మోహన్ రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహన్ రాజా
జననం (1974-05-30) 1974 మే 30 (వయసు 50)
విద్యాసంస్థఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, సినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
బంధువులుఎడిటర్ మోహన్ (తండ్రి)
జయం రవి (సోదరుడు)

మోహన్ రాజా (జననం 1974 మే 30) ఒక భారతీయ చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్. ఆయన ప్రధానంగా తమిళం, తెలుగు పరిశ్రమలలో పనిచేస్తున్నాడు.

ఆయన తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్ (2001)తో అరంగేట్రం చేసిన తర్వాత, తన సోదరుడు జయం రవిని కూడా నటుడిగా పరిచయం చేస్తూ 2003లో జయం అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కిచ్చి అనేక విజయవంతమైన తెలుగు చిత్రాలను తమిళంలోకి రీమేక్ చేశాడు. ఎం. కుమారన్ S/O మహాలక్ష్మి (2004), ఉనక్కుమ్ ఎనక్కుమ్ (2006), సంతోష్ సుబ్రమణ్యం (2008) ఇవన్నీ విజయవంతమైన తెలుగు చిత్రాలకు రీమేక్‌లు. ఆయన తన మొదటి ఒరిజినల్ స్క్రిప్ట్, థని ఒరువన్ (2015)తో తిరిగి వచ్చాడు, అది 2015లో అత్యంత లాభదాయకమైన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

పని శైలి

[మార్చు]

తన తండ్రి ఎ. మోహన్ ఫిల్మ్ ఎడిటర్‌గా పని చేయడం చూడటానికి యుక్తవయసులో ఉన్న మోహన్ రాజా క్రమం తప్పకుండా వౌహిని స్టూడియోస్‌కు వెళ్లేవాడు. చిత్రాలపై ఆసక్తితో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ లో చేరి విద్యను పూర్తిచేసాడు.[1] ఆ తరువాత ఆయన మలయాళ చిత్రం తెంకాసిపట్టణం (2000) ని తెలుగులో రీమేక్ హనుమాన్ జంక్షన్ (2001) ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డబ్బింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎదిగాడు.

ఎం. రాజా అధికారికంగా ఆమోదించబడిన తెలుగు చిత్రాల అధికారిక తమిళ రీమేక్ ప్రాజెక్ట్‌లలో మాత్రమే పనిచేశాడు. అతని మొదటి ఆరు దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర రచయితలకు క్రెడిట్ చేయబడ్డాయి. అయినా నిరంతర విమర్శలకు గురయ్యాడు.[2] అప్పుడు తన మొదటి ఒరిజినల్ స్క్రిప్ట్ తయారుచేసుకుని థాని ఒరువన్‌ను రూపొందించాడు.[3] ఆయన తమిళ ప్రేక్షకుల సంస్కృతికి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులను చేయడానికి తన సహాయకుల బృందంతో కలిసి పని చేస్తాడు. సీక్వెన్స్‌లను జోడించడానికి లేదా తీసివేయడానికి ఒరిజినల్ వెర్షన్ నుండి ప్రతి ఒక్క షాట్‌ను నిశితంగా పరిశీలిస్తాడు. ఎం. కుమారన్ S/O మహాలక్ష్మిలో తల్లిగా నదియాను పునరాగమనం చేసే పాత్రలో తీసుకున్నందుకు, చిత్ర కథానాయికగా అసిన్‌ను ఎంపిక చేసినందుకు ఎం. రాజా తన తారాగణం నిర్ణయాలకు ప్రశంసలు అందుకున్నాడు.[4] ఉనక్కుమ్ ఎనక్కుమ్‌లో ప్రభుకు సోదరుడిగా ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం, థని ఒరువన్‌లో అరవింద్ స్వామిని విలన్‌గా నటింపజేయడం.. అతని అన్నీ నిర్ణయాలు విమర్శకుల ప్రశంసలు పాందాయి.[5]

ఎం. రాజా తరచుగా కుటుంబ వినోదభరిత చిత్రాలు చేయడానికి ప్రయత్నించాడు. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశంతో సంసారం అధు మిన్సారం (1986), కాదలుక్కు మరియాదై (1997) వంటి చిత్రాలు రూపొందించారు.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Credited Notes
Director Writer
2001 హనుమాన్ జంక్షన్ Green tickY Red XN తెంకాశీపట్టణం రీమేక్ తెలుగు సినిమా
2003 జయం Green tickY Red XN అదే పేరుతో తెలుగు సినిమాకి రీమేక్
2004 ఎం. కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి Green tickY Red XN అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి రీమేక్

ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం నామినేట్ చేయబడింది

2006 ఉనక్కుమ్ ఎనక్కుమ్ Green tickY Red XN నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్
2008 సంతోష్ సుబ్రమణ్యం Green tickY Red XN బొమ్మరిల్లు రీమేక్

ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం (తృతీయ బహుమతి) ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం నామినేట్ చేయబడింది

2010 తిల్లలంగడి Green tickY Red XN కిక్ రీమేక్
2011 వేలాయుధం Green tickY Green tickY 2000లో విడుదలైన తెలుగు చిత్రం ఆజాద్ ఆధారంగా రూపొందించబడింది
2015 థాని ఒరువన్ Green tickY Green tickY ఉత్తమ దర్శకుడిగా ఎడిసన్ అవార్డు - విజేత

ఉత్తమ దర్శకుడిగా IIFA ఉత్సవం అవార్డు - విజేత ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం - విజేత తెలుగులో ధృవ పేరుతో రీమేక్

2017 వేలైక్కారన్ Green tickY Green tickY
2022 గాడ్ ఫాదర్ Green tickY Red XN లూసిఫర్ రీమేక్ తెలుగు సినిమా

మూలాలు

[మార్చు]
  1. "Raja of remakes – CHEN". The Hindu. 12 October 2007. Retrieved 28 December 2015.
  2. "అంతగా వెక్కిరిస్తారని అనుకోలేదు". web.archive.org. 2022-10-23. Archived from the original on 2022-10-23. Retrieved 2022-10-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Cracking the bro code". The Hindu. 25 July 2015. Retrieved 28 December 2015.
  4. "Raja of remakes – CHEN". The Hindu. 12 October 2007. Retrieved 28 December 2015.
  5. "Thani Oruvan Is Neither Remake Nor 'Freemake': The M Raja Interview". Silverscreen.in. 25 August 2015. Retrieved 28 December 2015.
  6. "Jayam Raja – Behindwoods.com – Tamil Movie Directors Interview – Jayam M. Kumaran Son of Mahalakshmi Something Something Santosh Subramanian". Behindwoods.com. 21 January 2009. Retrieved 28 December 2015.