ఆభరణాలు
స్వరూపం
(పట్టీలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆభరణాలు లేదా నగలు (ఫ్రెంచ్ Joaillerie, స్పానిష్ Joyería, ఆంగ్లం Jewelry, జర్మన్ Schmuck) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.
వివిధ ఆభరణాలు
[మార్చు]- కిరీటము
- ఉంగరం
- గొలుసు, నెక్లెస్
- రాగిడి
- పతకం
- వడ్డాణం : లేదా ఒడ్డాణము (Belly chain) నడుముకు తొడిగే ఒక రకమైన ఆభరణము.
- పట్టీలు : ఆడవాళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా వెండితో చేసిన పట్టీలు ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా అతుకు అనే అర్ధంలో కూడా వాడుతారు.
- చెవిపోగు, చెవియాకు లేదా చెవ్వాకు
- జూకాలు
- నాగరం
- ముక్కుపుడక, నత్తు, అడ్డుకమ్మి
- జడపాళీ
- పాపిటబిళ్ళ, సూర్యుడు, చంద్రుడు
- జడగంటలు : ఇవి జడ చివర భాగంలో ధరించే వేలాడుతున్న ఆభరణము.
- గాజులు
- దండవంకీ : ఇది దండచేయికి ధరించే ఆభరణము. ఇవి సాధారణంగా బంగారంతో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన రత్నాలు అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని రవిక చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
- కాసులపేరు : ఇది సాధారణంగా కాసులు వరుసగా పేర్చినట్లుగా ఉండి గొలుసు మాదిరిగా తయారుచేసి మెడలో హారంగా ధరిస్తారు.
- అందెలు: అందె (anklet, ankle chain, or ankle bracelet) ఒక విధమైన కాలి ఆభరణము. వీటిని ప్రాచీనకాలం నుండి ఈజిప్టు, భారతదేశాలలో స్త్రీలు ధరిస్తున్నారు. భారత సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో అందెలు తప్పనిసరిగా ధరించి నర్తించవలసివస్తుంది.
- గజ్జెలు
- మెట్టెలు
- చంద్రవంక
- కడియం: కడియాన్ని కాళ్ళకు, చేతులకు కూడా వేసుకుంటారు. చేతులకు వేసుకునే వాటిని చేతి కడియాలు, కాళ్ళకు వేసుకునే వాటిని కాళ్ళ కడియాలు అని అంటారు. గతంలో ఈ కడియాలను స్త్రీలే కాక పురుషులు కూడా ధరించేవారు. రాగితో చేసిన కడియాలు ఆరోగ్య రీత్యా కూడా చాల మంది ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో వీటిని కంకణాలు అని కూడా అంటారు. కానీ చేతికి వేసుకునే వాటినే కంకణాలు అని అంటారు.
- చెంపసరాలు
- చామంతిపువ్వు
ఏడు వారాల నగలు
[మార్చు]ప్రధాన వ్యాసం ఏడు వారాల నగలు
- ఆదివారం - కెంపులు
- సోమవారం - ముత్యాలు
- మంగళవారం - పగడాలు
- బుధవారం - పచ్చలు
- గురువారం - కనకపుష్యరాగం
- శుక్రవారం - వజ్రాలు
- శనివారం - ఇంద్రనీలమణులు