అవని లేఖరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవని లేఖరా
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుఅవని లేఖరా
జననం (2001-11-08) 2001 నవంబరు 8 (వయసు 22)
జైపూర్, రాజస్థాన్, భారత్
ఎత్తు5 అడుగుల 3 అంగుళాలు
క్రీడ
దేశం భారతదేశం
క్రీడషూటింగ్
పోటీ(లు)10మీ షూటింగ్
కోచ్సుమ సిద్దార్థ్ శిరుర్
సాధించినవి, పతకాలు
పారాలింపిక్ ఫైనళ్ళు2020 వేసవి పారాలింపిక్స్: 10m air rifle standing SH1 – Gold

అవని లేఖరా(ఆంగ్లం:Avani Lekhara జననం 2001 నవంబర్ 8) భారతదేశానికి చెందిన పారాలింపియన్, రైఫిల్ షూటింగ్ క్రీడాకారిణి. లేఖరా 2020 నాటికి షూటింగ్ క్రీడలో ప్రపంచంలోనే మొదటి అయిదు స్థానాల్లో గల ఉత్తమ క్రీడాకారిణి. 2018 పారాలింపిక్స్ లో కూడా పాల్గొన్నది.[1][2][3][4] 2020 వేసవి పారాలింపిక్స్ లో 10 మీటర్ల షూటింగ్ లో స్వర్ణ పతకం,50 మీటర్ల షూటింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఒకే పారాలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళగా నిలిచింది. [5]

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అవనీ లేఖరా

తొలినాళ్లలో

[మార్చు]

అవని 2001 నవంబర్ 8న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జన్మించింది.[6]

కెరీర్

[మార్చు]

2012లో జరిగిన కారు ప్రమాదంలో పదకొండు సంవత్సరాల వయసులో అవని అంగవైకల్యం పాలైంది. అవని తండ్రి తనను క్రీడలలో పాల్గొనమని ప్రోత్సహించాడు, షూటింగ్ అకాడెమీలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. అవని రాజస్థాన్లో న్యాయ విద్య చదువుతుంది.

అవని భారత దేశానికి షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అభినవ్ బింద్రా ను ఆదర్శంగా భావిస్తుంది. అతని విజయం చూసి తాను కూడా ఆ దిశలో కృషి చేయడం మొదలెట్టింది.

2015 లో జైపూర్లోని జగత్పురా క్రీడా భవనంలో తన శిక్షణ ప్రారంభించింది. 2017 యూఏఈ లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్ క్రీడల్లో పాల్గొన్నది.

అవార్డులు

[మార్చు]
  • అవనీ లేఖరా 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును అందుకుంది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Para shooter Avani Lekhara clinches silver; India stay in top three". Indian Express News.{{cite news}}: CS1 maint: url-status (link)
  2. "Avani Lekhara". The Bridge News.{{cite news}}: CS1 maint: url-status (link)
  3. "Para World Cup: Teenage shooter Avani Lekhara wins 10m air rifle silver". Time of India News.{{cite news}}: CS1 maint: url-status (link)
  4. "Avani Lekhara wins women's 10m air rifle silver medal at World Shooting Para Sport World Cup". Firstpost News.{{cite news}}: CS1 maint: url-status (link)
  5. "Avani Lekhara becomes first Indian woman to win multiple medals at Paralympics". ESPN (in ఇంగ్లీష్). 2021-09-03. Retrieved 2021-09-03.
  6. "Improvise, adapt, overcome: Indian para athletes' mantra for beating lockdown". ESPN (in ఇంగ్లీష్). 2020-04-19. Retrieved 2021-08-30.
  7. Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్‌, మిథాలీ". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
  8. "Padma Awards 2022: India's Golden Girl at Tokyo Paralympics Avani Lekhara to be Awarded Padma Shri". News18 (in ఇంగ్లీష్). 2022-01-25. Retrieved 2022-02-13.
  9. Namasthe Telangana (21 March 2022). "కనులపండువలా పద్మ అవార్డుల ప్రదానం.. సీడీఎస్‌ బీపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. ఆజాద్‌కు పద్మభూషణ్‌". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.

బయటి లంకెలు

[మార్చు]

పారాలింపిక్స్ లో భారత్