స్నేహ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
స్నేహ | |
సినీనటి స్నేహ చిత్రపటం. | |
జన్మ నామం | సుహాసిని రాజారాం |
జననం | ముంబై, భారతదేశం | 1981 అక్టోబరు 12
క్రియాశీలక సంవత్సరాలు | 2001 - ప్రస్తుతం |
భార్య/భర్త | ప్రసన్న |
పిల్లలు | 2 |
వెబ్‌సైటు | http://www.paadal.com/actor/sneha స్నేహ |
ప్రముఖ పాత్రలు | పార్తిబన్ కనవులో సత్య/జనని ఆటోగ్రాఫ్ లో దివ్య |
స్నేహగా పేరొందిన సుహాసిని తెలుగు సినిమా నటి. ఈమె నటించిన సినిమాలలో సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు కొన్ని సినిమాలు. అయితే, ఆమె నటించిన మొదటి సినిమా మలయాళంలో వచ్చిన ఎంగనే ఒరు నీల పక్షి.
జీవిత విశేషాలు
[మార్చు]స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి, గోవింద్. ఈమె జననం ముంబైలో జరిగింది. తరువాత ఆమె కుటుంబం దుబాయికి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి(2000) అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.
అచ్చాముందు! అచ్చాముందు! లో స్నేహ ప్రసన్నతో మొదటిసారి జత కట్టారు. అప్పటి నుండి, వారి సంబంధంపై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోలలో ప్రసన్న కనిపించే వాడు, ఇద్దరూ కలిసి సినిమా ప్రివ్యూల్లో కూడా కనిపించారు. కొద్దీ కాలం పాటు ఈ పుకార్లను కొట్టివేసిన ప్రసన్న, స్నేహ 2011 నవంబరు 9న వారి భందాన్ని ప్రకటించారు. చివరకు వారు 2012 మే 11న చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.[1][2][3][4]
సినీ విశేషాలు
[మార్చు]తరువాత ఈమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా ప్రశాంత్ కథానాయకుడిగా విరుంబిగిరెన్ (2001) అనే సినిమాలో నటించింది. దాని తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాలలో అందరు అగ్ర కథానాయకులతో అనేక పాత్రలలో నటించింది.
స్నేహ నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- తొలివలపు
- ప్రియమైన నీకు
- హనుమాన్ జంక్షన్
- శ్రీరామదాసు
- మహారధి
- మధుమాసం
- సంక్రాంతి
- నీ సుఖమే నే కోరుకున్నా
- దటీజ్ పాండు (2005)
- వెంకీ
- ఏవండోయ్ శ్రీవారు
- రాధాగోపాళం
- మనసు పలికే మౌనరాగం
- ఆదివిష్ణు (2008)
- పాండురంగడు
- s/o సత్యమూర్తి
- వినయ విధయ రామ
మూలాలు
[మార్చు]- ↑ "ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. స్టార్ హీరోయిన్! ఎవరో గుర్తుపట్టగలరా?, actress-sneha-childhood-pic-viral". web.archive.org. 2024-01-01. Archived from the original on 2024-01-01. Retrieved 2024-01-01.
{{cite web}}
: zero width space character in|title=
at position 32 (help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sneha and Prasanna First Film together after Marriage". kollywoodtoday.net. 14 August 2013. Archived from the original on 18 January 2015. Retrieved 29 March 2011.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ subramanian, anupama (12 August 2015). "Baby boy for Sneha, Prasanna". Deccan Chronicle.
- ↑ "Sneha reveals her baby girl's pictures for the first time". The Times of India.