జి.కిషన్ రెడ్డి

వికీపీడియా నుండి
జి.కిషన్ రెడ్డి
Kishan reddy.jpg
జి.కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు
Constituency అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం
Personal details
Born మే 15 1964 (1964-05-15) (వయసు 49)
తిమ్మాపురం, రంగారెడ్డి జిల్లా
Political party భారతీయ జనతా పార్టీ
Spouse(s) కావ్య
Children వైష్ణవి, తన్మయ్
Residence హైదరాబాదు
Religion హిందూ మతము
Website www.kishanreddy.com

జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భాజపా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికై [2]వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జనవరి 19, 2012న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగే భాజపా పోరుయాత్ర ప్రారంభించాడు.

విషయ సూచిక

వ్యక్తిగత జీవితం [మార్చు]

1964, మే 15న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలొ కిషన్ రెడ్డి జన్మించాడు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్).[3]

రాజకీయ జీవితం [మార్చు]

1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భాజపా తరఫున తన సేవలు అందిస్తున్నాడు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టాడు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందినాడు. 2001లో భాజపా రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతూయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందినాడు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో [4]గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. శాసనసభలో భాజపా పక్షనాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు స్వీకరించాడు.[5]

భాజపా పోరుయాత్ర [మార్చు]

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భాజపా తరఫున ఎం.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భాజపా పోరుయాత్ర ప్రారంభించాడు.[6] ఈ యాత్ర 22 రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతుంది[7] పోరుయాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరి హాజరయ్యాడు.

బయటి లింకులు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 07-03-2010
  2. సూర్య దినపత్రిక, తేది 17-05-2009
  3. http://www.kishanreddy.com/biodata.html
  4. సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
  5. http://www.hindu.com/2010/03/06/stories/2010030664060600.htm
  6. ఈనాడు దినపత్రిక, తేది 20-01-2010
  7. సాక్షి దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 20-01-2012