Jump to content

బేతవోలు (చిలుకూరు)

అక్షాంశ రేఖాంశాలు: 16°58′42″N 79°50′42″E / 16.978427°N 79.84508°E / 16.978427; 79.84508
వికీపీడియా నుండి

బేతవోలు, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలంలోని గ్రామం.[1]

బేతవోలు (చిలుకూరు)
—  రెవిన్యూ గ్రామం  —
బేతవోలు (చిలుకూరు) is located in తెలంగాణ
బేతవోలు (చిలుకూరు)
బేతవోలు (చిలుకూరు)
అక్షాంశరేఖాంశాలు: 16°58′42″N 79°50′42″E / 16.978427°N 79.84508°E / 16.978427; 79.84508
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం చిలుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి వట్టికూటి నాగయ్య
జనాభా (2011)
 - మొత్తం 15,257
 - పురుషుల సంఖ్య 7,629
 - స్త్రీల సంఖ్య 7,628
 - గృహాల సంఖ్య 4,292
పిన్ కోడ్ 508204
ఎస్.టి.డి కోడ్ 08683

ఇది మండల కేంద్రమైన చిలుకూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కోదాడ నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.బేతవోలు గ్రామం చిలుకూరు మండలంలో ఒక పెద్ద గ్రామం. ఈ గ్రామం సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. ఈ గ్రామం కోదాడ శాసనసభ నియోజకవర్గం, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4292 ఇళ్లతో, 15257 జనాభాతో 5106 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7629, ఆడవారి సంఖ్య 7628. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2850 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 638. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577553[3].పిన్ కోడ్: 508204.

గ్రామ సరిహద్దులు

[మార్చు]

బేతవోలు గ్రామంనకు తూర్పున వీర్ల దేవి చెరువు,పడమరన చిన్న చెరువు.వాయువ్యమున చెన్నారి గూడెం, ఆచార్యుల గూడెం గ్రామాలు,నైరుతిన జెర్రి పోతుల గూడెం,ఆగ్నేయమున బేతవోలు గట్టు,ఈశాన్యమున కొండాపురం.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

బేతవోలు గ్రామంలో సగానికి పైగా ప్రజలు చదువుకున్నవారే. ఈ గ్రామస్థులు చాలామంది వివిధ ఉద్యోగాలలో చేరి రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ గ్రామస్థులు సాఫ్ట్‌వేర్, మేనేజ్ మెంట్, జర్నలిజం వంటి ప్రైవేట్ ఉద్యోగాలు పోలీసు, ఉపాధ్యాయ, అధ్యాపక వంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. బేతవోలు గ్రామంలో ఒక ప్రభుత్వ ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రైవేటు ఉన్నత విద్యా పాఠశాల, ఒక ప్రభుత్వ ప్రాథమిక విద్యా పాఠశాల, ఐదు ప్రైవేటు ప్రాథమిక విద్యా పాఠశాలలు, ఒక అంగన్ వాడి పాఠశాల ఉన్నాయి. వాటిలో కొన్ని క్రింద తెలుపబడినవి. వీటిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభించి సుమారు 39 సంవత్సరములు అయినది. ఈ పాఠశాల మొదట ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రారంభమైంది. ఈ పాఠశాల ప్రారంభించటానికి కృషి చేసిన వ్యక్తులలో ముఖ్యమైన వారు అంకతి సత్యనారాయణ.

  1. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల
  2. ప్రతిభ ఉన్నత పాఠశాల
  3. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
  4. ప్రతిభ ప్రాథమిక పాఠశాల
  5. త్రీ ఏంజిల్స్ పాఠశాల (ఆంగ్ల మాధ్యమం)

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

బేతవోలులో ఉన్న మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఐదుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

బేతవోలులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఈ గ్రామం మండల కేంద్రమైన చిలుకూరుకు 7 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామాన్ని కోదాడ-మిర్యాలగూడ రాష్ట్ర రహదారికి కలుపుతూ 6 కి.మీ.ల మేర తారు రహదారి ఉంది. ఈ గ్రామం నుండి జెర్రి పోతుల గూడెం, చెన్నారి గూడెంలకు తారు రహదారులు, పోలేని గూడెంనకు ఇటీవలే తారురోడ్డు వేశారు దీంతో కోదాడ ఆకుపాముల మునగాల కోదాడకు వెళ్లడానికి దూరం కూడా తగ్గింది

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మౌళిక సదుపాయాలు

[మార్చు]

బేతవోలులో దాదాపు ప్రధాన వీధులన్నీ సిమెంటు వీధులుగా మార్చబడ్డాయి. సిమెంటు వీధులుగా మార్చిన వీధులు పెద్ద బడి నుండి చెన్నారి గూడెం మలుపు వరకు, గ్రామ పంచాయతి నుండి తోట వరకు, దేవాలయం వీధి, సాలె బజారు, గడీ బజారు, గౌండ్ల బజారు, గుర్రం బజారు.గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం అమలులో ఉంది. గ్రామంలో ప్రతి వీధిలో మంచినీటి కుళాయిలు ఉన్నాయి. ఇంటింటికి త్రాగు నీటి కుళాయిల సౌకర్యం కల్పించటం కూడా జరిగింది. గ్రామంలో మురుగు నీరు పోవుటకు కాలువలు ఉన్నాయి.

గ్రామంలోని ప్రధాన ప్రాంతాలలో సిసిటీవి కెమేరాలను అమర్చటం జరిగింది. ఇటీవల ఒక గ్రామ పంచాయతీ ఉద్యోగి ఒక సిసిటీవీ కెమేరాను దొంగిలించగా పట్టుకోవడం కూడా జరిగింది.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (ఎస్ బి ఐ), వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆదాయ వనరులు

[మార్చు]

బేతవోలు గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, వ్యవసాయ సంబంద కూలీ పనులు. ఈ గ్రామంలో ప్రధాన వ్యవసాయ పంట వరి. ఈ గ్రామంలో పండించిన వరి ధాన్యానికి మంచి ధర లభిస్తుంది. ఇక్కడ పండించిన ధాన్యం ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా తమిళనాడు లోని చెన్నై నగరానికి ఎగుమతి అగుతుంది. గ్రామంలోని రైతులు వ్యవసాయం ద్వారానే కాక పాలు, కూరగాయలు అమ్మటం ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటారు. గ్రామంలో 5 పాల కేంద్రాలు ఉన్నాయి.

గ్రామంలో రెండు చెరువులు ఉండటం వలన బెస్తవారు (గంగపుత్రులు) చేపలు పట్టటం కూడా చేస్తూ ఉంటారు. గ్రామంలోని పెద్ద చెరువులో చేపలు పెంచి అమ్ముకొనుటకు ప్రభుత్వం చెరువుని లీజుకి ఇస్తుంది. ఈ చెరువులో ఇలా పెంచి పట్టిన చేపలను కోల్‌కతా (కలకత్తా) నగరానికి ఎగుమతి చేస్తారు. గ్రామానికి తూర్పున పెద్ద చెరువు, పడమరన చిన్న చెరువు ఉన్నాయి. పెద్ద చెరువును 'వీర్లదేవి చెరువు' అని అంటారు. వీర్లదేవి చెరువు నిర్మాణం జరిగి 100 సంవత్సరములు దాటినట్లుగా తెలుస్తుంది. దీని క్రింద దాదాపు 1500 ఎకరముల వ్యవసాయ భూమి సాగు అవుతుంది. చిన్న చెరువు క్రింద దాదాపు 200 ఎకరముల దాకా వ్యవసాయ భూమి సాగు అవుతుంది.కొంతమంది రైతులు ఆక్రమించుట వలన దీని విస్తీర్ణం కుచించుకు పోయింది. దీంతో ఎపుడూ నిండుకుండలా ఉండే బేతవోలు పెద్దచెరువు ప్రస్తుతం.. వట్టిపోతుంది. పైగా దీని చుట్టూ వందల సంఖ్యలో మోటార్లు పెట్టడం వల్ల నీరు అడుగంటి పోతోంది

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

బేతవోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 556 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 348 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 76 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 23 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 365 హెక్టార్లు
  • బంజరు భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 3730 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 378 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 3722 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

బేతవోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 2477 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 496 హెక్టార్లు* చెరువులు: 534 హెక్టార్లు* ఇతర వనరుల ద్వారా: 214 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

బేతవోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మామిడి

దేవాలయాలు

[మార్చు]

బేతవోలు గ్రామంలో రామాలయం, శివాలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, కనక దుర్గ ఆలయం, ముత్యాలమ్మ గుళ్లు ఉన్నాయి. బేతవోలు గట్టు మీద నరసింహ స్వామి ఆలయం, గుట్ట దగ్గర ముత్యాలమ్మ ఆలయం ఉంది. రామాలయం ప్రక్కన సాయిబాబా గుడి కూడా ఉంది. రామాలయం నిర్మాణం జరిగి దాదాపు 500 సంవత్సరములు దాటింది.ఇది పూర్తిగా రాతితో కట్టబడింది. ఈ గ్రామంలో హిందూ దేవాలయాలతో పాటు మూడు మసీదులు, మూడు చర్చిలు కూడా ఉన్నాయి. అయితే శివాలయం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉంది. ఈ భూముల సాగు ద్వారా వస్తున్న ఆదాయంతో.. ఆ కుటుంబ సభ్యులు.. ఇపుడు కోట్లకు పడగెత్తారు అంతేకాదు ఆ ఆలయానికి ఎదురుగానే భారీ భవంతులు కూడా నిర్మించారు. ఇప్పటికీ ఈ ఆలయం గురించి గానీ లెక్కపత్రాల గురించి గానీ పట్టించుకునే నాథుడే లేడు., ఆకుటుంబం వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది

పండుగలు

[మార్చు]

అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు కనక దుర్గ జాతర, దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి. వీటిలో కనక దుర్గ జాతర అనేది గ్రామ పండుగ. ప్రతి సంవత్సరం మహాశివ రాత్రికి ముందు ఈ జాతర వచ్చును. ఏ రోజున ఈ పండుగ జరుపుకోవాలి అనేది గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. ముక్కోటి ఏకాదశికి రామాలయంలో 24 గంటల హరే రామ సంకీర్తన చేస్తారు. శ్రీ రామ నవమికి శ్రీరాముని కళ్యాణం చేసి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పానకం పులిహోరను ప్రసాదముగా పంచుతారు. మహాశివ రాత్రికి శివాలయంలో శివుని కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును.

దసరా పండుగను కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దసరా పండుగకు తొమ్మిది రోజుల మందు నుండి బ్రతుకమ్మ ఆటను ప్రారంభిస్తారు. బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. పూలను పళ్లెంపై గుండ్రంగా పేరుస్తూ పైకి వెళ్లిన క్రొద్దీ వ్యాసం తగ్గిస్తూ పేర్చుతారు. ఇలా పేర్చిన పూలని బ్రతుకమ్మ అని అంటారు. ఇలా అందరూ చేసిన బ్రతుకమ్మలను ఒక చోట ఉంచి దాని చుట్టూ బ్రతుకమ్మ పాటలు పాడుతూ తిరుగుతారు. ఈ ఆటను మహిళలు మాత్రమే ఆడుతారు. ఈ ఆటను పెళ్ళిల్లు కాని అమ్మాయిలు కూడా ఆడుతారు. మొదటి రోజు నుండి రోజుకి కొంత ఎత్తు చొప్పున బ్రతుకమ్మ ఎత్తును పెంచుతూ తొమ్మిదవ రోజుకి చేరుకొనే సరికి బ్రతుకమ్మ పెద్దగా అవుతుంది. తొమ్మిదవ రోజున ఎవరు పెద్ద బ్రతుకమ్మను చేస్తారు అని ఊరి జనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఈ బ్రతుకమ్మ పండుగను కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుపుకొంటారు. హిందువుల పండుగలే కాక ముస్లిం సోదరులురంజాన్, ఈద్-ఉల్-ఫితర్ లను క్రైస్తవ సోదరులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లను జరుపుకొంటారు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]