సి.హెచ్. మల్లారెడ్డి
సి.హెచ్. మల్లారెడ్డి | |||
| |||
పార్లమెంట్ సభ్యడు
| |||
పదవీ కాలం 16 మే 2014 – 11 డిసెంబరు 2018 | |||
ముందు | సర్వే సత్యనారాయణ | ||
---|---|---|---|
తరువాత | రేవంత్ రెడ్డి | ||
నియోజకవర్గం | మల్కాజ్‌గిరి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 డిసెంబరు 2018 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | 1953 సెప్టెంబరు 9||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | కల్పనా రెడ్డి | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కూతురు | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు విద్యావేత్త సామాజిక వేత్త |
సి.హెచ్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి[1] పార్టీ తరపున మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019 ఫిబ్రవరి 19న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2] 2014లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు.
జననం
[మార్చు]మల్లారెడ్డి 1953, సెప్టెంబరు 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోయిన్‌పల్లిలో జన్మించాడు.[3] వెస్లీ కో-ఎడ్యుకేషన్ హైస్కూల్‌లో పాఠశాల విద్య, మహబూబియా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]మల్లారెడ్డికి కల్పనారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (మమతారెడ్డి), ఇద్దరు కుమారులు (మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి) ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]2014, మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లారెడ్డికి 2014, ఏప్రిల్ 9న మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. 2014, మే 16న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నాడు.[5][6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Malkajgiri". Election Commission of India. Archived from the original on 2 June 2014.
- ↑ 2.0 2.1 ఇండియన్ ఎక్స్ ప్రెస్. "TDP's lone Telangana MP, Malla Reddy, joins TRS". Retrieved 14 February 2017.
- ↑ "Ch. Malla Reddy". india.gov.in. Retrieved 12 February 2017.
- ↑ వెబ్ ఆర్కైవ్. "ELECTION COMMISSION OF INDIA". web.archive.org. Archived from the original on 2 జూన్ 2014. Retrieved 14 February 2017.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ Eenadu (16 November 2023). "మళ్లీ మంత్రిస్తారా?". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.