వాడుకరి చర్చ:Sai2020/క్రితం చర్చ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

స్వాగతం

సాయి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mradeepbot (చర్చ) 03:32, 17 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినందన

మీరు చాలా చక్కగా అనువాదం చేస్తున్నారు. చిన్న చిన్న అక్షర దోషాలు దొర్లకుండా చూసుకున్నారంటే మీ వ్యాసాలను వేలెత్తి చూపించే వారుండరు. --రవిచంద్ర 10:54, 21 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలిజబెత్ పేరుతో మన తెవికీలో వ్యాసం లేదు. మీరు కొత్త వ్యాసం రాయవచ్చు — రవిచంద్ర 11:46, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగా! అయితే సరే ఇలిజబెథ్ పేరుతో కూడా వ్యాసం లేదు. ఈ పేరు మీదుగానే ప్రారంభించండి. కానీ మన తెలుగు వాళ్ళకు ఆమె ఎలిజబెత్ రాణి గానే పరిచయం. ఇక్కడి ప్రసార మాధ్యమాలు కూడా అలానే ప్రచురిస్తాయి. కాబట్టి ఎలిజబెత్ కు దారి మార్పు పేజీ ఏర్పాటు చేద్దాం. — రవిచంద్ర 11:57, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అర్థాలు

human settlements ని తెలుగులో జనావాసం అనవచ్చని నా అభిప్రాయం. మీకు ఖచ్చీతమైన అర్థం తెలియక పోతే అలాగే వదిలేయండి.ఎవరైనా సరిచేస్తారు. లేకపోతే[[1]] సహాయం కానీ గూగుల్ బుక్స్ లోని వేమూరి నిఘంటువు లేక బ్రౌణ్య పదకోశం ను సందర్శించండి.— రవిచంద్ర 12:13, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆస్ట్రేలియా

సాయీ వృక్షాలంటే శాస్త్రీయంగా వృక్షజాతి మొత్తానికి వర్తిస్తుంది, కానీ చెట్టు అంటే కొన్ని రకాల వృక్షాలు మాత్రమే వస్తాయని నా అభిప్రాయం. శాస్త్రీయంగా 'Plants'కు తెలుగులో వృక్షాలని అర్థం. ఇంకో ఉదాహరణగా 'Botany' అంటే వృక్షశాస్త్రం అనే తెలుగు అర్థం చెప్పుకోవచ్చు. δευ దేవా 13:07, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల తొలగింపు

సాయీ!

  • బొమ్మల తొలగింపుకు కొంత సమయం పట్టవచ్చును. ఎందుకంటే చాలా మంది సభ్యులు, ప్రధానంగా క్రొత్తవారు (మొదట్లో నేను కూడా!) బొమ్మల కాపీ హక్కుల ఆవశ్యకతను గుర్తించనందున వాటికి సరైన టాగ్‌లు ఇవ్వకుండా వదిలేశారు. వాటిలో కొన్ని ఆంగ్ల వికీలో ఉచిత లైసెన్సులతో ఉన్నవి కూడా కావచ్చును. కనుక నిదానంగా పరిశీలించి తొలగిస్తాను.


  • తెలుగు వికీలో క్రొత్త గాలిలా ప్రవేశించావు. నీ కృషి తెలుగు వికీకి ఎంతో మేలు చేస్తుంది. మరోసారి స్వాగతం. ముఖ్యంగా నీ పేజీ డిజైన్ అద్భుతంగగా ఉంది. తెలుగు వికీలో డిజైన్‌లు మెరుగు పరచాల్సిన అవుసరాన్ని గుర్తించే ఉంటావు.


--కాసుబాబు 10:15, 27 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే! కృతజ్ఞతలు

సాయీ! కృతజ్ఞతలు. నా పేజీలో కూడా మంచి డిజైన్ పెడితే చాలా సంతోషం ('నాకు నచ్చిన బొమ్మ' భాగం వద్దులే) - అలాగే పాత చర్చల డబ్బా కూడాను. --కాసుబాబు 09:56, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాయీ! కృతజ్ఞతలు. రంగు మార్పిడి సంగతి తరువాత ఆలోచిద్దాం. నీ పరీక్షలకు బాగా చదువుకో. --కాసుబాబు 06:24, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఖోన్స్కొవొల

No, now I thx :)

RE: autobio

సాయీ గారూ నమస్కారం, నా పేరు నిసార్ అహ్మద్, మదనపల్లెకు చెందినవాడిని, ప్రస్తుతం పుణె మహారాష్ట్రలో నివాసం. నేను నా సభ్యత్వాన్ని నమోదు చేసుకొని మరీ వ్రాస్తున్నాను. నా ప్రధాన వ్యాసాలు ఉర్దూ మరియు ఇస్లాం, ఇతరవిషయాలపై కూడా వ్రాస్తున్నాను, తెలుగుభాషను ఎవరూ మరవకూడదని వ్రాసున్నాను. వేరే పేర్లతో సభ్యత్వాలు లేవు. నా పేజీని నేను స్వంతంగా సృష్టించుకోలేదు. కొన్ని మెరుగులు మాత్రం చేశాను (ఫోటో అప్లోడు, మరియు కొన్నివివరాలు). మీరు నన్ను సూటిగా అడిగారు, ఆ విధము చాలా నచ్చింది. మీరు అనుమానించడము నొప్పించింది. మీరు కొత్త సభ్యులనుకొంటాను, సయ్యద్ నిసార్ అహ్మద్ పేరుగల పేజీ తీసివేయడంలో నాకెలాంటి అభ్యంతరమూ ఉండకూడదు, ధన్యవాదాలు. మిత్రుడు nisar 11:15, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాయిగారూ నమస్తే, మీ అభిప్రాయం, నాకు ముందే అర్థమైందని చెప్పానుగా, అనుమానాస్పదంగా చూస్తే ఎవరికైనా బాధ కలుగుతోంది, "మీరిలా అంటారని తెలిసు" అని సంబోధించడం కూడా నొప్పించడం క్రిందనే వస్తుంది. మీరు నాకు తమ్ముడిలాంటి వారు, దయచేసి ఆపేజీ తుడిపివేసి "నిర్మాణాత్మకమైన" ప్రాజెక్టులలో పనిచేద్దాం రండి. దీనిగురించి చర్చిస్తూ అనవసరంగా సమయాన్ని వృధాచేయకుండా వేరేపనులలో నిమగ్నమవుదాం. సూటిగా ఒక్క విషయమేమంటే "వికిపీడియాలో తెలుగు" ను చూసి మురిసిపోయేవాళ్ళ కోవకు చెందిన వాడిని, నా స్వంతపేజీని చాసి కాదు. దేవుడి దయవలన, పత్రికలలో, మ్యాగజైన్ లలో, నా శిష్యులు నా అభిమానులే నా రచనలను తరచూ వేస్తుంటారు. గతం గత॰, పాజిటివ్ స్పిరిట్ తో పనిచేద్దాం. మనం చేయవలసినది చాలా ఉంది, సమయం తక్కువ. మనస్పూర్తిగా కలసినడుద్దాం. మీరు క్షమాపణలు అడిగి నన్ను మరింత బాధపెట్టకండి. చరైవేతి చరైవేతి... మిత్రుడు nisar 09:53, 2 మార్చి 2008 (UTC

సాయి గారూ మనం అన్నిటికీ కేవలం ఆంగ్ల వికీనే అనుసరించాల్సిన అవసరం లేదు. ఆంగ్లేయుల ఆలోచనా విధానంతో రూపొందించిన వికీని మక్కికి మక్కీ రాయాల్సిన అవసరం మనకు లేదు. కొన్ని విషయాలలో ప్రామాణికంగా తీసుకొన్నా మరికొన్ని విషయాలలో మన స్వంత శైలిని మనం తప్పక ప్రవేశపెట్టుకోవాలి. ఒక ప్రముఖ వ్యక్తి తన వ్యాసంలో తప్పులున్నాయని గమనించి, తను సరి దిద్దక వేరే వాళ్ళకు చెప్పి సరిదిద్దుకోవాలని సూచించడం ఏమంత సరిగా అనిపించడంలేదు. ఇలాంటి సంధర్భాలలో అందుకు ఏం చేయాలనే దానికి(స్వ వ్యాసపు మార్పులు)మనమే ఒక నిర్దేశ విధానం రూపొందించుకోవాలి.

పోతే మీ సృజనాత్మకత బావుంది. మీలాంటి వారి వలన వికీ కళ కళలాడుతుంటుంది. మీ ప్రస్థానాన్ని కొనసాగించండి. అభినందనలతో-మిత్రుడు --విశ్వనాధ్. 13:01, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాయి గారూ నమస్తే, మీరు బహుశా "ఐరిష్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్" లో పనిచేశారేమో (తమాషాకు), నేను (లాప్ టాప్ ఉపయోగం ఎక్కువ), మా అన్న (ఇతను డెస్క్ టాప్ ఎక్కువగా ఉపయోగిస్తాడు) ఇద్దరమూ ఒకే కనెక్షన్ ను ఉపయోగిస్తాం, నాపేజీ విషయమై ఈరోజు (2-3-08) ఇంట్లో నానా హంగామా చేశాను, అపుడు తెలిసింది, ఆసృష్టి మాఅన్నదని. ఇంతకు మునుపు సిఫీ కనెక్షన్ ఉండినది, సర్వీసు సరిలేని కారణాన ఏర్ టెల్ తీసుకొన్నాం (అదీ డోంగల్ కలిగినది), నానాతంటాలు పడ్డాం, ఇపుడు ఉన్న కనెక్షన్ రిలయన్స్ ది, రేపు ఏదుంటుందో, ఎందుకంటే ఇదీ చాలా సార్లు మొరాయిస్తుంది. బిఎస్ ఎన్ ఎల్ తీసుకోవాలనుకొంటున్నాను, ఏదిఏమైనా వికీని వదిలేదు లేదు. మీరు నిక్కచ్చిగా మీపనికొనసాగించండి, నాపేజీ ఉండడంలో సబబులేదు. ఇంకోవిషయం, నాకు కంప్యూటర్ టెక్నికల్ విషయాలు, వికీ లోని, పేజీల నిర్వహణ, మూసలు, అప్లోడు విషయాలు వగైరాలు బుర్రకెక్కలేదు, వాటిగురించి ఎక్కువసమయంతీసుకోనూలేదు, వ్రాస్తూపోతున్నానంతే, మిత్రుడు nisar 19:14, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయి! నిన్ను ఏకవచనంతో సంభోదిస్తున్నానని ఏమీ అనుకోకు! నువ్వు చిన్నవాడివని అలా సంభోదిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఏకవచనంతో సంభోదించవచ్చు. ఈ స్వీయచరిత్రల విషయంలో ఓటింగ్ ముగిసేంతవరకూ నువ్వు మరే చర్చా పేజీలోనూ ఆ విషయం గురించి చర్చించవద్దని నా విన్నపం. δευ దేవా 09:24, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మన పేజీలలోని అక్షరాలు

సాయీ! నీ, నా పేజీలలోని అక్షరాలు Imternet Explorer లో బాగానే కనిపిస్తున్నాయి. Firefox లో మాత్రం చాలా గందర గోళంగా ఉన్నాయి (ఇదివరకు ఈ సమస్య లేదు). నా కంప్యూటర్ సెట్టింగ్‌లో సమస్య కావచ్చును. ఇదేమీ పెద్ద సమస్య కాదనుకో. కాని సమయం దొరికినప్పుడు నీవు చేసిన పేజీ డిజైను కూడా ఒకమారు చూడగలవు. తొందర లేదు. ప్రస్తుతం నీకు పరీక్షల సమయం కావచ్చును. --కాసుబాబు 14:35, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా firefox లో తెవికీ నే సరిగా రాదు. మీ దాంట్లో మిగిలినవన్నీ సరిగా కనిపిస్తున్నాయా? సాయీ(చర్చ) 03:50, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా నిప్పునక్క (firefox)లో తెవికీ బాగానే కనిపిస్తుంది. దీనికి సెట్టింగులో కొన్ని మార్పులు చేయాలి. చాలా కాలం క్రితం చేశాను గనుక సరిగ్గా గుర్తు లేదు. Padma Extension ఇన్స్టాల్ చేయడం ఒక ఉపయోగకరమైన పని. (http://padma.mozdev.org). దీనివలన ఈనాడు లాంటి పేపర్లు మనకు యూనికోడ్‌లో కనిపిస్తాయి. --కాసుబాబు 04:48, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


అవును. నీ, నా సభ్యుని పేజీలు, నీ, నా చర్చా పేజీలు మాత్రం గుణింతాలు విడదీసినట్లు, అక్షరాలు అలికేసినట్లు కనిపిస్తున్నాయి. మిగిలిన పేజీలన్నీ బాగానే కనిపిస్తున్నాయి. కనుక ఇది Font Spacing కు సంబంధించిన సమస్య అనిపిస్తున్నది. ఒకవేళ నా కంప్యూటర్లో ఉన్న Font Settings కారణంగా కావచ్చును. Firefox వాడే ఇతర సభ్యులెవరైనా ఈ విషయంపై మరింత inputs ఇవ్వగలరేమో --కాసుబాబు 11:48, 5 మార్చి 2008 (UTC) --కాసుబాబు 11:48, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

క్రితం చర్చల మూస

ఆ మూస బాగుంది. చెబుదామనుకుంటూనే మర్చిపోయాను. పరీక్షలు అయిపోయాయా? పరీక్షల సమయంలో కూడా వికీలో బాగానే పనిచేస్తున్నావు. δευ దేవా 09:36, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ల్యాప్‌టాప్ అని రావాలంటే lyAp^tAp (lyAp(shift+6)tAp) అని వ్రాయాలి. δευ దేవా 12:23, 6 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీ బొమ్మ, వ్యాసాలు

నెనొచ్చి వారం పైనే అవుతుంది. కాని ఈ వారపు వ్యాసం బ్రౌను వ్యాసమే ఇంకా ఉంది. ఎప్పుడు మారుస్తారు? సాయీ(చర్చ) 04:36, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


(1) అన్య వ్యాపకాల వలన సకాలంలో వాటిని మార్చలేక ఒక వారం పొడిగించాను. వచ్చే వారంనుండి మారుతుంటాయి. (2) ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం నిర్వహణలో నువ్వు కూడా పాల్గొన గలిగితే బాగుంటుండి. వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా, వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా - ఈ రెండు పేజీలు పరిశీలించ గలవు (3) నేను సంతకం చేసినప్పుడు నా సభ్యనామం లింకు మాత్రమే వస్తుంది. (నేను సంతకం కోసం ఎడిట్ పెట్టెలో ఉన్న బటన్ నొక్కుతాను). చర్చా పేజీ లింకు కూడా ప్రక్కనే రావాలంటే ఏమి చేయాలి? --కాసుబాబు 06:57, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదిగో సంతకం మార్పు ప్రయోగిస్తున్నాను --[[User:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:33, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
లాభం లేదు. మళ్ళీ ప్రయత్నిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:36, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు ఓకే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:37, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పాతచర్చల పేజీ సృష్టి

సాయి గారు, మీరు ప్రస్తుత చర్చా పేజీ నుంచి పాత చర్చలను సభ్యులపై చర్చ:Sai2020/క్రితం చర్చ 1‎ కి మార్చడానికి cut, patse చేశారు. అలా చేయనవసరం లేదనుకుంటా. పేజీని తరలిస్తే సరిపోయేది. మీరు కట్, పేస్ట్ చేయడం వల్ల చరితంలో ఎవరెవరు ఏమార్పులు చేశారో తెలుకోడానికి ఇబ్బందే. అంతేకాకుండా పాత చర్చలకు సంబంధించిన చరితం కూడా అనవసరంగా ప్రస్తుత చర్చాపేజీలో ఉండిపోతుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 10:46, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్య వాదాలు

తొందరలో అలా వచ్చింది. కనిపెట్టినందుకు ధన్యవాదములు—రవిచంద్ర 14:05, 8 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:సమాచారపెట్టె చరరంగం ఆటగాడు

సాయీ! మూస:సమాచారపెట్టె చరరంగం ఆటగాడు లో "చరరంగం" బదులు "చదరంగం" అని ఉండాలి. మార్చగలవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:38, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Bots

ప్రదీపు గారు. నేను తెవికీ కోసం bots తయారు చేయాలనుకుంటున్నాను. నాకు C++ వచ్చు. అది పనికివస్తుందా? వేరే భాషలేమైనా నేర్చుకోవాలా? Bots ఎట్లా పనిచేస్తాయి అవి ఎట్లా తయారుచేయాలో చెప్తారా? సాయీ(చర్చ) 11:40, 28 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్లను తయారు చేయడం చాలా సులువు. మొదటగా WP:BOT పేజీని చదివి తెలుగు వికీపీడియాలో బాట్లను ఉపయోగించే ముందు ఏమేమి చేయాలో తెలుసుకోండి. ఆ తరువాత pythonలో తయారు చేసిన బాట్ framework (pywikipedia) ఉపయోగించి పైథానులో ప్రోగ్రాములను రాయడాన్ని నేర్చుకోండి. (python నేర్చుకోవడం చాలా సులువు, ఒక్క రోజు కంటే ఎక్కువ సేపు పట్టదు). పైవికీపీడియాను ఉపయోగించి బాటు ప్రోగ్రాములు రాస్తున్నప్పుడు, వికీపీడియాలోని ఏదయినా పేజీని తెమ్మన్నప్పుడు ఆ పేజీని "మార్చు" నొక్కినప్పుడు, edit డబ్బాలో కనిపించే సమాచారాన్ని మాత్రమే మన ప్రోగ్రాముకు ఇస్తుంది, అలా మన పని సులువవుతుంది. ఉదాహరణల కోసం, బాటుద్వారా చేపించటానికి నేను రాసిన ప్రోగ్రాములన్నీ నా బాటు పేజీ నుండి ఉన్న లింకుల ద్వారా చూసుకోవచ్చు. చివరిగా మీరు బాటుకోసం ప్రోగ్రాములను రాసేముందు, ఏఏ పనులకు దానిని తెలుగు వికీపీడియా వాడతారో పేర్కుంటూ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:56, 28 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదీపు గారు. నేను ఈ పేజి కి వెళ్ళాను. python download చేసాను. pywikipedia కూడా download చేసాను. download చేసిన pywikipedia folder లో .py files చాలా ఉన్నాయి. వాటినే వాడుకోవచ్చా? ఎలా వాడాలి? ఇంకొకటి, మీ బాటు సంతకం లో p వ్రాయకుండా Mradeepbot అని సంతకంచేస్తూంది... సాయీ(చర్చ) 23:38, 28 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు సంతకాన్ని సరిచేసాను. తెలిపినందుకు ధన్యవాదాలు. బాటును నడపటానికి మీరు ఈ క్రింది సూచనలను పాటించండి:

  1. మొదటగా pywikipediaను python install చేసిన folderలోనే ఉంచండి.
  2. ఆ తరువాత pywikipedia ఫోల్డరులో user-config.py అనే ఫైలును సృష్టించి అందులో క్రింది వాక్యాలను ఉందండి
    1. mylang='te'
    2. family='wikipedia'
    3. usernames['wikipedia']['te']='UserBot' #ఇక్కడ మీ బాటు పేరు ఉండాలి లేదా పరీక్షించడానికి మీ సభ్యనామాన్ని ఉపయోగించవచ్చు.
  3. పై సూచనలను పాటించడంతో బాటు నడపటానికి తయారుగా ఉంటుంది. దానిని పరీక్షించడానికి, మొదటగా login.py అనే పైథాను ప్రోగ్రామును నడుపుదాం. ఇందుకోసం command prompt తెరచి, అక్కడ pywikipedia స్థాపించిన ఫోల్డరుకు వెళ్లండి. అక్కడ python login.py అనే కమాండుకు type చేసి నడపండి. కొంత సేపటికి మీరు ఇంతకు ముందు configure చేసిన usernameకి పాస్వార్డు అడుగుతుంది, ఇచ్చి ఎంటరు నొక్కండి. లాగిన్ అయ్యిపోతారు.
  4. దాని తరువాత ఏదయినా వ్యాసాన్ని మార్చడానికి "python editarticle.py article_name" అనే ప్రోగ్రామును ఉపయోగించి వ్యాసాలను మార్చవచ్చు.

__మాకినేని ప్రదీపు (+/-మా) 04:08, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

user-config.py నేను ముందే తయారు చేసాను. నాది విండోస్ కాదు. మ్యాక్ ఓయస్ టెన్. ఓయస్ టెన్ లో టెర్మినల్ ఓపెన్ చేసాను. మీరు చెప్పిన command టైపు చేసాను. error message వచ్చింది. python: can't open file 'login.py' నన్నేంచేయమంటారు? ఇంకో రెండు నెలల తరవాతైతే నాతో విండోస్ ఉంటుంది. సాయీ(చర్చ) 02:30, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సరిపోయింది ప్రదీపు గారు. నేను బాటుగా టెర్మినల్ ద్వారా లాగిన్ అవగలుగుతున్నాను. తరువాత? సాయీ(చర్చ) 08:48, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇంతకు ముందు రాసిన ప్రోగ్రాములను ఒక సారి పరిశీలించండి. ఉదా: సభ్యులు:Mpradeepbot/mpc.imageLicense.py. మిగతా ప్రోగ్రాములను నా బాటు సభ్య పేజీ నుండి వెళ్ళి పరిశీలించవచ్చు. ఇంతకీ బాటు ద్వారా ఏఏ పనులు చేయిద్దామని అనుకుంటున్నారు అనుకుంటున్నారు? __మాకినేని ప్రదీపు (+/-మా) 10:32, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకులు

నాగార్జునాని ఎందుకు నిర్వాహకుడు చేసారు? సాయీ(చర్చ) 07:19, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాగార్జున నాకంటే చాలా ముందునుండి సభ్యులు. నేను చేరడానికి ముందే నిర్వాహకులు. తెలుగు వికీని ప్రారంభించింది ఆయనే అనుకొంటాను. (ఈనాడులో వ్యాసం చూడగలవు). నీవు ఈ ప్రశ్న అడిగినాక కుతూహలం కొద్దీ ఆయన రచనల చరిత్ర చూశాను. నవంబరు 20, 2004లో మొదటి పేజీ ఆయన దిద్దుబాటుగా రికార్డయిన మొదటి ఎడిట్. అంతకు ముందు ఐ.పి.అడ్రస్‌తో మార్పులు చేసి ఉండవచ్చును. మొదటి పేజీ చరిత్రలో చూస్తే మొదటి దిద్దుబాటు నవంబరు 17, 2004 లో జరిగింది. నీ ప్రశ్న కారణంగా మొదటి సారి ఈ విషయాలు చూశాను. 'బాతాఖానీ' గా ఈ సమాధానం వ్రాస్తున్నాను గాని ఇతర నిర్వాహకుల లేదా సభ్యుల అర్హతను బేరీజు వేసే హక్కు గానీ, ఆసక్తి గానీ నాకు లేవని గ్రహించవలెను. --ఇది నా disclaimer అన్న మాట! :) ---కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:04, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాగార్జున మొట్టమొదటి నిర్వాహకుడు..మెటా నుండీ నేరుగా నిర్వాహక హోదా తెచ్చుకున్నారు. --వైజాసత్య 01:31, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

bold line

Sai2020 గారూ మీసూచనకు నెనర్లు. నేను గైడ్ లైన్‌లో గమనించ లేదు ఇక మీదట సరిచేస్తాను. t.sujatha

main page

మెదటి పేజి మీకు తీలుసా లో ఫెడెరర్ పేరు రాకుండా చేసారు. ఎందుకు? సాయీ(చర్చ) 12:25, 11 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను "thumb"ని మాత్రమే తీసేసాను. బొమ్మపై mouseని కదిలిస్తే పేరు ఇప్పటికీ కనపడుతుంది. మొదటి పేజీలో ఇప్పటి వరకూ thumbని వాడలేదు, పైగా చూడటానికి కూడా బాగా అనిపించలేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:02, 11 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
thumbఇప్పటి వరకు ఎందుకు వాడలేదు? సాయీ(చర్చ) 11:36, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ బొమ్మల ప్రతిపాదన

సాయీ! మొదటి పేజీ బొమ్మగా ఎన్నుకొనే బొమ్మ ఏదో ఒక వ్యాసంలో ఉండాలని ఇదివరకు అనుకున్నారు. ముందు ముందు ప్రతిపాదనలలో ఈ విషయాన్ని గమనించవలెను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:37, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మరైతే ఆ వ్యాసం మెదలుపెడితే సరి సాయీ(చర్చ) 00:53, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంకొకటి, ఈ వారపు బొమ్మని ఈ రోజు బొమ్మగా మారుద్దామనుకుంటున్నాను. మీరేమంటారు? సాయీ(చర్చ) 01:55, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
"మరైతే ఆ వ్యాసం మెదలుపెడితే సరి " - తప్పకుండా చేయవచ్చు. కనీసం రెండు, నూడు పేరాల వ్యాసం వ్రాసినాకే ఆ బొమ్మను ప్రతిపాదనల జాబితాలో ఉంచడం మంచిది.
"ఇంకొకటి, ఈ వారపు బొమ్మని ఈ రోజు బొమ్మగా మారుద్దామనుకుంటున్నాను." - అనుకోవడం ముఖ్యం కాదు. చేయ గలగడం ముఖ్యం. సరైన బొమ్మల సెలెక్షన్ లేక "ఈ వారం బొమ్మ" మనం చాలాకాలం దాకా మొదలు పెట్టడానికే వెనుకాడాము. ఈ మధ్యనే మన బొమ్మల సెలెక్షన్ కొంత మెరుగు పడింది. "ఈ వారం వ్యాసం" అయితే నెలల తరబడి ఒకటే ఉండేది. చాలా మంది విమర్శించారు కూడాను. ఇప్పటికీ "ఈ వారం బొమ్మ", "ఈ వారం వ్యాసం" శీర్షికలు మెయింటెయిన్ చేయడం కాస్త కష్టం గానే ఉంది. "ఈ రోజు బొమ్మ" గా మార్చే ముందు "ఈ వారం బొమ్మ", "ఈ వారం వ్యాసం" శీర్షికలను మెయింటెయిన్ చేయడంలో కొద్ది నెలలు సహకరించమని కోరుతున్నాను. తరువాత రోజువారీ మార్పులు సాధ్యమనిపిస్తే అందరితోనూ చర్చించి మార్చవచ్చును.
నీవు మరొక్క ముఖ్యమైన విషయం విస్మరిస్తున్నావు. చురుకుగా ఉన్న కొద్ది మంది సభ్యులతో తెలుగు వికిపీడియాను ప్రస్తుతం ఆంగ్ల వికీ ప్రమాణాలతో నడపడం సాధ్యం కాదు. ఒక సభ్యుడు సెలవులో ఉంటే అతని పని ఆగిపోతున్నది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:59, 14 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్లు చేయదగ్గ పనులు

తెలుగు వికీపీడియాలో మొత్తం కలిపి 3000 బొమ్మలు కూడా లేవు, వాటిలో కాపీ హక్కులు లేని బొమ్మలను మనుషుల ద్వారా తొలగించడం పెద్ద సమస్య కాదు. en:User:Sinebot చేస్తున్న (ఇటీవలి మార్పులను గమనించడం వగైరాలకు) పనిని చేయడానికి pywikipedia సరిపోదు. api.phpని ఉపయోగించి బాటు ప్రోగ్రాము రాసేవారే సొంతంగా ఒక framework రాసుకోవాలి, ఇలాంటి బాటు తెలుగు వికీపీడియాకు కూడా ఒకటి ఉంటే బాగుంటుందని నేను కూడా చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. en:User:MiszaBot IIIలాంటి ప్రోగ్రాము కూడా తెలుగు వికీపీడియాకు ఎంతయినా ఉపయోగపడుతుంది. pywikipediaలో ఉన్న *.py ఫైళ్లు ఏంచేస్తాయో తెలుసుకోవాలటే మెటావికీలో ఉన్న వాటి వివరణను చూడు. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:23, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]