పాము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
సర్పాలు |
|||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కొరల్ జాతి పాము
|
|||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
నీలం: సముద్రపు పాములు, నలుపు: భౌమ పాములు
|
|||||||||||
|
|
|||||||||||
|
పాములు లేదా సర్పాలు (ఆంగ్లం: Snakes) పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.
పాశ్చాత్య సాంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.
విషయ సూచిక |
[మార్చు] సాధారణ లక్షణాలు
- సర్పాల దేహం సన్నగా పొడవుగా ఉంటుంది. పూర్వ చరమాంగాలు, ఉరో, శ్రోణి మేఖలలు లోపిస్తాయి. కొండచిలువలలో మాత్రం ఇవి బుడిపెలు మాదిరి అవశేషాలుగా ఉంటాయి. సర్పాలు పర్వుకలకు అతికిన కండరాల ద్వారా చలిస్తాయి.
- పొలుసులతో కూడిన బహిస్తరమంతా అనేకసార్లు దేహం నుంచి పొరలుగా విడుదలవుతుంది. దీన్ని కుబుస విసర్జన లేదా మౌల్టింగ్ లేదా ఎక్టైసిస్ అంటారు.
- కర్ణభేరి త్వచం, మధ్య చెవి కుహరం, శ్రోత్రనాళాలు లోపిస్తాయి.
- మగ జీవుల్లో ఒక జత కంటకయుత సంపర్కావయవాలు ఉంటాయి.
- ఊపిరితిత్తులు అసౌష్ఠవంగా ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా లోపించడం గాని లేదా చిన్నదిగా గాని ఉంటుంది.
- కపాల నాడులు పది జతలుంటాయి.
- కనురెప్పలు కదలలేవు.
- సర్పాల్లో కర్ణస్తంభిక (Columella) ప్రలంబంతో అతికి ఉండడం వల్ల, భూమిద్వారా వెలువడే ప్రకంపనాలను మాత్రమే గ్రహించగలవు.
- మూత్రపిండాలు అసౌష్ఠవంగా ఉంటాయి. మూత్రాశయం ఉండదు.
[మార్చు] పాముల ఆహారం
అన్ని పాములు పూర్తిగా మాంసాహారులు. ఈ పరభక్షకాలు ఎక్కువగా బల్లులు, చిన్న పాములు మరియు జంతువులు, పక్షులు, గుడ్లు, చేపలు, కీటకాలు భుజిస్తాయి.[1]
[మార్చు] మానవులతో సంబంధాలు
[మార్చు] పాము కాటు
భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు,50,000 మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా.ప్రపంచం లో ఒక్క ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు.మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3 వేల జాతుల పాములున్నాయి. మన దేశంలో ఉన్న250 జాతులలో 52 విష సర్పాలు. అమెరికా, ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో పాటుకాటు మరణాలు పదుల సంఖ్యల్లో ఉంటున్నాయి. రోగికి ముందు ధైర్యం చెప్పాలి. విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటివెంట నురుగు, చూపు రెండు దృశ్యాలు కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వం టి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రి పెరాల్టిక్, పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీ వెనమ్ డోసు ఇవ్వాలి.మొదట పది వైల్స్ యాంటీవెనమ్ , ఆరు గంటల వ్యవధి తర్వాత మరో పది వైల్స్ డోసు ఇవ్వాలి.ఆరు గంటల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మా ర్పు లేకుంటే చివరి డోసుగా ఐదు నుంచి పది వైల్స్ యాంటీ వెనమ్ ఇవ్వాలి.
[మార్చు] పాములు : కొన్ని గణాంక వివరాలు
అతి పొడవైన పాము : అనకొండ (Anaconda). దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు.(18 అడుగులు). అతి చిన్న పాము : త్రెడ్ పాము (Thread Snake): పొడవు 11 సె.మీ.(4.4 అంగుళాలు). West Indies లో కనబడుతుంది. అతి పొడుగాటి కోరలు గల పాము : గబూన్ వైపర్ (Gaboon Viper). వీటి కోరలు 5 సె.మీ. (2 అంగుళాలు) కంటే ఎక్కువ. అత్యధిక వేగంతో ప్రాకే పాము : నల్ల మాంబా (Black Mamba). ఇది గంటకు 19 కి.మీ.(12 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది.
[మార్చు] పాము ఆహారం
కొన్ని దేశాలలో పాముల్ని ఆహారంగా తింటారు.
[మార్చు] పురాణాలలో
- మహాభాగవతంలో జనమేజయుడు సర్పయాగం చేశాడు. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములన్నింటిని అగ్నిలో చంపడం.
[మార్చు] వర్గీకరణ
- ఎలాపిడే : నాగుపాము, కింగ్ కోబ్రా, కట్లపాము, నల్ల మాంబా
- కోలుబ్రిడే : పసరిక పాము, జెర్రిపోతు
- పైథానిడే : కొండ చిలువ
- బాయిడే : అనకొండ
- వైపరిడే : రక్తపింజరి
[మార్చు] మూలాలు
- ↑ Bebler (1979) p.581