థామస్ అల్వా ఎడిసన్
| థామస్ ఎడిసన్ | |
| జన్మ నామం | థామస్ అల్వా ఎడిసన్ |
|---|---|
| జననం | ఫిబ్రవరి 11 1847 మిలాన్, ఓహియో, యునైటెడ్ స్టేట్స్ |
| స్వస్థలం | యునైటెడ్ స్టేట్స్ |
| మరణం | అక్టోబరు 18 1931 వెస్ట్ ఆరెంజ్, న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ |
| వృత్తి | శాస్త్రవేత్త |
| తండ్రి | శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896) |
| తల్లి | నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ (1810-1871) |
ఏ వ్యక్తి అయినా ఏక కాలంలో వందల కొద్దీ ఆవిష్కరణలను కొనసాగించలేడు. అందునా సాస్త్రీయ ఆవిష్కరణలంటే సామాన్యమైన విషం కాదు. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ విషయం వేరు. 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉండటం ఆయన ఒక్కడికే చెల్లింది. 1889 లో పారిస్ లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్ కు చెందినవే కావటం ఆశ్చర్యకరం. ఇంత ప్రతిభా వుత్పత్తులను ప్రదర్శించినవారు మరొకరు లేరని, అసలు ఉండరని చెప్పడానికి సందేహమే అవసరంలెదు.
థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.
విషయ సూచిక |
బాల్యం,విద్యాభ్యాసం[మార్చు]
ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896) మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ (1810-1871) లకు ఏడవ మరియు చివరి సంతానం.ఇతని కుటుంబం డచ్ మూలాలు కలిగినది.[1] 10 ఏళ్ళ వయస్సు నాటికి యీయన సొంతంగా లాబొరేటరీని యేర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం రైళ్ళలో న్యూస్ పేపర్లు స్వీట్లు అమ్మేవాడు. అతి చిన్నవయస్సు లోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు. 1861 లో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ "గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్" అనే ఓ మోస్తరు న్యూస్ పేపర్ నడిపాడు. ఈ సమయంలోనే ఆయనకు ప్రమాద వశాత్తు చెవుడు వచ్చింది. రైల్వే బోగీలోనే లాబొరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. పొరపాటుగా అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు ఆయనను దూరంగా ఉంచివేశారు.
వివాహం[మార్చు]
డిసెంబర్ 25, 1871న 24 సంవత్సరాల వయసులో ఎడిసన్ రెండు నెలలు ముందుగా కలుసుకున్న 16 యేళ్ళ మారీ స్టిల్ వెల్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు సంతానం.
ఆవిష్కరణలు[మార్చు]
1862 లో ఎడిసన్ ఒక స్టేషన్ మాష్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుంచి టెలీగ్రఫీ ని నేర్చుకున్నాడు. 1868 లో టెలిగ్రాఫ్ పేటెంట్ ను పొందగలిగాడు. బతుకు తెరువు కోసం స్టాక్ ఎక్సేంజీ టెలిగ్రాఫ్ ఏజన్సీ లో పనికి కుదిరాడు. తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నాడు. ఏ కొద్ది మొత్తమో లభిస్తుందని అనుకున్న ఎడిసన్ కి సలభై వేల డాలర్లు ముట్టడంతో ఆశ్చర్యపోయాడు. అంతే, అప్పటి నుండి ఆయన ఆవిష్కరణలకు అంతం లేకుండా పోయింది. 1878 లో ఎలక్ట్రిక్ బల్బ్ ను రూపొందించాడు. అది ఆర్థికంగా ఆయనకు మరింత ఎత్తుకు తీసుకుని వెళ్ళింది. 'థర్మో అయానిక్ ఎమిషన్" గురించి కూదా అదే సమయంలో ఎడిసన్ వెల్లడించాడు. 1887-1889 మధ్య కాలంలో టైప్ రైటర్ , ఎలక్ట్రిక్ పెన్ , గ్రామ ఫోన్ , మోషన్ పిక్చర్ కెమేరా , అలాగ ఎన్నింటినో యీయన రూపొందిచారు. 1912 లో యీయనకు నోబెల్ బహుమతి రావల్సింది కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. అయితే ఇది ఆయన గొప్పతనాన్ని ఏ కొంచెం కూడా తగ్గించలేదు. 1931 న చనిపోయే నాటి వరకు సరికొత్త ఆవిష్కరణలు కోసం అనుక్షణం ఆరాట పడిన ఎడిసన్ కార్య దీక్ష, నిరంతర కృషి ఏ తరాలకైఒనా మార్గదర్శకాలు కాగలవని చెప్పడానికి సంకోచ పడనక్కరలేదు.
1877 లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.
ప్రశంశ[మార్చు]
"మేధావి అంటే ఒక శాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ" అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు.
సూచికలు[మార్చు]
- ↑ Baldwin, Neal (1995). Edison: Inventing the Century. Hyperion, 3-5. ISBN 0-7868-6041-3.
|
|
|
|---|---|
| పైథాగరస్ · హిప్పోక్రటిస్ · అరిస్టాటిల్ · ఆర్కిమెడిస్ · యూక్లిడ్ · టోలెమీ · లియొనార్డో డావిన్సి · నికోలస్ కోపర్నికస్ · జాన్ నేపియర్ · గెలీలియో గెలీలి విలియం హార్వె · ఆట్టో వాన్ గెరిక్ · ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి · బ్లైసీ పాస్కల్ · ఐజాక్ న్యూటన్ · బెంజమిన్ ఫ్రాంక్లిన్ · ఎడ్వర్డ్ జెన్నర్ · సర్ హంప్రీ డేవి · మైకేల్ ఫెరడే చార్లెస్ డార్విన్ · గ్రెగర్ జోహన్ మెండల్ · ఫ్రెడరిక్ ఆగస్టు కెకులే · మాక్స్ వెల్ · ఆల్ఫ్రెడ్ నోబెల్ · విల్ హెల్ం కొన్ రాడ్ రాయింట్జెన్ · గ్రహంబెల్ · థామస్ అల్వా ఎడిసన్ జగదీశ్ చంద్రబోస్ · మాక్స్ ప్లాంక్ · థేల్స్ · ప్రపుల్ల చంద్ర రే · మేడం క్యూరీ · విల్బర్ ఆర్విల్లె రైట్ సోదరులు · ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ · మార్కోనీ · ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ · అలెగ్జాండర్ ఫ్లెమింగ్ శ్రీనివాస రామానుజన్ · జాన్ లోగి బయర్డ్ · సర్ సి.వి.రామన్ · జేమ్స్ చాడ్విక్ · సత్యేంద్రనాథ్ బోస్ · సలీం అలీ · ఎన్ రికో ఫెర్మి · హోమీ జహంగీర్ బాబా · హరగోవింద ఖురానా |