కోలాచలం శ్రీనివాసరావు

వికీపీడియా నుండి

కోలాచలం శ్రీనివాసరావు (1954 - 1919) సుప్రసిద్ధ నాటక రచయిత. ఆంధ్ర నాటక చరిత్రలో బళ్ళారి రాఘవ కొక ప్రముఖ స్థానం ఉన్నది. అప్పటి నాటక రచయితలలో కోలాచలం, ధర్మవరం కృష్ణమాచార్యులు ప్రముఖులు. వీరు మార్చి 13, 1854 సంవత్సరంలో జన్మించారు. వీరు వృత్తిరీత్యా న్యాయవాది అయినా నాటక కళ అంటే అత్యంత అభిమానం.

వీరు భారతదేశంలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాల నాటకాల చరిత్రలను పరిశోధించి ప్రపంచ నాటక చరిత్ర (The Dramatic History of the World) అనే గ్రంధాన్ని ఆంగ్ల భాషలో రాశారు. తెలుగులో వీరు 'సనందినీ పరిణయము', సుఖమంజరీ పరిణయము మొదలైన నాటకాలు రాశారు. తెలుగులో మొదటి చారిత్రక నాటకం రాసింది కూడా వీరే. రామరాజు, విజయనగర సామ్రాజ్య పతనము, చాందు బీబీ, ప్రతాక్బరీయము మొదలైనవి వీరి రచనలు.

వీరు గొప్ప విద్వాంసులు. కడపలో ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు అధ్యక్షత వహించారు. భగవద్గీత 18 అధ్యాయాలు సవిమర్శగా పఠించి ప్రతి అధ్యాయాన్ని వచనంగా ప్రకటించారు.

వీరు 23 జూన్, 1919 సంవత్సరంలో పరమపదించారు.