Coordinates: 16°37′00″N 80°58′17″E / 16.616749°N 80.971314°E / 16.616749; 80.971314

పెరికీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెరికీడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెరికీడు is located in Andhra Pradesh
పెరికీడు
పెరికీడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°37′00″N 80°58′17″E / 16.616749°N 80.971314°E / 16.616749; 80.971314
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్ 08656

పెరికీడు కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు.

సమీప గ్రామాలు[మార్చు]

హనుమాన్ జంక్షన్, ఏలూరు, నూజివీడు, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

హనుమాన్ జంక్షన్, ఏలూరు బైపాస్ రోడ్దు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 44 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జయదేవ్ హిందూ ఎయిడెడ్ పాఠశాల
  2. శ్రీ చైతన్య హైస్కూల్.
  3. గీరాంజలి హైస్కూల్, బాపులపాడు.
  4. వి.విద్యానికేతన్, వీరవల్లి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో శివుడు శ్రీ ముక్తికాంత సమేత శ్రీ ముక్తేశ్వరస్వామిగా పూజలందుకొనుచున్నాడు. ఈ శివాలయంలొ కార్తీకమాసం సందర్భంగా మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకములు, ఏకవారాభిషేకములు, విశేషార్చనలు నిర్వహించెదరు. కార్తీక మాసంలో వచ్చు, శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంనకు అత్యంత విశిష్తత ఉన్నది గనుక, ఆ రోజున ఇక్కడ, శివునికి విశేషాభిషేకాలు, అన్నాభిషేకం చేసి, భక్తులకు భారీగా అన్నసమారాధన చేయుదురు.

శ్రీ కోదండరామాలయం[మార్చు]

పెరికీడులోని ఏలూరు కాలువ వంతెన వద్ద, స్థానిక జూనియర్ కళాశాల ప్రక్కన ఉన్న ఈ పురాతన రామాలయం శిథిలమవడంతో, మహిళలు, భక్తులు, ఇందులో భాగంగా గర్భగుడిలోని మూలవిరాట్టులను భద్రపరచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. ఈ నేపథ్యంలో, శాంతిహోమం, ప్రత్యేకపూజలు నిర్వహించి, విగ్రహాలను సమీపంలో నిర్మించిన చిన్న మందిరంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.

ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసి, ఫిబ్రవరిలో, ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠగావించి, పూజాదికాలు పునఃప్రారంభించారు. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. మద్యాహ్నం నుండి అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. డప్పు వాద్య విన్యాసాలు, యువకుల నాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నది.

ఈ ఆలయం బైపాస్ రహదారికి అడ్డుగా ఉండటంతో దీనిని తొలగించి వేరే చోటికి తరలించవలసి వచ్చింది. అందువలన సమీపంలోనే నూతనప్రదేశంలో ఆలయనిర్మాణానికి ఇటీవల శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు.

గ్రామస్థులు కమీటీగా ఏర్పడి, శివాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వరకు నిర్వహించారు. గంగానమ్మ అమ్మవారి విగ్రహంతోపాటు శ్రీ గణపతి, శ్రీ సుబ్రహమణ్యేశ్వర, పోతురాజు, కాలభైరవస్వామి వారల విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. ఆఖరి రోజైన శనివారం నాడు రెండువేలకు పైగా భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.ఈ ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

శ్రీ విజయగణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారల ఆలయం[మార్చు]

స్థానిక శివాలయం సమీపంలో నాలుగు రహదారుల కూడలిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ విజయగణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఆ పిదప, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పెరికీడు&oldid=4130620" నుండి వెలికితీశారు