తెల్ల మద్ది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తెల్ల మద్ది
Fruit at Kolkata, India
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: మిర్టేలిస్
కుటుంబం: Combretaceae
జాతి: టెర్మినేలియా
ప్రజాతి: టె. అర్జున
ద్వినామీకరణం
టెర్మినేలియా అర్జున
Flowers with Sykes's warbler at Kolkata, West Bengal, India

తెల్ల మద్ది (లాటిన్ Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.

లక్షణాలు[మార్చు]

 • అర్జున 60 నుండి 80 అడుగుల ఎత్తుగా పెరిగే వృక్షం. దీని బెరడు తెల్లగా ఉంటుంది. కావున దీనిని తెల్లమద్ది అంటారు.
 • బెరడును కోస్తే తెల్లని స్రావం వస్తుంది.
 • ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడును గుండె జబ్బుల్లో వాడతారు.
 • నునుపైన బూడిద రంగు బెరడుగల పెద్ద ఆకురాలు వృక్షం.
 • దీర్ఘచతురస్రాకారంగా గాని, విపరీత అండాకారం నుండి, భల్లాకారంలో గాని గురుఅగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
 • శాఖాయుతమైన కంకులలో అమరిక లేత పసుపురంగు పుష్పాలు.
 • పంచకోణయుతమైన ధృఢమైన టెంక గల ఫలాలు.
 • అర్జున భారత దేశంలో చాలా చోట్ల పెరుగుతుంది. హిమాలయా ప్రాంతాలు, దక్కను పీఠభూమి లో దీనిని విరివిగా చూడొచ్చు.

దీనిలో ఉండే పదార్థాలు[మార్చు]

అర్జున బెరడులో కాల్షియం , అధికంగా ఉంటుంది. అల్యూమినియం , మెగ్నీషియం కూడా ఉంటాయి.

దీనిలో గల ఎక్టివ్స్[మార్చు]

అర్జునిన్, లాక్టోజ్ , అర్జునెంటిన్

వైద్యంలో ఉపయోగాలు[మార్చు]

దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.[1]. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.[2].

వైద్య విధానాలు[మార్చు]

 • దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుంది.
 • అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి ఉపశమనంగా ఉంటుంది.
 • అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
 • అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
 • నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జున లో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
 • ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
 • అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
 • అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.

ఆయుర్వేద ఔషధాలు[మార్చు]

అర్జునావిష్ట , అర్జునఘృతం.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Miller AL (1998). "Botanical influences on cardiovascular disease". Altern Med Rev 3 (6): 422–31. PMID 9855567. 
 2. Devi RS, Narayan S, Vani G, Shyamala Devi CS (2007). "Gastroprotective effect of Terminalia arjuna bark on diclofenac sodium induced gastric ulcer.". Chem Biol Interact 167 (1): 71–83. doi:10.1016/j.cbi.2007.01.011. PMID 17327128. 

యితర లింకులు[మార్చు]