Jump to content

వేలాల గట్టు మల్లన్న జాతర

అక్షాంశ రేఖాంశాలు: 18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
వికీపీడియా నుండి

వేలాల గట్టు మల్లన్న జాతర తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో ఈ జాతర జరుగుతుంది.ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రము.కొండమీద వెలసిన మల్లికార్జున స్వామి గట్టు మల్లన్న గా ప్రసిద్ధుడు.ఇచట ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. [1][2].

వేలాల గట్టు మల్లన్న జాతర
శ్రీ వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం వేలాల జైపూర్
శ్రీ వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం వేలాల జైపూర్
వేలాల గట్టు మల్లన్న జాతర is located in Telangana
వేలాల గట్టు మల్లన్న జాతర
వేలాల గట్టు మల్లన్న జాతర
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
పేరు
ఇతర పేర్లు:గట్టు మల్లన్న
శైవ క్షేత్రం
వేలాల క్షేత్రంగా
ప్రధాన పేరు :వేలాల్ మల్లికార్జునస్వామి ఆలయం
దేవనాగరి :वेलाल गट्टु मल्लना
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని
ప్రదేశం:వేలాల(యాలాల)
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:గట్టు మల్లన్న స్వామి (శివుడు)
ప్రధాన దేవత:శివలింగం నంది విగ్రహాలు
ఉత్సవ దైవం:గట్టు మల్లన్న స్వామి
ముఖ్య_ఉత్సవాలు:మహాశివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ దేవాలయాల నిర్మాణ శైలి
దేవాలయాలు మొత్తం సంఖ్య:రెండు

జాతర

[మార్చు]
ఆలయంలో మల్లన్న స్వామికి పూజలు.

ఈ వేలాల గట్టు మల్లన్న జాతర మహా శివరాత్రి పండుగ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో మూడు రోజులు పాటు జాతర డిసెంబర్, జనవరి నెలలో జరుగుతుంది. భక్తులు స్వామి వారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు.శివరాత్రి పర్వదినం నాడు ఈ ప్రాంతంలో అశేష భక్త జనులతో ఆలయం కిటకిటలాడుతోంది. [3][4].

విశేషాలు

[మార్చు]

ఇక్కడ లింగ రూపంలోని శివునికి ఉన్న నీటి చెలిమెలో ఏ కాలంలోనైనా నీరు ఉబుకుతూ ఉంటుంది. ఈ నీటినే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.వేలాల అనే పదం కాలక్రమేణా యాలాలగా పరిణమించింది.

భక్తుల తాకిడి

[మార్చు]

ఈ వేలాల గట్టు మల్లికార్జునస్వామి దర్శించుకోవడానికి భక్తులు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, నిజామాబాద్, తో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదావరిలో స్నానమాచరించి మల్లన్న స్వామి మొక్కలు చేర్పించి జాతరలో పాల్గొంటారు[5].

మూలాలు

[మార్చు]
  1. Rao, Rama (2022-02-24). "Mancherial: మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర". www.hmtvlive.com. Retrieved 2024-11-01.
  2. Today, Telangana (2021-03-07). "Arrangements made for Velala Jatara of Mancherial". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-11-01.
  3. Rao, Rama (2022-02-24). "Mancherial: మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర". www.hmtvlive.com. Retrieved 2024-11-01.
  4. Rao, Rama (2022-02-24). "Mancherial: మంచిర్యాల జిల్లాలో ఘనంగా గట్టుమల్లన్న స్వామి జాతర". www.hmtvlive.com. Retrieved 2024-11-01.
  5. Bharat, E. T. V. (2020-02-21). "వేలాల జాతరకు పోటెత్తిన భక్తులు". ETV Bharat News. Retrieved 2024-11-01.