ఏ కే ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్దుల్‌ ఖయూం ఖాన్‌. అందరూ ఆయన్ని ఆత్మీయంగా ఎ.కే.ఖాన్‌ అని ఖాన్‌సాబ్‌ అని సంబోధిస్తుంటారు. అనంతపురం జిల్లా పెనుకొండ అయినప్పటికీ, హైదరాబాద్‌తో ఆయన బంధం మూడు దశాబ్దాల నాటిది.

A K Khan
అబ్దుల్ ఖయ్యూం ఖాన్
ఎ.కె.ఖాన్
జననం(1956-12-06)1956 డిసెంబరు 6
జాతీయతభారతీయుడు
విద్యఎమ్మెస్సీ (గోల్డ్‌మెడల్‌), పిహెచ్‌.డి.
వృత్తి`
పిల్లలుఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.
తల్లిదండ్రులుఅఫ్సర్‌ జానీ, కీ.శే. శ్రీ అబ్దుల్ ఖరీం ఖాన్
పురస్కారాలుఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (1998), ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ (2007)

తల్లిదండ్రులు[మార్చు]

తల్లి అఫ్సర్‌ జానీ, కీ. శే. శ్రీ అబ్దుల్‌ కరీం ఖాన్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌) అధికారిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు.

బాల్యం[మార్చు]

 India ఇండియాలో 06 డిసెంబర్ 1956లో జన్మించారు. అనంతపురం జిల్లా పెనుకొండ, హిందూపూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిండు.

విద్యార్హతలు[మార్చు]

ఎమ్మెస్సీ (గోల్డ్‌మెడల్‌), పిహెచ్‌.డి తొలినాళ్ళలో : ప్రొ ఆఫీసర్‌ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (1978) ఇండియన్‌ రైల్వేస్‌ ట్రాఫిక్‌ సర్వీస్‌ (1979-81) ఐపీఎస్‌ లోకి : 1981 లో 22 సం|| ల వయస్సులోనే మొదటి ర్యాంకు కొట్టి ట్రేనింగులో జయినయ్యారు. 25 సం|| కే విజయవాడలో పోలిస్ అధికారి పదవిలో చేరారు.

కుటుంబం[మార్చు]

ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.

వివిధ హోదాల్లో[మార్చు]

ఐపిఎస్‌కు ఎంపికైన ఖాన్‌ విజయవాడ, కరీంనగర్‌, చిత్తూరు, భువనగిరి, ఆదిలాబాద్‌, గుంటూరు, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో వివిధ హోదాలో పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్‌ నగరంలో అదనపు కమిషనర్‌ (శాంతి భద్రతలు), అదనపు కమిషనర్‌ ట్రాఫిక్‌, డిజీ-ఫైర్‌సర్వీసెస్‌, అదనపు డీజీగా (శాంతి భద్రతలు) ఇలా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.

ఇతర అభిరుచులు, పదవులు[మార్చు]

లిటరరీ అండ్‌ కల్చరల్‌ ఆక్టివిటీస్‌, టెన్సిస్‌, క్రికెట్‌, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎ.పి. ఫుట్‌బాల్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌, హైదరాబాద్‌ హాకీ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌.

స్నేహశీలి[మార్చు]

ఎదుటివారిని ఎప్పుడూ నవ్వుతూ పలకరించే ఐపీఎస్‌ అధికారుల్లో మొదటి శ్రేణికి చెందిన వారు .

ప్రస్తుత పదవి[మార్చు]

ఏ కే ఖాన్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (మైనారిటీ వెల్ఫేర్) పని చేస్తున్నాడు.[1]

సాహిత్యం పట్ల మక్కువ[మార్చు]

పోలీసు మాసపత్రిక �సురక్ష�కు సంపాదకుడిగా కూడా పనిచేస్తున్నారు. పోలీసు సంబంధాలు - ఇతివృత్తాలపై ఆయన చాలా రచనలు చేశారు. ప్రసుతం పోలీసులకు ఎదురవుతున్న సమస్యలు సందేహాల పై ఖాన్‌ ఒక పుస్తకం రాసి వెలువరిం చే ప్రయత్నంలో ఉన్నారు. భిన్న సంస్కృతుల కూడలైన భాగ్యనగర్‌లో మన దేశపు ఉమ్మడి సంస్కృతిని కాపాడడంలో ఆయన విలక్షణమైన వ్యవ హారశైలి అవలంబిస్తున్నారు. ఆయన హిందువులు- ముస్లింలు అనే తేడా లేకుండా ఎవరి తోనైనా మాట్లాడి మెప్పించగలరు. వేదాలను ఖాన్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

కార్యదక్షత[మార్చు]

ఏ సీనియర్‌ పోలీసు అధికారి పద వి చేపట్టినా ఆయనకు ముందుండి మార్గదర్శ కుడి పాత్ర పోషించిన ఘనత ఒక్క ఖాన్‌కే దక్కు తుంది. ఇటీవల హైదరాబాద్‌లో చెలరేగిన అల్లర్ల సమయంలో ఏకబిగిన 27 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించి అల్లర్లంటేనే అసాంఘిక, విధ్వంసకర శక్తుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తేలా చర్యలు తీసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా టెన్ని స్‌ క్రీడ ఆయన రోజువారి జీవితంలో అంతర్భా గంగా మారిపోయింది ఇటీవల వరుసపెట్టి ఆందోళనలు మరోవైపు శాంతి భద్రతల సమస్యలు-ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఖాన్‌ ఎంతో సంయమనంతో వాటిని చక్కబెట్టారు.

వృత్తి పట్ల[మార్చు]

2014లో రంజాన్‌- వినాయక చవితి ఒకేరోజు రావడం చాలా అరుదైన సంఘ టన. ఉభయ మతాల వారూ నివసించే నగరంలో రెండు పర్వదినాలు ఒకే రోజు వచ్చినా చిన్న పాటి సంఘటన కూడా చోటు చేసుకోకపోవడం జంట పండుగల పర్వదినం అనూహ్యమైన రీతిలో శాంతి‚యుతంగా జరగడం వెనుక ఖాన్‌ కృషి సుస్పష్టం. వృత్తి పట్ల అకుంఠిత అంకిత భావానికి మారు పేరు ఎ.కే. ఖాన్‌ అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. కర్తవ్యపాలన, కార్యదీక్షలు ఉఛ్చ్వాస నిశ్వాసలుగా తన విధులు నిర్వహించే ఖాన్‌ నేటి తరానికి స్ఫూర్తిదాత.

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (30 December 2021). "ప్రభుత్వ సలహాదారుగా ఏకే ఖాన్ పదవీ కాలం పొడిగింపు". andhrajyothy. Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఏ_కే_ఖాన్&oldid=3797409" నుండి వెలికితీశారు