బీర్బల్ సహాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీర్బల్ సహాని
బీర్బల్ సహాని
జననం1891 , నవంబరు 14
బెహ్రా, సహరాన్ పూర్ జిల్లా, పశ్చిమ పంజాబ్
మరణం1949 , ఏప్రిల్ 10
లక్నో
పౌరసత్వంభారతీయుడు
జాతీయతబారతీయుడు
రంగములుపాలియో బోటనీ
వృత్తిసంస్థలులక్నో
చదువుకున్న సంస్థలుగవర్నమెంటు కాలేజీ విశ్వవిద్యాలయం, లాహోర్,
ఇమ్మాన్యుయేల్ కాలేజి, కేంబ్రిడ్జ్
పరిశోధనా సలహాదారుడు(లు)ప్రొఫెసర్ సెవార్డ్
ఇతర విద్యా సలహాదారులుగోబెల్
ప్రసిద్ధిబెన్నెట్టిటేలియన్ ప్లాంట్, హోమోక్సిలాన్ - కొత్తరకం కలప

బీర్బల్ సహాని ( 1891 నవంబరు 14 – 1949 ఏప్రిల్ 10) పురా వృక్ష శాస్త్రవేత్త. అతను భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ, జ్యోతిష, గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలున్నారు. ఈ శాస్త్రాలకు భిన్నమైన పక్షి శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరచి గుర్తింపు పొందినవారు సలీంఆలీ అయితే పురా వృక్ష శాస్త్ర పరిశోధనలలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ. అతను భారతీయ ఉపఖండంలోని శిలాజాలను అధ్యయనం చేసిన భారతీయ పాలియోబొటానిస్ట్. అతను భూగర్భ శాస్త్రం, పురావస్తు శాస్త్రంలో కూడా ఆసక్తి చూపించాడు. అతను 1946 లో లక్నోలో బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటనీని స్థాపించాడు. భారతదేశపు శిలాజ మొక్కల అధ్యయనంలో, మొక్కల పరిణామంలో అతని ప్రధాన రచనలు ఉన్నాయి[1][2][3]. అతను భారతీయ విజ్ఞాన విద్య స్థాపనలో కూడా పాల్గొన్నాడు. భారతదేశంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడిగా, స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేశాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

బీర్బల్ సహాని 1891 నవంబరు 14 వ తేదీ పశ్చిమ పంజాబ్ (యిప్పుడు యిది పాకిస్థాన్ లోనిది) రాష్ట్రంలోని షహరాన్ పూర్ జిల్లాలో గల బెహరా పట్టణంలో జన్మించాడు. తండ్రి లాలా రుచిరామ్‌ సహాని రసాయనిక శాస్త్రోధ్యాపకుడు. తల్లి ఈశ్వరీదేవి. స్వాతంత్ర్య సమరయోధులు మోతీలాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు, మదనమోహన మాలవ్యా వంటి వారు బీర్బల్ సహానీ తండ్రికి ముఖ్య స్నేహితులే[4].[5]

బీర్బల్ సహాని విద్యాభ్యాసం లాహోర్ లోని భారత ప్రభుత్వ విశ్వవిద్యాలయం కళాశాలలో జరిగింది. 1911 సంవత్సరం వరకూ పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. తండ్రికి బీర్బల్ సహానీ ఐ.ఎ.ఎస్ గానో ఐ.పి.యస్ గానో చూడాలని కోరుకునేవాడు. అయితే బీర్బల్కు మాత్రం వృక్ష శాస్త్రం మీద, మొక్కలు, వాటి శిలాజాల తీరుతెన్నుల మీద అమితమైన ఆసక్తి ఉండేది.

పంజాబ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రత సాధించిన తర్వాత బ్రిటన్ లోని లండన్ యూనివర్సిటీ నుంచి "డాక్టర్ ఆఫ్ సైన్స్" పట్టాను పొందారు. అది ఆరోజుల్లో కూడా గొప్ప అరుదైన గౌరవం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఒక భారతీయుడు "డాక్టర్ ఆఫ్ సైన్స్" పట్టాను సాధించటం అదే మొదటిసారి. ఆ ఘనత సాధించింది బీర్బల్ సహానీ! బోటనీ ప్రధానాంశంగా బీర్బల్ సహాని సాధించిన ఈ డాక్టరేట్ కు ఎన్.ఆర్.కాశ్యప్, ప్రొఫెసర్ అ.సి. సివార్ట్ వంటి మేదావులు తోడ్పాటు నందించారు. 1936 సంవత్సరంలో బీర్బల్ సహానీ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అయ్యారు[6][7].[8]

పరిశోధనలు

[మార్చు]

1917 లో ప్రొఫెసర్ సివార్డ్ తో కలసి బీర్బల్ సహానీ భారతీయ గోడ్వానా వృక్షాల మీద విస్తృత పరిశోధనలు చేశారు. భారతీయ వృక్ష జాతుల మీదే కాక పాశ్చాత్య దేశాల్లో పెరిగే వృక్ష జాతుల లక్షనాలమీద కూడా లోతైన అధ్యయనం చేశారు సహనీ. బీహార్ రాష్ట్ర రాజమహల్ పర్వత సానువుల్లో పెరిగే వృక్షాలు, మొక్కలు వాటి వైవిధ్యం, వాటికీ ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉన్నదో తరచి తరచి పరిశోధనలు చేశారు.

విలియం సోనియా సేవార్డియానా, రాజ్‌మహాలియా వరోదరా, హోమోగ్జ్రెలాల్ రాజ్ మహాలెన్స్ వంటి శిలాజాతుల గుట్టువిప్పి ప్రపంచానికి పరిచయం చేసింది బీర్బల్ సహానీయే! సహానీ ఆవిష్కరించిన "పెంటోగ్జైలియా" అనే శిలాజపు జిమ్మెస్పెర్ం ప్రపంచ ప్రఖ్యాతి గడించింది. శాస్త్రవేత్తల దృష్టి సహానీ పరిశోధనల మీదకు మళ్ళించింది. 1920 వ సంవత్సరం శ్రీమతి సావిత్రి సూరిని పెండ్లాడారు బీర్బల్ సహాని[9]. అటు పిమ్మట భారత్ వచ్చి కాశీ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వృక్షశాస్త్ర విభాగపు అధిపతిగా నియుక్తులయ్యారు బీర్బల్ సహాని.

లక్షల సంవత్సరాల క్రితం,. జూరాసిక్ రాక్షసబల్లుల కాలానికి చెందిన ఎన్నో వృక్షశిలాజాలను తన పరిశోధనల ద్వారా నిర్దుష్టంగా లెక్కకట్తి ప్రకటించారు. తన నిరంతర పరిశోధనలతో అనేకానేక శిలాజాలు, మొక్కల యొక్క జీవితకాలాన్ని లెక్కించడమే కాదు, తన గురుత్వంలో శిక్షణ పొందుతున్న ఎంతోమంది విద్యార్థులచేత దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నో శిలాజాలను సేకరింపజేసి వాటి గుట్టు విప్పార్ బీర్బల్ సహాని. సహాని కృషి ఫలితంగా వృక్షజాతుల, శిలాజాల అధ్యయనం కోసం ప్రత్యేక విభాగమే యేర్పడి విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగింది. భారతదేశంలోని మొట్టమొదటి వృక్ష శాస్త్ర శిలాజ పరిశోధనా కేంద్రంగా ఏర్పడింది.

భూగర్భ శాస్త్రవేత్త కూడా

[మార్చు]

ప్రపంచంలోని ప్రఖ్యాత వృక్ష, జంతు శాస్త్రవేత్తలైన ఎ.అర్నార్డ్ వంటి ఎంతో మంది మేధావులతో బీర్బల్ సహానీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.బీర్బల్ సహాని కేవలం పరిశోధకుడు మాత్రమే కాదు. భూగర్భ శాస్త్రవేత్త కూడా. బీర్బల్ అధ్యయనాలు భూమి ఒకప్పుడు ఒకే ఖండంగా ఉందనీ, కాలక్రమేణా రోదసీలో చోటు చేసుకున్న అనేక భౌతిక, రసాయన మార్పుల కారణంగా భూమి మధ్య నీరు ఏర్పడి 5 ఖండాలుగా రూపాంతరం చెందిందనీ చెబుతున్నాయి. ఈ ముక్కలైన ఖండాలు నిరంతరం చలనశీలత కలిగి ఉంటాయని సిద్ధాంతీకరించారు సహాని.భూమి పొరల్లో, వెలుపలా, ఉండే అనేక శిలల వయస్సును కచ్చితంగా లెక్కగట్టడం, ఎలాటి అధునాతన సున్నిత పరికరాల సహాయం లేకుండా కచ్చితంగా కనుగొనడం ఒక్క బీర్బల్ సహానీకే సాధ్యపడింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని "సాల్ట్‌రేంజ్ శిలల" వయస్సు అప్పతి వరకూ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నట్లు 10 కోట్ల సంవత్సరాలు కాదనీ ఈశిలల వయస్సు 4 లేదా 5 కోట్ల సంవత్సరాల క్రిందవనీ ఆధారాలతో నిరూపించారు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్న "దెక్కన్ ట్రాప్స్" వయస్సు 65 కోట్ల సంవత్సరాలని కూడా బీర్బల్ సహానీ పరిశోధనలు చెబుతున్నాయి.

కాల నిర్ణయం

[మార్చు]

ప్రాచీన నాణేలను పరిశీలించి వాటి కాలనిర్ణయం నిర్దేశించడం సహానీకి కొట్టిన పిండి. 1936 లో నాణేల మీద బీర్బల్ సహానీపరిశోధనలకు గాను న్యూమిన్ మెట్రిక్స్ సొసైటీ ఈయనకు "నెల్సన్ రైట్స్" మెడల్ ను ప్రదానం చేశారు. నాణేలను స్టాంపులను సేకరించి పరిశోధించడం అంటే బీర్బల్ కు ఎంతో ఆసక్తి. బీర్బల్ సహానీ మంచి చిత్రకారుడు కూడా. మట్టి బొమ్మలను అద్భుత శిల్పాలుగా తీర్చిదిద్దగల దిట్ట.

సత్కారాలు

[మార్చు]

లండన్ లోని రాయల్ సొసైటీ 1936 వ సంవత్సరంలో బీర్బల్ సహానీని ఫెలోఆఫ్ రాయల్ సొసైటీగా ఎంపిక చేసి గౌరవించింది. వృక్ష శాస్త్ర విభాగంలో రాయల్ సొసైటీ ఫెలోషిప్ సాధించిన మొదటి భారతీయ శాస్త్రవేత్త సహానీ. 1930 - 35 సంవత్సరాల కాలానికి పాలియోబోటనీ విభాగానికి ఉపాధ్యక్షునిగా 5వ, 6వ అంతర్జాతీయ వృక్షశాస్త్ర సమావేశానికి నియమితులయ్యారు బీర్బల్ సహానీ. 1940 సంవత్సరంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. 1937-39, 1943-44 నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కు అధ్యక్షుడయ్యాడు. 1948 వ సంవత్సరంలో బీర్బల్ సహానీకి అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సభ్యత్వం లభించింది[10].

పెలనో బోటనీ ఇనిస్టిట్యూట్

[మార్చు]

బీర్బల్ సహాని మార్గదర్శకత్వంలో లక్నో పట్టణంలో "పేలనీ బోటనీ ఇనిస్టిట్యూట్" భారతదేశంలో మొట్టమొదటి పురావృక్షశాస్త్ర ప్రయోగశాల నెలకొల్పడానికి ప్రతిపాదనలౌ వచ్చాయి. లక్నో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో యిందుకోసం నూతన భవన నిర్మాణానికి 1949 ఏప్రిల్ 3 వ తేదీన అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు[10]. బీర్బల్ సహానీ తన కలల సౌధం సాకారం దాల్చుతోందన్న ఆనంద్ంలో తలమునకలయ్యారు. సహ శాస్త్రవేత్తలూ, విద్యార్థులూ, యువ శాస్త్రవేత్తలందరూ ఈ శుభతరుణం కోసం ఎన్నేళ్ళనుండో వేచి ఉన్నారు. వారికి స్వప్నాలు నిజమయ్యే శుభఘడియలు వచ్చేశాయి.

సహాని ఆయన కలల సౌధాన్ని కనులారా చూడకుండానే, ఆయనకు వరించిన అంతర్జాతీయ వృక్ష శాస్త్ర కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవిని అలంకరించకుండానే, పెలనోబోటనీ ఇనిస్టిట్యూట్ భవనానికి శంకుస్థాపన జరిగిన వారం తిరక్కుండానే 1949, ఏప్రిల్ 10 న ఆకశ్మిక గుండె పోటుతో మరణించాడు[11].

మూలాలు

[మార్చు]
  1. R. Cuneo, S. Archangelsky (1986). "Ferugliocladaceae, a new conifer family from the Permian of Gondwana". Review of Palaeobotany and Palynology. 51 (1–3): 3–30. doi:10.1016/0034-6667(87)90016-9. Retrieved 14 February 2012.[permanent dead link]
  2. Rothwell, Gar W (1982). "New interpretations of the earliest conifers". Review of Palaeobotany and Palynology. 37 (1–2): 7–28. doi:10.1016/0034-6667(82)90035-5.
  3. A. Doyle, James; J. Donoghue, Michael (1986). "Seed plant phylogeny and the origin of angiosperms: An experimental cladistic approach". The Botanical Review. 52 (4): 321–431. doi:10.1007/bf02861082.
  4. Gupta (1978): pp. 3-8
  5. Khanna, Sunita Khanna (2004). "The Man That Was" (PDF). Newsletter, Birbal Sahni Institute of Paleobotany. 7: 7. Archived from the original (PDF) on 2018-07-14. Retrieved 2013-08-08.
  6. Gupta (1978): pp.12-13
  7. Sitholey, R.V. (1950). "(Sahni Memorial Volume) Paleobotany in India - VII. Professor Birbal Sahni 1891-1949". The Journal of the Indian Botanical Society. 29 (1): https://archive.org/stream/in.ernet.dli.2015.25379/2015.25379.The-Journal-Of-The-Indian-Botanical-Society-Vol-xxix-1950#page/n9/mode/1up.
  8. Sahni, Ashok (1 November 2018). ""Birbal Sahni and His Father Ruchi Ram: Science in Punjab Emerging from the Shadows of the Raj"" (PDF). Indian Journal of History of Science. 53 (4). doi:10.16943/ijhs/2018/v53i4/49539. ISSN 0019-5235. Archived from the original (PDF) on 21 జూలై 2019. Retrieved 7 అక్టోబరు 2019.
  9. Thomas, H. H. (1950). "Birbal Sahni. 1891-1949". Obituary Notices of Fellows of the Royal Society. 7 (19): 264–277. doi:10.1098/rsbm.1950.0017.
  10. 10.0 10.1 Gupta (1978):68-71.
  11. Gupta (1978):1-3.

యితర లింకులు

[మార్చు]