శ్రీ సింహా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ‌ సింహా కోడూరి
జననం23 ఫిబ్రవరి 1996
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం
తల్లిదండ్రులుఎం. ఎం. కీరవాణి (తండ్రి)
ఎం. ఎం.శ్రీ వల్లి (తల్లి)
బంధువులుకాల భైరవ (అన్నయ్య)
ఎస్. ఎస్. రాజమౌళి (బాబాయ్)
కల్యాణి మాలిక్ (బాబాయ్)

శ్రీ‌ సింహా కోడూరి తెలుగు సినిమా నటుడు. ఆయన 2007లో యమదొంగ చిత్రంలో బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. శ్రీ సింహ 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమా ద్వారా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

జననం

[మార్చు]

శ్రీ‌ సింహా కోడూరి 1996, ఫిబ్రవరి 23న హైదరాబాదులో జన్మించాడు. ఆయన తండ్రి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు, తల్లి శ్రీవల్లి. సింహకు సినీ గాయకుడు కాల భైరవ సోదరుడు.

సినీ ప్రస్థానం

[మార్చు]

శ్రీ సింహ 2007లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, జూ. ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రం ద్వారా బాలనటుడిగా సినీరంగంలోకి వచ్చాడు. సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో బాలనటుడిగా నటించాడు. 2012లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వహించిన ఈగ సినిమాలో సమంత మిత్రుడిగా నటించాడు. 2018లో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం (సినిమా) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణ సారథ్యంలో 2019లో రితేష్ రానా దర్శకత్వం వహించిన మత్తు వదలరా చిత్రం ద్వారా క‌థానాయ‌కుడిగా పరిచయమయ్యాడు. 2021, మార్చి 27న మణికాంత్‌ దర్శకత్వం వహించిన శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రం విడులైంది.[1][2][3][4][5]

సింహ మూడవ చిత్రం డి. సురేష్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌బెన్‌ సినిమాస్‌ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, యష్‌ రంగినేని నిర్మాతలుగా ప్రణీత్‌ బ్రమాండపల్లి దర్శకత్వం వహించే ‘క్రైమ్‌ కామెడీ జోనర్‌' చిత్రం ‘భాగ్ సాలే’లో నటిస్తున్నాడు.[6]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర వివరాలు
2007 యమదొంగ రాజా బాల నటుడు [7]
2010 మర్యాద రామన్న ఓబులేశు బాల నటుడు
2012 ఈగ సమంత మిత్రుడిగా తెలుగు & తమిళ్
2019 మత్తు వదలరా బాబు మోహన్ క‌థానాయ‌కుడు
2021 తెల్లవారితే గురువారం వీరేంద్ర క‌థానాయ‌కుడు, 2019 సైమా అవార్డు - ఉత్తమ డెబ్యూ హీరో [8]
2021 దొంగలున్నారు జాగ్రత్త క‌థానాయ‌కుడు [9]
2023 భాగ్ సాలే అర్జున్ క‌థానాయ‌కుడు
2023 ఉస్తాద్ సూర్య క‌థానాయ‌కుడు[10]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sri Simha Koduri's first-look from Thellavarithe Guruvaram sees him dressed as a groom". The Times of India. 15 January 2021. Retrieved 8 April 2021.
  2. "Sri Simha Koduri's 'Thellavarithe Guruvaram': First Look drops!". m.ragalahari.com. 15 January 2021. Retrieved 8 April 2021.
  3. "Thellavarithe Guruvaram Look: Simha In Groom Getup". www.greatandhra.com. 14 January 2021.
  4. "Thellavarithe Guruvaram First Look: Sad Sri Simha in groom get-up". www.tollywood.net. 15 January 2021. Retrieved 8 April 2021.
  5. "తెల్లవారితే గురువారం ఫస్ట్ లుక్ వచ్చింది". NTV Telugu. 14 January 2021. Archived from the original on 9 ఫిబ్రవరి 2021. Retrieved 8 April 2021.
  6. నమస్తే తెలంగాణ (23 February 2021). "క్రైమ్‌ కామెడీ 'భాగ్‌సాలే'". Namasthe Telangana. Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
  7. 10TV (13 April 2021). "యమదొంగ లో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసింది ఈ హీరోనే | Sri Simha". 10TV (in telugu). Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. TV9 Telugu (19 September 2021). "SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట." Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Andrajyothy (9 July 2021). "సురేశ్ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం". www.andhrajyothy.com. Archived from the original on 9 జూలై 2021. Retrieved 9 July 2021.
  10. "ఉస్తాద్‌.. శ్రీసింహా నటించిన కొత్త మూవీ మెప్పించిందా". ఈనాడు. 12 ఆగస్టు 2023. Retrieved 12 ఆగస్టు 2023.