పుష్పము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
పుష్పము లేదా పువ్వు (ఆంగ్లం: Flower) మొక్కలలో ప్రత్యుత్పత్తికి తోడ్పడే మార్పుచెందిన కుదించబడ్డ ప్రకాండం.
[మార్చు] పుష్ప నిర్మాణం
సామాన్యంగా ఆవృతబీజ పుష్పంలో పుష్పవృంత అగ్రభాగాన్ని 'పుష్పాసనం' లేదా 'టోరస్' అంటారు. ఈ పుష్పాసనం మీద ప్రతి కణుపు దగ్గర రూపాంతరంచెంది వలయాలుగా అమరిన పత్రాలు ఉంటాయి. వీటిని 'పుష్పపత్రాలు' అంటారు. ఒక నమూనా పుష్పంలో 4 రకాల పుష్పపత్రాలుంటాయి. అవి రక్షకపత్రావళి, ఆకర్షణపత్రావళి, కేసరావళి, అండకోశం. కేసరావళి, అండకోశాలను 'ఆవశ్యకాంగాలు' (Essential organs) అని, రక్షక , ఆకర్షణ పత్రాలను 'అనావశ్యకాంగాలు' (Non-essential organs) అని అంటారు. ఇలాంటి నాలుగుభాగాలు కలిగిన పుష్పాన్ని 'సంపూర్ణ పుష్పం' (Complete flower) అంటారు. కేసరావళి, అండకోశం రెండూ ఉన్న పుష్పాన్ని ద్విలింగక పుష్పం అని, వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఉన్న పుష్పాన్ని ఏకలింగ పుష్పం అని అంటారు. పరిపత్రంతో సంబంధం లెకుండా కేసరావళిని మాత్రమే కల్గిన ఏకలింగ పుష్పాన్ని 'పురుష పుష్పం' (Staminate flower) అనీ, అండకోశాన్ని మాత్రమే కలిగి ఉంటే 'స్త్రీ పుష్పం' (Pistillate flower) అనీ అంటారు.
[మార్చు] పుష్పాల జాబితా
- గులాబి
- సంపంగి
- మల్లె
- జాజి
- మందార
- కమలం
- కలువ
- కాగితంపూలు
- చామంతి
- చెంగల్వ
- నూరు వరహాలు
- పారిజాతం
- పొగడ
- బంతిపువ్వు
- లిల్లీ
- మొగిలి
- రాత్రి రాణి
- శివలింగపుష్పం
- నందివర్ధనం
- గన్నేరు
- కనకాంబరం
- పొన్న
- సూర్యకాంతం పువ్వు
[మార్చు] ఇవి కూడా చూడండి
|
||||||||||||||||||||||||||