లంకా దినకర్
ఈ వ్యాసంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్నాయి. దీన్ని మెరుగుపరచడంలో తోడ్పడండి. లేదా ఈ సమస్యల గురించి చర్చ పేజీలో చర్చించండి. (ఈ మూస సందేశాలను తీసెయ్యడం ఎలాగో తెలుసుకోండి)
|
లంకా దినకర్ (1975) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుడు, పత్రికా కాలమిస్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకుడు.[1]
ప్రాథమిక జీవితం, విద్యాభ్యాసం
[మార్చు]లంకా దినకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు లంకా సుభాష్ చంద్రబోస్, సుభాషిణి. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఒంగోలు లోని ఒంగోలు మున్సిపల్ హై స్కూల్ లో, ఇంటర్ ను ఆంధ్రకేసరి విద్యాకేంద్రం లో, సి. ఎస్. ఆర్ కళాశాలలో బికామ్ ను పూర్తి చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి
సి.ఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]లంకా దినకర్ వృత్తిరీత్యా సి. ఏ, కానీ తన కుటుంబ రాజకీయ నేపథ్యం, వ్యక్తిగత ఇష్టంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తండ్రి సుబాష్ చంద్ర బోస్ తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామరావుకు అత్యంత సన్నిహితుడు, ప్రకాశం జిల్లాలో ముఖ్య అనుచరుడు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన తరువాత ఆయన అభిమానులు పార్టీకి అనుబంధంగా స్థాపించిన తెలుగు యువ సేన ప్రకాశం జిల్లా విభాగానికి అధ్యక్షుడిగా జిల్లాలో తెలుగుదేశం పార్టీని విస్తరించడంతో పాటుగా శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశాడు.
తండ్రి ప్రేరణతో 2008 లో తెలుగుదేశం పార్టీలో చేరిన దినకర్, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తరపున ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాడు. పార్టీ అధినేత చంద్రబాబు అతన్ని ఒంగోలు శాసనసభ నియోజకవర్గ బాధ్యుడిగా, పార్టీ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధిగా నియమించాడు. 2009 శాసనసభ ఎన్నికల్లో దినకర్ పార్టీ టిక్కెట్ ఆశించాడు కానీ, అది మాజీ శాసనసభ్యుడు ఈదర హరిబాబుకు దక్కింది.
2012 లో జరిగిన ఒంగోలు శాసనసభ ఉపఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశించినప్పటికీ టిక్కెట్టు లభించలేదు. అప్పుడు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్ధన్ గెలుపుకు కృషి చేసాడు. కానీ జనార్ధన్ ఓటమి చెందాడు. దినకర్ కృషిని గుర్తించిన చంద్రబాబు, రాష్ట్ర పార్టీలో బాధ్యతలు అప్పగించాడు.
తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే 2013- 2014 మధ్య జరిగిన సమైక్యాంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని సమైక్యాంధ్ర రాష్ట్ర ఉద్యమ సమితికి సహ అధ్యక్షుడుగా, అధికార ప్రతినిధిగా సమైక్యాంధ్ర రాష్ట్రం తరుపున వాదనలు వినిపించాడు.
2014 లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో దినకర్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎన్నికల బాధ్యుడిగా నియామితులై ఆ జిల్లాలో పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు. 2015 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జాతీయ అధికార ప్రతినిధిగా పలు టి. వి చర్చ కార్యక్రమాల్లో పార్టీ వాణిని బలంగా వినిపించేవాడు. సుదీర్ఘ కాలం పార్టీ తరపున కష్టపడి పనిచేసినందుకు, 2014 ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ టిక్కెట్టు రాకపోగా, శాసనమండలి సభ్య పదవి కూడా దక్కలేదు. తమ రాజకీయ అవసరాల కోసం సృష్టించిన ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ సంస్థకు వీరిని ఛైర్మనుగా చేయదలచినప్పటికే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన వీరిని ఒంగోలు ప్రాంతానికి పరిమితం చేయడాన్ని అవమానంగా భావించి ఆ పదవిని తిరస్కరించాడు.
2019 లో శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం చవిచూసిన తరువాత కూడా పార్టీ తరపున మాట్లాడుతూ వచ్చాడు. 2020 లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, నివేదిక కమిటీ ప్రముఖ్‌గా కొనసాగుతున్నాడు. అమరావతి రాజధాని, పోలవరంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఆర్థిక, జాతీయ రాజకీయ అంశాల మీద అవగాహన కలిగిన బీజేపీ నేత ఇతను.
దినకర్ కాలమిస్టుగా పలు తెలుగు, జాతీయ ఆంగ్ల దినపత్రికలలో సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల మీద లోతుగా విశ్లేషిస్తూ రాస్తూంటాడు. అలాగే తెలుగు, జాతీయ మీడియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
బోగస్ ఓట్లు
[మార్చు]ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల కారణంగా అభ్యర్థుల విజయావకాశాలు తారుమారు అవడంతో 2011 లో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న దినకర్, బోగస్ ఓట్ల వ్యవహారాన్ని వెలికితీసి భారతదేశ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]దినకర్ అవివివాహితుడు. ఇతనికి ఇద్దర సోదరులు. ఇతని మేనమామ బత్తిన నరసింహారావు ప్రముఖ వ్యాపారవేత్త. బీజేపీలో సీనియర్ నాయకుడు. స్థిర నివాసం ఒంగోలు పట్టణం.
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (19 October 2024). "Lanka Dinakar takes over as 20-Point Programme Chairman". Retrieved 20 October 2024.
- https://www.youtube.com/watch?v=CbaS8D724s0
- https://www.youtube.com/watch?v=LPAlF7Gr0VA
- https://www.youtube.com/watch?v=Xjxcs1IBJYg
- https://www.indiatoday.in/india/story/tdp-spokesperson-lanka-dinakar-joins-bjp-1557070-2019-06-27
- https://www.deccanherald.com/assembly-election-2019/ec-looks-at-allegations-of-59l-bogus-voters-in-ap-721638.html
- https://m.republicworld.com/tags/lanka-dinakar[permanent dead link]
- https://www.republicworld.com/india-news/politics/bjp-leader-alleges-rise-in-atrocities-against-hindus-in-andhra-lashes-out-at-cm-jagan.html
- https://www.republicworld.com/india-news/politics/bjp-leader-lashes-out-at-andhra-govt-says-financial-health-of-state-has-deteriorated.html
- https://www.republicworld.com/india-news/politics/ys-jagans-government-undermines-media-voices-says-lanka-dinakar-bjp.html
- https://www.republicworld.com/amp/india-news/politics/lanka-dinakar-slams-ysrcp-says-party-to-malign-pm-modi-and-amit-shah.html
- https://thedailyguardian.com/author/dinakar-l/
- https://www.youtube.com/watch?v=opirlo-wWYU
- Unreferenced BLPs from సెప్టెంబరు 2021
- All unreferenced BLPs
- Accuracy disputes from సెప్టెంబరు 2021
- All accuracy disputes
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు from సెప్టెంబరు 2021
- Articles needing additional references from సెప్టెంబరు 2021
- Articles with multiple maintenance issues
- All articles with dead external links
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు