సింగినాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సింగినాదం లేదా సింహనాదం ఒక సుషిర వాద్యం. బాకా లాగ పెద్ద ధ్వనులు చేయటానికి ఉపయోగపడే వాయుద్యము. ఇది సన్నాయిని పోలి ఉండి మొదలు సన్నగానూ, చివర వెడల్పుగానూ ఉంటుంది. ఈ వాద్యం ద్వారా అనేక ధ్వనులను వాయిస్తారు.

పూర్వం మహమ్మదీయ వర్తకులు ఆంధ్రా ప్రాంతానికి వచ్చినప్పుడు తమ రాకను తెలుపుతూ పెద్ద పెద్ద బర్రె కొమ్ములతో ఉదేవారట. పెద్ద పెద్ద ధ్వనులు రావటం వలన వీటిని సింహనాదాలుగా వ్యవహరించి ఉండవచ్చు. అదే వ్యవహారంలో సింగినాదంగా రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు. మధ్యయుగాలలో రామానుజ మతస్థులు తమ వైష్ణవ గురువులను రాకను సూచించేందుకు ఈ వాద్యాన్ని ఉపయోగించేవారట.[1]

సింగినాదం జీలకర్ర[మార్చు]

శృంగం అంటే కొమ్ము అని అర్థం. పూర్వం కొమ్ములతో బాకాలు (mouth horns) తయారు చేసి ఊదే వారు. ఎవరైనా ఆ ఊదుడు లాగ వితండ వాదం చేస్తే "సింగినాదం చెయ్యకు" అని తిట్టే వారు. రేవు దగ్గరకి పడవలు వచ్చినప్పుడు కూడా అవి వచ్చాయని సూచించడానికి శృంగాలు ఊదేవారు. ఆ పడవలలో సాధారంగా జీలకర్ర,, బెల్లం లాంటివి ఉంటాయి తప్ప పెద్ద సరుకేమీ ఉండదు. ఎవడైనా చిన్న విషయాల కోసం సింగినాదం చేస్తే ఇది సింగినాదం జీలకర్ర గోల లాగ ఉంది అని అంటారు.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర విజ్ఞానము - కందుకూరి బాల సూర్యప్రసాద భూపాలుడు ఏడవ భాగం పేజీ.3419

వెలుపలి లంకెలు[మార్చు]