ఆర్య అంబేద్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్య అంబేద్కర్
Aarya Ambekar Nov 2015.jpeg
వ్యక్తిగత సమాచారం
జన్మనామం Aarya Samir Ambekar
జననం (1994-06-16) 1994 జూన్ 16 (వయస్సు: 25  సంవత్సరాలు)
ప్రాంతము పూనే , మహారాష్ట్ర , భారత దేశం.
సంగీత రీతి Indian classical music
వృత్తి విద్యార్థి
వాయిద్యం Vocal
క్రియాశీలక సంవత్సరాలు 2008 onwards
చెప్పుకోదగిన వాయుద్యాలు
Tambora

ఆర్య అంబేద్కర్ (మరాఠీ: आर्या आंबेकरజననం 1994 జూన్ 16) జీ మరాటి ఛానల్ ప్రసారం చేసిన సరిగమప మరాటి లిటిల్ చాంప్స్లో పాల్గొన్నారు.

నేపథ్యం[మార్చు]

డాక్టర్ సమీర్, శ్రుతి అంబేద్కర్ దంపతులకు ఆర్య నాగపూర్ లో జన్మించారు. శాస్త్రీయ గాయని అయిన శ్రుతి ఆర్యకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చారు.

ఆర్య నానమ్మ కూడా శాస్త్రీయ గాయనే. ఆర్యకు రెండేళ్ల వయసు ఉండగానే ఆమెలోని ప్రతిభను గుర్తించింది. ఆర్య కూడా ఐదున్నరేళ్ల లేత వయసులోనే తన తొలి గురువైన తల్లి శ్రుతి అంబేద్కర్‌ వద్ద సంగీత శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టింది. ఆరేళ్ల వయసులో ఒకటో తరగతిలో ఉండగానే సంగీతంలో తొలి పరీక్షకు కూచుంది. ఆ సమయానికి ఆమె తోటి పిల్లలింకా సరిగా మాట్లాడటానికే ఆపసోపాలు పడుతున్నారు.

ఆ తర్వాత మూడో తరగతిలో ఉండగా ఆర్య ఇంటర్‌ స్కూల్‌ పాటల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. నాటి నుంచీ ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. ఎన్నో హిందీ/మరాఠీ ఆల్బమ్‌లతో పాటు రెండు మరాఠీ సినిమాల్లో కూడా పాడింది.

2008 జూలై-2009 ఫిబ్రవరి మధ్యలో జీ మరాఠీ చానల్‌ నిర్వహించే అత్యంత ఆదరణ ఉన్న రియాల్టీ షో సరెగమప మరాఠీ లిటిల్‌ చాంప్స్ ‌ కార్యక్రమంలో పాల్గనడంతో ఆర్య ప్రతిభ గురించి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆర్యకు అప్పుడు 14 ఏళ్లే. అంటే తొమ్మిదో తరగతి చదువుతోంది.

వృత్తి[మార్చు]

ఐడియా సరెగమప లిటిల్‌ చాంప్స్[మార్చు]

జీ మరాఠీ చానల్‌ నిర్వహించే అత్యంత ఆదరణ ఉన్న సరెగమప మరాఠీ లిటిల్‌ చాంప్స్ ‌ కార్యక్రమం కోసం ఆర్యకు 2008లో ఆడిషన్‌ టెస్టు జరిగింది. మహారాష్ట్ర మొత్తం నుంచీ 8 నుంచి 14 ఏళ్ల వయసున్న వేలాది మంది పిల్లలు పోటీ పడితే చివరికి ఎంపికైన 50 మందిలో ఆర్య కూడా ఉంది. తన ప్రతిభ, గాన మాధ్యురాలతో టాప్‌ 10 ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత టాప్‌ 5 మెగా ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. షో సమయంలో ఆమెను అంతా అందాల చిన్ని పాప అని పిలిచేవారు. పోటీలో విభిన్నమైన, సంక్లిష్టమైన పాటలు పాడటం ద్వారా తన గాన ప్రతిభతో అందరినీ మెప్పించింది ఆర్య. న్యాయ నిర్ణేతల నుంచి పలుమార్లు పూర్తి మార్కులు సాధించిన రికార్డు ఆమెకు మాత్రమే సొంతం. ఒకసారైతే పాన్‌ ఖావో సియా హమావో పాటను అద్భుతంగా పాడి ఏకంగా వర్చా నీ (200 శాతంతో సమానం) మార్కులు సాధించింది. తద్వారా ఎవరూ అధిగమించలేని రికార్డు నెలకొల్పింది. సరిగమప 8 షెడ్యూళ్లతో పాటు ప్రొఫెషనల్‌ గాయనీ గాయకుల కోసం నిర్వహించిన సరిగమప 2 షెడ్యూళ్లలోనూ దీన్ని ఎవరూ అధిగమించలేక పోయారు. ఆ ఎపిసోడ్‌కు ప్రఖ్యాత గాయకుడు హరిహరన్‌ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. పలు ఎపిసోడ్లలో ఆర్యను పర్ఫార్మర్‌ ఆఫ్‌ ద వీక్‌గా కూడా పలువురు ప్రఖ్యాత గాయనీ గాయకులు ఎంపిక చేశారు. ఆర్య తన కంఠ మాధుర్యానికి, గాయక నైపుణ్యాలకు అందరి ప్రశంసలూ పొందింది. పక్కా శాస్త్రీయ గీతాల నుంచి నాట్యగీతాలు, భావగీతాలు, భక్తిగీతాలు, మరాఠీ చిత్రపత సంగీతం, హిందీ పాటలు, జానపద గేయాలు, లావనీల దాకా పలు రకాలైన గీతాలను ఆర్య అద్భుతంగా ఆలపిస్తుంది. సాటిలేని తన ప్రతిభతో ప్రతి ప్రదర్శననూ వీక్షకులకు వీనుల విందుగా తీర్చిదిద్దడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.

ముంబై ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి స్మృత్యర్థం ఆర్య పాడిన ఏ మెరే వతన్‌ కే లోగో పాట అయితే నిజంగా చిరస్మరణీయం. భావోద్వేగాలతో నిండిన ఆమె గాత్రంలో అద్భుతంగా పలికిన ఆ పాట ప్రేక్షకులతో కూడా కంటతడి పెట్టించింది. నవంబర్‌ 26 ఉగ్రవాద దాడిలో మరణించిన వారి జ్ఞాపకంగా ముంబై పోలీసులు దాదర్‌లోని శివాజీ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఆర్య అదే పాట పాడింది. నిజానికి ఆ పాటను 1962 ఇండో-చైనా యుద్ధంలో అసువులు బాసిన సైనికుల కోసం లతా మంగేష్కర్‌ పాడింది.

సరెగమప కార్యక్రమం జరుగుతుండగానే ఆర్యకు మాణిక్‌ వర్మ స్కాలర్‌షిప్‌ వచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక స్కాలర్‌షిప్‌ పొందిన వారిలో ఆమే అత్యంత పిన్న వయస్కురాలు.

పాడిన పాటలు[మార్చు]

పోటీలో ఆర్య పాడిన కొన్ని చిరస్మరణీయమైన పాటలు
 • "ట్రిబ్యూట్ ఏ మేరె వతన్‌ కే లోగో"
 • ట్రిబ్యూట్ వందేమాతరం
 • "ట్రిబ్యూట్ సైనిక్ హో తో తుం సా సాథీ"
 • మాలా మహంత్యాత్‌ పుణ్యాచీ మైనా
 • చం చం కర్తా హై ఏ
 • అహె సాజనా
 • యువతిమన దారుణ్‌ రణ్‌
 • దిల్‌ చీజ్‌ క్యా హై
 • సునియో జీ
 • కుతా తుమ్హీ జలా వతా
 • పాన్‌ ఖాయే సయ్యా
 • యూ కైసి ప్రియా
 • నాకా తోడు పవన జరా తంబా
 • గగన్‌ సదన్‌ తేజోమయ
 • సమయిఛ శుభ్రకల్యా'
 • త్యా చిత్తచోరత్యాలా
 • జాయిన్‌ విచారిత్‌ రణ్‌పూల
 • సఖి గా మురళీమోహన్‌
 • యూ సాజన్‌ అలా
 • "యమునాలి ఖెలూ ఖేల్"
 • అవఘ రంగ్‌
 • 'అనంవిరా
 • సర్నార్‌ కాధీ రణ్‌'
 • ఏ గాయే గా విఠబై
 • ఘాయల్‌ మీ హరణీ
 • యా చిమన్యన్నో
 • నరవర్‌ కృష్ణసమమ్‌

ఆల్బమ్స్‌[మార్చు]

ప్రదర్శనలు[మార్చు]

ఆర్య తన కళా ప్రతిభను ప్రదర్శించిన కొన్ని అతి పెద్ద ప్రదర్శనలు

 • వసంతోత్సవ్ ‌: పుణేలో ఏటా జరిగే సంగీత విభావరి. సుప్రసిద్ధుడైన వసంత్‌రావ్‌ దేశ్‌పాండే జ్ఞాపకార్థం ఆయన మనవడు దీన్ని నిర్వహిస్తారు.రాహూల్‌ దేశ్‌పాండే 2008.[12]
 • శ్రీమంత్‌ దగాదుషేత్‌ హల్వాయీ గణపతి మ్యూజిక్‌ ఫెస్టివల్‌ : 2009 ఏప్రిల్‌ నుంచి 2010 ఏప్రిల్‌ దాకా.[13]
 • ముంబై, పుణే, సాంగ్లీ, ఔరంగాబాద్‌, గోవా, రత్నగరి, థానే, నాగ్‌పూర్‌, వంటి పలు నగరాలతో పాటు దుబాయ్‌ వంటి అంతర్జాతీయ నగరాల్లో లిటిల్‌ చాంప్స్ ‌ లైవ్‌ షోలు. ఇవన్నీ జీ మరాఠీ ఏర్పాటు చేసిన సూపర్‌హిట్‌ పాపులర్‌ షోలు. మరో నలుగురు లిటిల్‌ చాంప్స్‌ ముగ్ధ వైశంపాయన్‌, ప్రథమేశ్‌ లగాటే, రోహిత్‌ రౌత్‌, కార్తీకి గైక్వాడ్‌ అనే మరో నలుగురు లిటిల్‌చాంప్స్‌తో కలిసి వాటిలో ఆర్య ప్రదర్శనలిస్తుంది. ఈ సమూహానికి 'పంచ్‌ రత్న' అని పేరు.[14]
 • సరెగమప, పున్హ నవే, స్వప్న స్వరంచే సీజన్‌ (2009 అక్టోబర్‌ 7) వంటి పోటీల్లో ప్రఖ్యాత అతిథిగా వెళ్తుంది. అక్టోబరు 2005
 • 2009 అక్టోబరులో పుణే సమీపంలోని హంద్షీలోని సాయి ఆశ్రమంలో భగవాన్‌ శ్రీ సత్య సాయిబాబా సమక్షంలో ఏర్పాటు చేసిన భక్తి కార్యక్రమంలో లైవ్‌ షో. అక్టోబర్ 2009 [15][16]
 • 2009 నవంబరులో భగవాన్‌ శ్రీ సత్య సాయిబాబా జన్మదినం సందర్భంగా పుట్టపర్తిలోని సాయి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లైవ్‌ షో. 24 నవంబరు 2008[17]
 • 2010 మార్చిలో ఆశాం భోంస్లేను సన్మానించేందుకు పూణేలో ఏర్పాటు చేసిన కార్యక్రమం స్వర్‌ ఆశా లో లైవ్‌ షో. సుధేశ్‌ భోంస్లేతో కలిసి ఆర్య ఈ కార్యక్రమంలో యుగళ గీతాలు పాడింది. మీ మరాఠీ చానెల్ లో అది ప్రత్యక్ష ప్రసారమైంది.
 • దక్కన్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ తన 125వ వ్యవస్థాపక సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో లైవ్‌ పర్ఫార్మెన్స్‌. భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సమక్షంలో ప్రదర్శన.
 • మహారాష్ట్ర రాష్ట్రం యొక్క దిన్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా శివసేన ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లతా మంగేష్కర్‌తో కలిసి లైవ్‌ పర్ఫార్మెన్స్‌.
 • అంతర్నాద్‌ : శ్రీనివాస్‌ ఖాలే స్వరపరిచిన గీతాలతో కూడిన కార్యక్రమం. దీన్ని 2010 ఆగస్టు 29న మీ మరాఠీ చానల్‌ ప్రసారం చేసింది.

పురస్కారాలు మరియు గుర్తింపు[మార్చు]

 • 2008: భావి సంగీత శిక్షణ కోసం మాణిక్‌ వర్మ స్కాలర్‌షిప్‌ పొందిన అత్యంత పిన్న వయస్కురాలు.[18]
 • 2009: జీ మరాఠీ చానల్‌ ఏర్పాటు చేసిన సంగీత ఆధారిత రియాల్టీ షో సరెగమప లిటిల్‌ చాంప్స్‌లో రన్నరప్‌.
 • 2010: హరిభాను సేన్‌ అవార్డు (మరాఠీ: हरीभाऊ साने पुरस्कार) [19]
 • 2010: పుణ్యరత్న యువ గౌరవ్‌ అవార్డు. (మరాఠీ: "पुण्यरत्न - युवागौरव" पुरस्कार) [20][21][22]

ప్రముఖుల ప్రశంసలు[మార్చు]

ఆర్య పాటల్లోని గాఢత, ఆమె స్వర నాణ్యత, గానాన్ని మెరుగు పరచుకునేందుకు ఆమె చేసే అంతులేని పరిశ్రమ పలువురు సినీ, సంగీత రంగ ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ప్రశంసలు సాధించి పెట్టాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కిశోరీ ఆమోన్కర్‌, లతా మంగేష్కర్‌, శ్రీనివాస్‌ఖాలే, శ్రుతి సదోలికర్‌, పండిట్ హృదయనాథ్‌ మంగేష్కర్‌, పండిట్‌ సత్యశీల్‌ దేశ్‌పాండే, శ్రీధర్‌ పడకే, సురేశ్‌ వాడ్కర్‌, కౌశల్‌ ఇనామ్‌దార్‌, శంకర్‌ మహాదేవన్‌, శ్రేయా ఘోషాల్‌, మహాలక్ష్మీ అయ్యర్‌, హరిహరన్‌, విజయ్‌ ఘాటే, ఆశా కాద్లికర్‌ వంటి వారెందరో ఉన్నారు.

మూలాలు[మార్చు]

 1. పాంచరత్న వాల్యూమ్‌ 1
 2. పాంచరత్న వాల్యూమ్‌ 2
 3. పాంచరత్న వాల్యూమ్‌ 2
 4. http://www.umusicindia.com/album.php?albumid=566&hotcom=2&category=1
 5. మరాఠీ అస్మిత
 6. అభిమాన గీత్ బాతమీ
 7. ఆథ్ వా స్వర్
 8. The making of आठवा स्वर యూ ట్యూబ్ లో
 9. The details on the event on Star Majha యూ ట్యూబ్ లో
 10. ఆథ్ వా స్వర్, లోక్ సత్తా
 11. ఆథ్ వా స్వర్, సకాల్
 12. వసంతోత్సవ్‌
 13. శ్రీమంత్‌ దగాదుసేథ్‌ హల్వాయీ గణపతి మ్యూజిక్‌ ఫెస్టివల్‌
 14. దుబాయ్‌ ప్రదర్శన దుబాయ్‌ ఫొటోలు
 15. పుణే హదాషీలోని పాండురంగ క్షేత్రకు సాయిబాబా సందర్శనం
 16. సత్య సాయిబాబా ముందు ఆర్య ప్రదర్శన
 17. పుట్టపర్తిలో సాయిబాబా జన్మదినం
 18. సకాల్‌లో మాణిక్‌వర్మ స్కాలర్‌షిప్‌ వివరాలు
 19. హరిబాను సేన్‌ అవార్డుపై సకాల్‌ దినపత్రికలో వ్యాసం
 20. లోక్‌సత్తాలో వివరాలు
 21. పుణ్యరత్న అవార్డుల గురించి లోక్‌సత్తాలో వార్త
 22. పుణ్యరత్న అవార్డుల గురించి సకాల్‌లో వార్త

బాహ్య లింకులు[మార్చు]