శంఖపుష్పం
వికీపీడియా నుండి
| శంఖపుష్పం | |
|---|---|
| Clitoria ternatea vine | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | యుడికాట్స్ |
| (unranked): | రోసిడ్స్ |
| Order: | ఫాబేలిస్ |
| Family: | ఫాబేసి |
| Genus: | క్లిటోరియా |
| Species: | C. ternatea |
| Binomial name | |
| Clitoria ternatea లి. |
|
శంఖపుష్పం (Clitoria ternatea; సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు.[1]
ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి.
విషయ సూచిక |
పేర్లు[మార్చు]
ఈ ఎగబ్రాకే మొక్క పుష్పాలు మానవ స్త్రీల యోని (Vulva) ఆకారంలో ఉండడం వలన లాటిన్ భాషలో దీని ప్రజాతి పేరు "క్లిటోరియా (Clitoria)" క్లిటోరిస్ "(Clitoris)". (Synonyms: Clitoris principissae.) నుండి ఉత్పన్నమైనది.[2] టెర్నేటియా ("Ternatea") ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతం పేరు టెర్నేట్ (Ternate) నుండి వచ్చింది. తమిళం, తెలుగు మరియు మళయాళం భాషలలో దీని పేరు శంఖం (Seashell) నుండి వచ్చింది.
ఉపయోగాలు[మార్చు]
- శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.
- భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
- శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.
- దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.[3]
- దీని వేరు విరేచనకారి మరియు మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.
- దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
- ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకం గా వాడుతున్నారు.
మూలాలు[మార్చు]
- ↑ గిరికర్ణిక - శంఖపుష్పము, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 89.
- ↑ Pharmacopia Indica Awl
- ↑ Mukherjee PK, Kumar V, Kumar NS, Heinrich M"The Ayurvedic medicine Clitoria ternatea-From traditional use to scientific assessment." J Ethnopharmacol. 2008 Sep 20;
బయటి లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది
- "Plant of the Week—Clitoria ternatea". Retrieved 2007-07-31.
- "Clitoria ternatea". Tropical Forages. Retrieved 2007-07-31.
- Caldecott, Todd (2006). Ayurveda: The Divine Science of Life. Elsevier/Mosby. ISBN 0723434107. Contains a detailed monograph on Clitoria ternatea (Shankhapushpi) as well as a discussion of health benefits and usage in clinical practice. Available online at http://www.toddcaldecott.com/index.php/herbs/learning-herbs/330-shankapushpi
- Clitoria Ternatea Picture and Video