భీష్మ (1962 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీష్మ
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
కాంతారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్
గీతరచన ఆరుద్ర
ఛాయాగ్రహణం ఎం.ఎ.రహ్మాన్
నిర్మాణ సంస్థ బి.ఎ.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

భీష్మ: ఇది 1962లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి.అర్ భీష్మునిగా నటించారు. గాంగేయుని జననం, తండ్రి శంతనుని కోరిక తీర్చడానికి భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్మునిగా పేరు గాంచడం, సోదరులయిన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుల కోసం కాశీరాజు కుమార్తెలయిన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకుని రావడం, తన మనసు సాల్వునకు అంతకు ముందే అర్పించానని అంబ పలకడంతో ఆమెను సాల్వునకప్పగించగా, సాల్వుడు అంబను నిరాకరించడం, స్వయంవరం నుండి తెచ్చిన అంబను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు వివాహమాడ నిరాకరించడం, తరువాత అంబ తపస్సుతో శివుని మెప్పించి భీష్ముని చంపగల శక్తిని కోరి మరుజన్మలో శిఖండిగా జన్మించడం, భీష్ముడు కురువృద్దునిగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడం, చివరకు అర్జునుని శరాఘాతంతో భీష్మునికి మరణం తధ్యమైనపుడు, భీష్ముడు తండ్రి యిచ్చిన స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఉపయోగించి ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీకృష్ణదర్శనం అయిన పిదప పరమపదాన్ని అలంకరించడం వరకు చిత్రకథ సాగుతుంది. భీష్మ కథ అంటే మొత్తం భారతం అన్నట్టు చిత్రంలో మహాభారత కథ మొత్తం సృష్టించబడింది. అంబ గా అంజలి, సాల్వునిగా కాంతారావు, కర్ణునిగా గుమ్మడి, దుర్యోధనునిగా ధూళపాల నటించారు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభోదేవదేవా మొరాలించి పాలించరావా ఆరుద్ర సాలూరి రాజేశ్వరరావు పి.సుశీల
హైలో హైలెస్స హంస కదా నాపడవా ఆరుద్ర సాలూరి రాజేశ్వరరావు కె.జమునారాణి
మనసులోని కోరికా తెలుసునీకు ప్రేమిక ఆరుద్ర సాలూరి రాజేశ్వరరావు పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
బ్రహ్మదేవ శుభ భాగ్యవిధాత పాహి పాహి హే! భావాతీత ఆరుద్ర సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల, కోరస్

బ్రంహనందం పరమ (శ్లోకం). ఘంటశాల., రచన ఆరుద్ర

తెలియగా లేరే నీ లీలలు . ఘంటశాల.రచన: :ఆరుద్ర.

ఓహొహో దురాశ చే దుర్యోధనాదులు . ఘంటశాల.

కుప్పించి ఎగసిన (పద్యం). ఘంటశాల.భాగవతం.రచన: బమ్మెర పోతన

దేవ దేవ జీవాత్మక (పద్యం). ఘంటశాల.మహాభారతం.రచన: తిక్కన

నా జన్మంబు తరింప చేసెద . (పద్యం). ఘంటశాల. రచన: తాపీ ధర్మారావు

చేసిన కర్మయే జీవికి చుక్కాని(పద్యం), పి.బి.శ్రీనివాస్ , రచన: తాపీ ధర్మారావు

జోజో జోల గారాల బాలా అలలమీద తామరలే, పి.సుశీల, రచన: ఆరుద్ర

దురాశచే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి,ఘంటసాల , రచన:ఆరుద్ర

నమో త్యాగ చరితా భీష్మ నమో పుణ్య పురుషా, పిఠాపురం బృందం , రచన: ఆరుద్ర

నన్ను నెవ్వానిగా నెంచినావు మామా భయము (పద్యం), పి.బి శ్రీనివాస్ , రచన: ఆరుద్ర

నీ రాధను నేనే ఎడబాయగలేనే వలచి ఇటు నిలచి , పి.సుశీల, ఎస్.జానకి, రచన:ఆరుద్ర

పాండవులను కుంతి పండియుండగ లక్క ఇంటికి నిప్పు ,(పద్యం), పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర

పోరు నష్టంబు మన భాందవులకు నెల్ల సర్వనాశంబు(పద్యం), పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర

సమరమటంచు మీరిటుల చంకలు గ్రుద్దుట చోద్యం,(పద్యం) , పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర.

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి