హిందుస్తానీ సంగీత గాయకులు - ఘరానాలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
హిందుస్థానీ సంగీత గాయకులు - ఘరానాలు : హిందుస్తానీ సంగీతంలో ఘరానాలు ఉంటాయి. ఒక్కొక్క ఘరానా ఒక్కొక్క శాస్త్రీయ గాన శైలి, పోకడలను కలిగి ఉంటుంది.
గ్వాలియర్ ఘరానా
[మార్చు]ఇది అన్నిటిలోకెల్లా పురాతనమైంది.ఇందులోని సుప్రసిద్ధ గాయకులు
- విష్ణు దిగంబర్ పలుస్కర్, (1872 - 1931)
- బాలకృష్ణ బల్ చల్ కరంజీకర్, (1849 - 1927)
- పండిట్ ఓంకార్ నాథ్ ఠాకూర్, (1897 - 1967)
- వీణా సహస్ర బుద్దే
- మాలినీ రాజూర్కర్
- ఆర్తి నాయక్
కిరాణా ఘరానా
[మార్చు]కురుక్షేత్ర్ లోని కిరాణా, కరీంఖాన్ స్వస్థలం. ఇందులోని ప్రసిద్ధ గాయకులు: అబ్దుల్ కరీంఖాన్, (1872 - 1937) హీరాబాయి బరోడేకర్, బేగం అఖ్తర్, భీమ్సేన్ జోషి, గంగూబాయి హంగల్, ప్రభా ఆత్రే లు.
అత్రౌలి - జయపూర్ ఘరానా
[మార్చు]ఇందులో అల్లాదియా ఖాన్ (1855 - 1943), మల్లికార్జున్ మన్సూర్, కేసర్ బాయి కేర్కర్, కిషోరీ అమోంకర్, శ్రుతి సడోలికర్, పద్మా తల్వార్కర్, మోగుబాయి కుర్దికర్, అశ్విని భిడె దేశ్ పాండేలు ప్రముఖులు.
ఆగ్రా ఘరానా
[మార్చు]ఇందులో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ (1886 - 1950), సి.ఆర్.వ్యాస్, ఎస్.ఎన్.రతన్ జన్కర్,, జితేంద్ర అభిషేకిలు ప్రసిద్దులు.
పటియాలా ఘరానా
[మార్చు]అలీ బక్ష్ (1850 - 1920), ఫతే అలీ ఖాన్ (1850 - 1909) ఈ ఘరానాకు ఆద్యులు. ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ (1901 - 1969). చాలా గొప్పగా పాడే పండిట్ అజయ్ చక్రవర్తి, పర్వీన్ సుల్తానాలు ఈ ఘరానాకు చెందిన వారే.
రాంపూర్ - సహస్వాన్ ఘరానా
[మార్చు]దీనిని స్థాపించినవాడు ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్ (1849 - 1919).
మేవాతి ఘరానా
[మార్చు]దీనికి మూలపురుషుడు ఘగ్గె నాజిర్ ఖాన్.ఇందులో ఎక్కువగా విష్ణుతత్వ భజనలను ఆలపిస్తారు. ఇందులోని సుప్రసిద్ధ గాయకులు పండిట్ జస్రాజ్, అతని శిష్యులు సంజీవ్ అభయంకర్, రత్తన్ శర్మ లు.
భూండీ బజార్ ఘరానా
[మార్చు]ఇందులోని ముఖ్య గాయకులు ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్, అంజనీబాయి మాల్పేకర్ లు.