పంచచామరము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

పంచచామరము[మార్చు]

జరేఫలున్జరేఫలున్జసంయుతంబు లై తగన్
గరూ పరిస్థితిం బొసంగి గుంఫనం బెలర్పఁగా
విరించి సంఖ్యనందమైనవిశ్రమంబు లందగన్
బ్రరూఢమైనఁ బద్మనాభ పంచచామరం బగున్

గణ విభజన[మార్చు]

పంచచామర వృత్త పాదములో గణవిభజన
IUI UIU IUI UIU IUI U
ప్రసన్న పింఛమా లికా ప్ర భా విచి త్రితాంగుఁ డుం

లక్షణములు[మార్చు]

పంచచామర వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు
16
ప్రతిపాదంలోని గణాలు: జ, ర, జ, ర, జ, గ
యతి : ప్రతిపాదంలోనూ 10వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి చెల్లదు

ఉదాహరణ 1:[మార్చు]

పోతన తెలుగు భాగవతంలో వాడిన పంచచామర వృత్త పద్యాల సంఖ్య: 1

(భా-10.1-586-పంచ.)
ప్రసన్న పింఛమాలికా ప్రభా విచిత్రితాంగుఁడుం
బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం
బ్రసన్న గోపబాల గీత బాహువీర్యుఁ డయ్యు ను
ల్లసించి యేగె గోపకు ల్చెలంగి చూడ మందకున్.