పెంచల కోన
పెంచల కోన
శ్రీ పెనుశిల నరసింహస్వామి దేవస్థానం, పెంచలకోన | |
---|---|
Coordinates: 14°20′20″N 79°24′45″E / 14.338904°N 79.412613°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు జిల్లా |
Named for | దేవాలయం |
Government | |
• Type | ఎండోమెంట్స్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
• Body | శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ, పెంచలకోన |
Elevation | 914.4 మీ (3,000.0 అ.) |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | AP |
సమీప నగరం | నెల్లూరు |
సమీప విమానాశ్రయం | తిరుపతి |
Website | http://www.penchalakona.co.in/ |
పెంచలకోన ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, రాపూరు మండలం లోని రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విభేదాలు లేకుండా వారిపాపాల నుండి విముక్తికావటానికి స్వామివారిని దర్శిస్తారు. ఈ పుణ్యక్షేత్రం శ్రీ పెనుశిల లక్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం నెల్లూరుజిల్లాలో, నెల్లూరుకు 70 కిమీ దూరంలో భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని అతనిని పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకథనం. పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవి లోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చేందుతూ ఉంది.
బ్రహ్మోత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం ఇక్కడ మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. [1]తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని ప్రతీతి. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు, నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి. కాని అంత అనువుగా ఉండవు. కాకపొతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడతారు.
ప్రయాణ మార్గాలు
[మార్చు]పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమీటర్లు దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసి వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40 కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.
గూడూరు రైల్వే జంక్షన్ నుండి 70 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుండి రోడ్దు మార్గాన రాపూరుకు చేరుకోని కోనకు వెళ్లవచ్చు. కడపజిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చేరుకోని ఇక్కడకి రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమీటర్ల దూరం ఉంది.
విజయేశ్వరీదేవి ఆశ్రమం
[మార్చు]పెంచలకోనలో "విజయేశ్వరీదేవి ఆశ్రమం" అనే ఆశ్రమం ఉంది. దాని నిర్వాహకురాలు విజయేశ్వరీదేవి ఆమె ఇక్కడ 30 సవత్సరాల పైబడి నుండి తపస్సు చేస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]- Boswls' Nellore District Manuel, 1873. 2.విక్రమ సింహపురి మండల సర్వస్వం, సంపాదకులు: శ్రీనేలనూతుల శ్రీకృష్ణమూర్తి, నెల్లూరు జిల్లాపరిషద్ ప్రచురణ, నెల్లూరు,1964.
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పుణ్యక్షేత్రాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దర్శనీయ స్థలాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు
- శ్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రాలు