Jump to content

సంగీత వాయిద్యం

వికీపీడియా నుండి
(సంగీత వాయిద్యాలు నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్ర ప్రదేశ్‌లో వాడే కొన్ని సంగీత వాయిద్యాలు

సంగీత వాయిద్యం, (Musical Instrument) భారతీయ సంగీతంలో గాయకునికి సహాయకారిగా ఉపయోగించే పరికరం.

సంగీత వాయిద్యాల వివిధ రకాలు

[మార్చు]

వాయిద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు

  1. తంత్రీ వాయిద్యాలు : తంత్రులు లేదా తీగ (String) లతో వాయించేవి (ఉదా: వీణ, తంబూరా, సంతూర్, వయోలీన్, సరోద్, సితార, సారంగి, కడ్డీవాయిద్యం మొదలైనవి)
  2. సుషిర వాయిద్యాలు : గాలితో (Wind) పనిచేసే వాయిద్యాలు లేదా గాలిని ఊది వాయించేవి (ఉదా: వేణువు, సన్నాయి, కొమ్ము, నాదస్వరం, షహనాయ్, శంఖువు, నరశింగ్ మొదలైనవి)
  3. అవనద్ధ వాయిద్యాలు : చర్మాన్ని ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి (ఉదా: మృదంగం, డోలు, ఢమరుకం, మద్దెల, తబలా, తప్పెట, దుందుభి, నగారా, డోలక్, పంచముఖ వాయిద్యం మొదలైనవి)
  4. ఘన వాయిద్యాలు : ఘనం అనగా గట్టిగా ఉండేవి. ఇవి తాళం ననుసరించు వాయిద్యాలు (ఉదా: తాళాలు, గంటలు, గజ్జెలు, ఘటం, చురుతలు, మోర్సింగ్, మంజిర మొదలైనవి)

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]