హవాయి
హవాయి పడమర పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం. ఈ ద్వీప సమూహం ఆగస్ట్ 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50వ రాష్ట్రం అయ్యింది. ఈ ద్వీప సమూహం 21°18′41″ రేఖాంశం, 157°47′47″ అక్షాంశాలపై ఉన్నది. అమెరికా ప్రధాన భూభాగానికి హవాయి 3,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. 19వ శతాబ్దంలో హవాయిని శాండ్విచ్ ద్వీపాలని కూడా వ్యవహరించేవారు.
విషయ సూచిక |
భౌగోళిక పరిస్థితి[మార్చు]
భూగోళం అంతటికీ అత్యంత సుదీర్ఘమయిన ద్వీప సమూహం హవాయి. ఈ ద్వీప సమూహంలో ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీప సమూహం మొత్తం పొడవు 2400 కిలోమీటర్లు. కిలియా అగ్నిపర్వతపు లావా ప్రవాహాల వలన ఈ ద్వీపాల వైశాల్యం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈస్టర్ ద్వీపాన్ని మినహాయిస్తే ప్రధాన భూభాగాలకు అత్యంత దూరంగా ఉన్న ద్వీపం ఇది. తనలోని ప్రత్యేక భౌగోళిక స్థితిగతుల వలన వైవిధ్యభరితమయిన వృక్ష, జీవజాతులకు హవాయి నెలవయ్యింది.
చరిత్ర[మార్చు]
ఇక్కడ లభ్యమయిన పురాతన వస్తువులనుండి ఈ ద్వీపాలలో మనుషులు 11వ శతాబ్దం నుండి నివాసమున్నరనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. పోలినేషియన్ నాగరికతకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసమున్నారనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఐరోపా దేశస్థులకు ఈ ద్వీపాల గురించి 1778 లో బ్రిటీషు నావికుడు జేమ్స్ కుక్ పర్యటనల వలన పరిచయం అయ్యింది. కానీ అంతకన్నా ముందరే స్పెయిన్ వారు ఇక్కడకు వచ్చారన్న వాదన ఉంది.
చిత్ర మాలిక[మార్చు]
-
Island of Oahu - Landsat mosaic.jpg
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
|
|
||
|---|---|---|
| అలబామా · అలాస్కా · ఆరిజోనా · ఆర్కాన్సాస్ · కాలిఫోర్నియా · కొలరాడో · కనెక్టికట్ · డెలావేర్ · ఫ్లోరిడా · జార్జియా · హవాయి · ఐడహొ · ఇల్లినాయిస్ · ఇండియానా · అయోవా · కాన్సస్ · కెంటకీ · లూసియానా · మెయిన్ · మేరీలాండ్ · మసాచూసెట్స్ · మిషిగన్ · మిన్నసోటా · మిస్సిసిపీ · మిస్సోరీ · మాంటానా · నెబ్రాస్కా · నెవాడా · న్యూహాంప్‌షైర్ · న్యూజెర్సీ · న్యూమెక్సికో · న్యూయార్క్ · నార్త్ కెరొలినా · నార్త్ డకోటా · ఒహాయో · ఓక్లహోమా · ఓరెగాన్ · పెన్సిల్వేనియా · రోడ్ ఐలండ్ · సౌత్ కెరొలినా · సౌత్ డకోటా · టెన్నిసీ · టెక్సస్ · యూటా · వెర్మాంట్ · వర్జీనియా · వాషింగ్టన్ · విస్కాన్సిన్ · వయోమింగ్ · వెస్ట్ వర్జీనియా | ||