కట్టమూరు (పెద్దాపురం మండలం)
| ?కట్టమూరు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 35 మీ (115 అడుగులు) |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి జిల్లా |
| జనాభా | 9 (2001) |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను |
• 533437 • ++91 8852 |
కట్టమూరు, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము మండల కేంద్రం పెద్దాపురమునకు 4 కిలోమీటర్ల దూరములో వుంది. ఈ వూరికి దగ్గరగా జే.తిమ్మాపురం, కాండ్రకోట, సిరివాడ గ్రామములు కలవు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
కట్టమూరు గ్రామము చాలా పురాతనమైన, పేరెన్నికగన్న గ్రామము. ఈ గ్రామము గురించి కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన "రాజశేఖర చరిత్ర" లో కూడా ప్రస్తావించబడింది.
ఈ గ్రామమునకు కట్టమూరు అను పేరు 'కట్నం ఊరు ' అనే పదం నుంచి వచ్చింది. దీనికి కారణము అప్పటి వత్సవాయ వంశమునకు చెందిన "పద్మాపురము" (ఇప్పుడు పెద్దాపురముగా పిలవబడుఛున్నది) సంస్థానాదీసుడు ఈ ఊరిని పట్టాభిరాములవారికి కట్నము గా సమర్పించినారు.
[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు
కట్టమూరు గ్రామ ప్రజలు చాలా వరకు వ్యవసాయం మీద అధారపడి జీవించుచున్నారు. వరి, చెఱకు ముఖ్యమైన పంటలు. ఇక్కడి మెట్ట ప్రాంతంలో కర్ర పెండలము దుంప పండించెదరు.
కట్టమూరు గ్రామమునకు ముఖ్యమైన జల వనరు ఏలేరు కాలువ. ఈ కాలువ ఏలేశ్వరం దగ్గిర మొదలై, ఈ గ్రామము మీదుగా వెళుతూ చివరకు కాకినాడ దగ్గిర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకా ఇక్కడ మంచి నీటి చెఱువు, రాయన చెఱువు, బాపనవీధి చెఱువు, కిత్తా చెఱువులు,గంగరావి చెఱువులు కూడా వున్నాయి. ఈ చెఱువుల నీటిని పశువుల త్రాగునీటి కొరకు మరియు పంటపొలాల కొరకు ఉపయోగించెదరు.
[మార్చు] సౌకర్యాలు
కట్టమూరు గ్రామము లో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మూదు మండల ప్రజా పరిషత్ పాఠశాలలు గలవు.
[మార్చు] ప్రార్ధనా స్థలాలు
ఇక్కడ ప్రఖ్యాతమైన పట్టాభిరాములవారి గుడి మరియు కేశవ స్వాములవారి గుడి కలదు. ఈ రెండు గుడులు ఒకే ఆవరణలో ఉండటం వల్ల అక్కడ ప్రజలు ఈ గుడిని "జోడుగుళ్ళు" అని పిలిచెదరు. ఒక గుడిలో పట్టాభిరామ స్వామి వారు సీతాదేవి, లక్షణుడు, ఆంజనేయ స్వామి తో కొలువుతీరి ఉందురు. మరియొక గుడిలో కేశవ స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉందురు. ఇక్కడ ప్రతీ యేటా ఫిబ్రవరిలో వచ్చే భీష్మ ఏకాదశి నాడు జాతర జరుపుదురు.
ఇంకా ఈ ఊరిలొ శివాలయము, వినాయకుని గుడి, షిరిడి సాయిబాబావారి దేవాలయము, వీరబ్రహ్మం గారి ఆలయము, ఊరి మొదట్లో కనకదుర్గ గుడి, ఊరి చివరన పోలేరమ్మ తల్లి ఆలయము, ఇంకా శ్రీరాముని కోవెలలు, ఆంజనేయుని గుడులు కలవు.
[మార్చు] విశేషాలు
ఈ గ్రామము నుంచి కొద్ది మంది చదువులకు, ఉద్యోగములకు విదేశములకు వెళ్ళియుండిరి.
[మార్చు] జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారము:
| మొత్తము | |
|---|---|
| గృహములు : | 2350 |
| మొత్తము జనాభా: | 9054 |
| పురుషులు: | 4587 |
| స్త్రీలు: | 4467 |
| 6 సం. లోపు పిల్లలు : | 1236 |
| 6 సం. లోపు మగపిల్లలు : | 0657 |
| 6 సం. లోపు ఆడ పిల్లలు: | 0579 |
| మొత్తము అక్షరాష్యులు: | 4372 |
| మొత్తము నిరక్షరష్యులు : | 4782 |
[మార్చు] మూలాలు
కట్టమూరుగ్రామ పిన్ కోడ్ వివరాలు
కట్టమూరుగ్రామ 2001 జనాభా లెక్కల వివరాలు
|
|
|
|---|---|
| అనూరు · ఉలిమేశ్వరం · కట్టమూరు · కాండ్రకోట · గుడివాడ · గోరింట · చదలాడ · చంద్రమాంపల్లి · చినబ్రహ్మదేవం · జీ.రాగంపేట · జే.తిమ్మాపురం · తాటిపర్తి · తిరుపతి · దివిలి · పులిమేరు · మర్లావ · వాలుతిమ్మాపురం · రాయభూపాలపట్నం · వడ్లమూరు · సిరివాడ · కొండపల్లె · తూరుపు పాకలు · ఆర్.బి.కొత్తూరు · |