మెహర్ చంద్ మహాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరవ
మెహర్ చంద్ మహాజన్
3వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
1954 జనవరి 4 – 1954 డిసెంబరు 22
Appointed byబాబూ రాజేంద్ర ప్రసాద్
అంతకు ముందు వారుఎం. పతంజలి శాస్త్రి
తరువాత వారుబిజన్ కుమార్ ముఖర్జియా
జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి
In office
1947 అక్టోబరు 15 – 1948 మార్చి 5
అంతకు ముందు వారుజనక్ సింగ్
తరువాత వారుషేక్ అబ్దుల్లా
వ్యక్తిగత వివరాలు
జననం(1889-12-23)1889 డిసెంబరు 23
కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్‌
మరణం1967 డిసెంబరు 11(1967-12-11) (వయసు 77)

జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ (1889, డిసెంబరు 23 - 1967, డిసెంబరు 11) భారతదేశ సుప్రీంకోర్టు మూడవ ప్రధాన న్యాయమూర్తి. మహారాజా హరిసింగ్ హయాంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేసి ఆ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. భారతదేశం - పాకిస్తాన్ సరిహద్దులను ఏర్పాటుచేసిన రాడ్‌క్లిఫ్ కమిషన్‌లో భారత జాతీయ కాంగ్రెస్ నామినీగా ఉన్నాడు. జస్టిస్ మహాజన్ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, రాజకీయ నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

జననం, విద్య[మార్చు]

మెహర్ చంద్ మహాజన్ 1889 డిసెంబరు 23న హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలోజన్మించాడు. అతని తండ్రి లాలా బ్రిజ్ లాల్ న్యాయవాది, ధర్మశాలలో ప్రసిద్ధ న్యాయవాద విద్యను స్థాపించాడు.[1] మహాజన్ పాఠశాల విద్య తరువాత, 1910లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ)లో చేరాడు. తండ్రి మాటతో న్యాయవిద్యకు మారాడు. 1912లో ఎల్.ఎల్.బి. డిగ్రీ పట్టా పొందాడు.[1]

న్యాయవాదిగా[మార్చు]

1913లో ధర్మశాలలో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన మహాజన్, అక్కడ ఒక సంవత్సరంపాటు ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత 1914-1918 మధ్యకాలంలో నాలుగు సంవత్సరాలపాటు గురుదాస్‌పూర్‌లో న్యాయవాది పనిచేశాడు.1918 నుండి 1943 వరకు లాహోర్‌లో న్యాయవాద వృత్తిని అభ్యసించాడు. 1938 నుండి 1943 వరకు లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తి[మార్చు]

స్వాతంత్ర్యానికి రావడానికి ముందే పంజాబ్ హైకోర్టులో న్యాయమూర్తి పదవిని చేపట్టాడు. జమ్మూ - కాశ్మీర్ మహారాజు భారతదేశంతో విలీనానికి సంబంధించిన చర్చల కోసం తన ప్రధానమంత్రిని కావాలని పిలిచాడు.[2]

జమ్మూ కాశ్మీర్ ప్రధాన మంత్రి[మార్చు]

మహాజన్ 1947 సెప్టెంబరులో మహారాణి ఆహ్వానం మేరకు కాశ్మీర్‌ను సందర్శించాడు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రధానమంత్రిగా ఉండవలసిందిగా కోరగా ఆయన అంగీకరించి, 1947 అక్టోబరు 15న జమ్మూ & కాశ్మీర్ ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. ఆ రాష్ట్రాన్ని భారతదేశంలోకి చేర్చడంలో పాత్ర పోషించాడు.[3] 1947 అక్టోబరులో జమ్మూ & కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. మహాజన్ భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ 1వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1948 మార్చి 5 వరకు పనిచేశాడు.

ప్రధాన న్యాయమూర్తి, భారత సుప్రీంకోర్టు[మార్చు]

మహాజన్ 1954 జనవరి 4న భారతదేశం మూడవ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. 1954 డిసెంబరు 22న పదవీ విరమణ చేసే వరకు దాదాపు ఒక సంవత్సరంపాటు భారతదేశ న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉన్నాడు. (65 సంవత్సరాల వయస్సులో తప్పనిసరి పదవీ విరమణ). ప్రధాన న్యాయమూర్తి కావడానికి ముందు 1948 అక్టోబరు 4 నుండి 1954 జనవరి 3 వరకు స్వతంత్ర భారతదేశ సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తులలో ఒకరిగా పనిచేశాడు.

నిర్వర్తించిన పదవులు[మార్చు]

  • డైరెక్టర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1933–43
  • ప్రెస్. డిఏవి కళాశాల, మేనేజింగ్ కమిటీ, 1938–43
  • ఫెలో అండ్ సిండిక్, పంజాబ్ విశ్వవిద్యాలయం, 1940–47
  • న్యాయమూర్తి, లాహోర్ హైకోర్టు, 1943
  • ఆల్ ఇండియా ఫ్రూట్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ బాంబే సెషన్, 1945
  • సభ్యుడు, ఆర్ఐఎన్ తిరుగుబాటు కమిషన్, 1946
  • 1947 జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర దీవాన్ 1947-48
  • న్యాయమూర్తి, తూర్పు పంజాబ్ హైకోర్టు
  • పంజాబ్ సరిహద్దు కమిషన్, 1947
  • సిండిక్, ఈస్ట్ పంజాబ్ యూనివర్సిటీ, 1947–50
  • బికనీర్ మహారాజా, 1948లో రాజ్యాంగ సలహాదారు
  • గౌరవ ఎల్.ఎల్.డి. డిగ్రీ., పంజాబ్ విశ్వవిద్యాలయం; 1948
  • పంజాబ్‌లోని ఫ్రూట్ డెవలప్‌మెంట్ బోర్డు సభ్యుడు
  • బెల్గాంపై కమిషన్ (కర్ణాటక - మహారాష్ట్ర మధ్య వివాదం), 1967

మరణం[మార్చు]

మహజన్ 1967, డిసెంబరు 11న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ravi Rohmetra, Mehr Chand Mahajan as PM of J&K, Daily Excelsior, 23 December 2016.
  2. Mahajan, Mehr Chand (1963), Looking Back: The Autobiography of Mehr Chand Mahajan, Former Chief Justice of India, Asia Publishing House, pp 123.
  3. "What soured the promise of Kashmir". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2019-09-18.

బయటి లింకులు[మార్చు]