యలవర్తి నాయుడమ్మ
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| యలవర్తి నాయుడమ్మ | |
| జన్మనామం | యలవర్తి నాయుడమ్మ |
|---|---|
| పుట్టినతేదీ | సెప్టెంబర్10, 1922 |
| జన్మస్థలం | యెలవర్రు గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
| మరణం | జూన్ 23, 1985 అట్లాంటిక్ సముద్రము, ఐర్లాండ్ దక్షిణ భాగం |
యలవర్తి నాయుడమ్మ (1922 - 1985) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్య గరపి అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు.
పదవులు, పురస్కారాలు [మార్చు]
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరు గా (1981-1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థ కు డైరెక్టరు జనరల్ గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందాడు. భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ పురస్కారము, రాజలక్ష్మీ సంస్థనుండి శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం పొందాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా ఉన్నాడు.
1985లో జరిగిన కనిష్క విమాన దుర్ఘటనలో మరణించాడు.
డా. యలవర్తి నాయుడమ్మ మెమొరియల్ అవార్డ్ [మార్చు]
ఈ అవార్డ్ పొందిన ప్రముఖులు టి.రామస్వామి , ఎ. శివతను పిల్లై, నొరి దత్తత్రేయుడు, సాం పిట్రొడ, జి. మాధవన్ నయర్, కోట హరినారాయణ, వి.కె. ఆత్రె, ఆర్. చిదంబరం, ఆర్.ఎ. మశేల్కర్ జె.ఎస్. బజాజ్, కె. కస్తూరిరంగన్, వెర్ఘీస్ కురిఎన్, ఎస్.జెడ్. ఖసిం, ఎం.జి. కె. మీనన్ మరియు ఎం.ఎస్. స్వామినధన్ వి.కె,సరస్వత్ (2009) తదీతరులు...
మూలాలు [మార్చు]
- విస్తరణ కోరబడిన వ్యాసములు
- సుప్రసిద్ధ ఆంధ్రులు
- 1922 జననాలు
- 1985 మరణాలు
- గుంటూరు జిల్లా ప్రముఖులు
- తెలుగువారిలో శాస్త్రవేత్తలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- కాశీ లేదా వారణాసి హిందూ మతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు
- గుంటూరు ప్రముఖులు
- జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అధ్యాపకులు
- ఎయిర్ భారతదేశం ఫ్లైట్ 182
- ఆంధ్ర ప్రదేశ్ శాస్త్రవేత్తలు
- భారత రసాయనశాస్త్ర ఇంజనీర్లు