.15 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆత్రేయ నది నగరం అంతటా ప్రవహిస్తుంది. ఇది పట్టణాన్ని అసమాన భాగాలుగా విభజిస్తుంది. నగరం ప్రధాన, ముఖ్యమైన పరిపాలనా, సాంస్కృతిక, వినోద కేంద్రాలతో, నదికి తూర్పు ఒడ్డున ఉంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ఈ పట్టణానికి సుమారు 3 కి.మీ దూరంలో ఉంటుంది.
రక్షకభట నిలయాలు
[మార్చు]పశ్చిమ బెంగాల్ పోలీసు పరిధిలోని బాలూర్‌ఘాట్ రక్షకభట నిలయం బాలూర్‌ఘాట్ పురపాలకప్రాంతం, బాలూర్‌ఘాట్ సిడి బ్లాకుపై అధికార పరిధిని కలిగి ఉంది.[6][7] బాలూర్‌ఘాట్ మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో బాలూర్‌ఘాట్ ఉప విభాగం ఉంది.[7]
ఉపవిభాగం, సిడి బ్లాకు ప్రధాన కార్యాలయం
[మార్చు]బాలూర్‌ఘాట్ ఉపవిభాగం దాని ప్రధాన కార్యాలయం బాలూర్‌ఘాట్‌లో ఉంది.[6] బాలూర్‌ఘాట్ సిడి బ్లాకు ప్రధాన కార్యాలయం బాలూర్‌ఘాట్‌లో ఉంది.[8][9]
జనాభా శాస్త్రం
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాలూర్‌ఘాట్ పురపాలక సంఘం పరిధిలో 153279 జనాభా ఉంది.అందులో 76730 మంది పురుషులు కాగా, 76549 మంది మహిళలు ఉన్నారు. బాలూర్‌ఘాట్ పట్టణ సమ్మేళనం 1,64,593 జనాభాను కలిగి ఉంది. అందులో 82,466 మంది పురుషులు కాగా, 82,127 మంది మహిళలు ఉన్నారు. 0–6 సంవత్సరాల వయస్సుగల జనాభా 10,349. 7+ జనాభాకు సమర్థవంతమైన అక్షరాస్యత రేటు 91.66 శాతంగా ఉంది.[10] బాలూర్‌ఘాట్‌లో 37507 గృహాలు ఉన్నాయి
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, బాలూర్‌ఘాట్ పురపాలక సంఘం పరిధిలో 1,51,416 మంది జనాభా ఉన్నారు, అందులో 75,794 మంది పురుషులుకాగా, 75,622 మంది మహిళలు ఉన్నారు. బాలూర్‌ఘాట్ సగటు అక్షరాస్యత రేటు 84.8%, పురుషులు అక్షరాస్యత రేటు 87% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 82.5% ఉంది. అక్షరాస్యులు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 10,677 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు జనాభా 15,204 మంది ఉన్నారు.షెడ్యూల్డ్ తెగల జనాభా 3,008 మంది ఉన్నారు.[2] పట్టణ జనాభా మొత్తంలో 98.7% మంది హిందువులు, తక్కువ శాతం (1% కంటే తక్కువ) ముస్లింలు, సిక్కులు ఉన్నారు.
ఆర్థిక శాస్త్రం
[మార్చు]బలూర్ఘాట్ ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని ఒక పంపిణీ కేంద్రం. వర్తకం చేయబడే ప్రధాన సరుకు బియ్యం, జనపనార, చెరుకు, చేపలు, నూనెగింజలు ఎక్కువుగా ఉంటాయి.[11]
చదువు
[మార్చు]పాఠశాలలు
[మార్చు]- ఆత్రేయ డిఎవి పబ్లిక్ స్కూల్
- బాలూర్‌ఘాట్ బాలికల ఉన్నత పాఠశాల [12]
- బాలూర్‌ఘాట్ ఉన్నత పాఠశాల
- బాలూర్‌ఘాట్ ఖాదీంపూర్ ఉన్నత పాఠశాల [13]
- బాలూర్‌ఘాట్ టెక్నో ఇండియా గ్రూప్ పబ్లిక్ స్కూల్ [14]
- జవహర్ నవోదయ విద్యాలయ, దక్షిణ్ దినాజ్‌పూర్
- కేంద్రీయ విద్యాలయ, బాలూర్‌ఘాట్ [15]
కళాశాలలు
[మార్చు]- బాలూర్‌ఘాట్ కళాశాల [16][17]
- బాలూర్ఘాట్ మహిళా మహావిద్యాలయ [18][19]
- బాలూర్‌ఘాట్ న్యాయ కళాశాల [20][21]
- జామినీ మజుందార్ మెమోరియల్ కళాశాల
- ఉత్తర బంగా కృషి విశ్వవిద్యాలయ (మఝియాన్ క్యాంపస్)
విశ్వవిద్యాలయాలు
[మార్చు]- దక్షిణ్ దినాజ్‌పూర్ విశ్వవిద్యాలయం
పండుగలు
[మార్చు]దుర్గాపూజ,కాళీపూజ, ఛత్ పూజ,రథయాత్ర, బిశ్వకర్మ పూజ,గణేష్ చతుర్థి, సరస్వతి పూజలు బాలూర్‌ఘాట్‌లో విస్తృతంగా జరుపుకుంటారు.
ఆరోగ్య సంరక్షణ
[మార్చు]- బాలూర్‌ఘాట్ సాధారణ అసుపత్రి (జిల్లా ఆసుపత్రి)లో 600 పడకలతో ఉంది.
- బాలూర్‌ఘాట్ రక్షకభట ఆసుపత్రిలో 50 పడకలతో ఉంది.
- బాలూర్‌ఘాట్ పౌరా ఆసుపత్రి, మాత్రి సదన్‌లలో 32 పడకలతో ఉంది.[22]
- బాలూర్‌ఘాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
ఇది కూడ చూడు
[మార్చు]- బాలూర్‌ఘాట్ ఉన్నత పాఠశాల
- బాలూర్‌ఘాట్ విమానాశ్రయం
- ఆత్రేయి డిఎవి పబ్లిక్ స్కూల్
మూలాలు
[మార్చు]- ↑ "Balurghat Municipality". sudawb.org. Retrieved 25 November 2020.
- ↑ 2.0 2.1 "Census of India: Balurghat". www.censusindia.gov.in. Retrieved 10 October 2019.
- ↑ 3.0 3.1 "Fact and Figures". Wb.gov.in. Retrieved 14 July 2019.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). Nclm.nic.in. Ministry of Minority Affairs. p. 85. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 14 July 2019.
- ↑ "Maps, Weather, and Airports for Balurghat, India".
- ↑ 6.0 6.1 "District Statistical Handbook 2014 Dakshin Dinajpur". Table 2.1. Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 21 January 2019. Retrieved 4 December 2018.
- ↑ 7.0 7.1 "Dakshin Dinajpur District Police". Know your PS. District Police. Archived from the original on 28 November 2017. Retrieved 4 December 2018.
- ↑ "District Census Handbook: Dakshin Dinajpur, Series 20 Part XII A" (PDF). Map of Dakshin Dinajpur with CD Block HQs and Police Stations (on the fourth page). Directorate of Census Operations, West Bengal, 2011. Retrieved 4 December 2018.
- ↑ "BDO Offices under Dakshin Dinajpur District". Department of Mass Education Extension & Library Services, Government of West Bengal. West Bengal Public Library Network. Archived from the original on 2 నవంబరు 2018. Retrieved 4 December 2018.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 21 October 2011.
- ↑ Balurghat, from Encyclopædia Britannica.
- ↑ "Balurghat students feted". The Statesman. 16 July 2020. Retrieved 11 March 2022.
- ↑ "Grassroot Leader With Strong RSS Imprint: Why BJP Chose Sukanta Majumdar as Bengal Party President". News18 (in ఇంగ్లీష్). 20 September 2021. Retrieved 11 March 2022.
- ↑ "Techno Global Balurghat". www.technoindiagroup.com. Retrieved 25 October 2020.
- ↑ "Kendriya Vidyalaya, Balurghat, South Dinajpur: Admission, Fee, Facilities, Affiliation". school.careers360.com (in ఇంగ్లీష్). Retrieved 27 February 2022.
- ↑ "Balurghat College". BC. Retrieved 7 December 2018.
- ↑ "Balurghat College". College Admission. Retrieved 7 December 2018.
- ↑ "Balurghat Mahila Mahavidyalaya". BMM. Archived from the original on 9 డిసెంబరు 2018. Retrieved 7 December 2018.
- ↑ "Balurghat Mahila Mahavidyalaya". College Admission. Retrieved 7 December 2018.
- ↑ "Balurghat Law College". BLC. Retrieved 7 December 2018.
- ↑ "Balurghat Law College". College Admission. Retrieved 7 December 2018.
- ↑ "Health & Family Welfare Department". Health Statistics. Government of West Bengal. Archived from the original on 28 అక్టోబరు 2021. Retrieved 7 December 2018.