Jump to content

ఆస్ట్రేలియాలో హిందూమతం

వికీపీడియా నుండి
మెల్‌బోర్న్‌లోని శివ విష్ణు దేవాలయం.
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
1911414—    
1933212−48.8%
198621,500+10041.5%
199143,580+102.7%
199667,270+54.4%
200195,473+41.9%
20061,48,123+55.1%
20112,75,534+86.0%
20164,40,300+59.8%

2016 జనాభా లెక్కల ప్రకారం 4,40,300 పైచిలుకు అనుయాయులున్న హిందూమతం ఆస్ట్రేలియాలో మైనారిటీ మతం. దేశ జనాభాలో 1.9% మంది హిందువులు. [1] ఆస్ట్రేలియాలో వలసల ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న మతాలలో హిందూమతం ఒకటి. [2] యువకుల్లో అత్యధిక వ్యాప్తిలో ఉన్న మతాలలో హిందూమతం కూడా ఒకటి. హిందువులలో 34% మంది 14 ఏళ్లలోపు, 66% మంది 34 ఏళ్లలోపు వారు. [3]

పంతొమ్మిదవ శతాబ్దంలో, పత్తి, చెరకు తోటలలో పని చేయడానికి బ్రిటిషు వారు మొదటిసారిగా హిందువులను భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు. వారిలో చాలామంది చిన్న వ్యాపారులుగా, ఒంటెలను తోలేవారిగా, వ్యాపారులుగా, చిరువ్యాపారులుగా పని చేస్తూ, చిన్న గ్రామీణ ప్రాంతాల్లో వస్తువులను అమ్ముకుంటూ అక్కదె ఉండిపోయారు. ప్రస్తుత కాలంలో హిందువులు మెడిసిన్, ఇంజనీరింగ్, కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో నిపుణులు. ఆస్ట్రేలియాలోని హిందువులు ఎక్కువగా భారతీయ మూలానికి చెందినవారు కాగా, గణనీయమైన సంఖ్యలో శ్రీలంక, ఫిజియన్, మలేషియన్, సింగపూర్, నేపాల్ మూలాలు కలిగినవారు కూడా ఉన్నారు.

చరిత్ర

[మార్చు]

కింది తేదీలు హిందూమతం యొక్క ఆగమనాన్ని క్లుప్తంగా వివరిస్తాయి.

  • సా.శ. 300 నాటికే ఇండోనేషియా హిందూ వ్యాపారులు ఆస్ట్రేలియా మూల వాసులతో పరిచయం పెంచుకున్నారు. 
  • 1788 - బంగాళాఖాతం నుండి భారతీయ సిబ్బంది వాణిజ్య నౌకలపై ఆస్ట్రేలియాకు వచ్చారు. [4]
  • 1816 - భారతదేశం లోని యూరోపియన్ కుటుంబాలలో పనిచేసిన గృహ సేవకులు సిడ్నీలో కార్మిక పనుల కోసం కలకత్తా రేవు నుండి వచ్చారు.
  • 1844 - గతంలో భారతదేశం లో నివసించిన పి ఫ్రియెల్, 25 మంది దేశీయ కార్మికులను భారతదేశం నుండి సిడ్నీకి తీసుకువచ్చాడు. వీరిలో కొందరు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. [5]
  • 1850లు - హిందూ సింధీ వ్యాపారి, శ్రీ పమ్ముల్, మెల్‌బోర్న్‌లో ఒపల్ వ్యాపారాన్ని నిర్మించాడు. అది అతని తరువాత మూడవ నుండి నాల్గవ తరం వారసులతో సంపన్నంగా కొనసాగింది. [6]
  • 1857 - జనాభా లెక్కల ప్రకారం విక్టోరియాలో కేవలం 277 మంది హిందువులు మాత్రమే ఉన్నారు. గోల్డ్ రష్ కాలంలో చాలా మంది భారతీయులను విక్టోరియాలోని బంగారు గనులకు ఆకర్షించాయి.
  • 1893 - న్యూ సౌత్ వేల్స్‌లో 521 మంది హిందువులు నివసిస్తున్నారని జనాభా లెక్కలు చూపించాయి.
  • 1901 - 800 మంది భారతీయులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఉత్తర NSW, క్వీన్స్‌లాండ్‌లో ఉండేవారు.
  • 1911 - జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 3698 మంది హిందువులు ఉన్నారు. [7]
  • 1921 - 2200 లోపు భారతీయులు నివసించారు.
  • 1971 - స్వామి ప్రభుపాద ఆస్ట్రేలియా చేరుకుని, సిడ్నీలో మొదటి హరే కృష్ణ కేంద్రాన్ని స్థాపించాడు. [8]
  • 1977 - ఆస్ట్రేలియాలో మొట్టమొదటి హిందూ దేవాలయం , శ్రీ మందిర్ ఆలయాన్ని నిర్మించారు. డాక్టర్ ప్రేమ్ శంకర్, డాక్టర్ పద్మనాబ్న్ శ్రీంధర్ ప్రభు, డాక్టర్ ఆనంద్‌లు అనే ముగ్గురు భక్తులు ఆబర్న్ NSWలో పాత ఇంటిని కొనుగోలు చేసి, దానిని దేవాలయంగా మార్చడానికి $12,000.00 చెల్లించారు. [9] [10]
  • 1981 - జనాభా లెక్కల ప్రకారం విక్టోరియాలో 12,466 మంది హిందువులు, NSWలో 12,256 మంది - మొత్తం దేశంలో 41,730 మంది ఉన్నారు.
  • 1985 - మురుగన్ ఆలయం నిర్మించాలని శైవ మన్రం అనే హిందూ సంఘం ఏర్పడింది. ప్రారంభమైనప్పటి నుండి మురుగన్‌ని 'సిడ్నీ మురుగన్' అని పిలుస్తారు. శైవ మన్రం దాదాపు పదేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించింది.
  • 1986 - 1986 జనాభా లెక్కల ప్రకారం, హిందువుల సంఖ్య 21,000 దాటింది.
  • 1991 – 1991 జనాభా లెక్కల ప్రకారం, హిందువుల సంఖ్య 43,000 దాటింది.
  • 1996 - భారతదేశంలో పుట్టిన హిందువులు ఆస్ట్రేలియాలోని మొత్తం హిందువులలో 31 శాతం ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో 67,270 మంది హిందువులు నివసిస్తున్నారు. [11]
  • 2001 – 2001 జనాభా లెక్కల ప్రకారం, ఆస్ట్రేలియాలో హిందువుల సంఖ్య 95,000 దాటింది. [12]
  • 2003 - వినాయకుడి ఆలయాన్ని నిర్మించడానికి శ్రీ కర్ఫగ వినాయకర్ ఆలయం ఏర్పడింది. ప్రారంభమైనప్పటి నుండి, గణేశుడిని 'సిడ్నీ గణేష్ టెంపుల్' అని పిలుస్తారు.
  • 2006 – 2006 జనాభా లెక్కల ప్రకారం, ఆస్ట్రేలియాలో హిందువుల సంఖ్య 1,45,000 దాటింది. [13]
  • 2011 – 2011 జనాభా లెక్కల ప్రకారం, హిందువుల సంఖ్య 2,75,000 దాటింది. [14]
  • 2015 - డేనియల్ ముఖీ భగవద్గీతపై ప్రమాణం చేయడం ద్వారా పదవిలోకి వచ్చిన మొదటి ఆస్ట్రేలియా MP అయ్యాడు. [15]
  • 2016 - 2016 జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియన్ జనాభాలో హిందువులు దాదాపు 2% మంది ఉన్నారు, ఇది పాకిస్తాన్‌లోని హిందువుల శాతాన్ని (1.85%, తాజా 1998 జనాభా లెక్కల ప్రకారం) అధిగమించింది.
  • 2018 - కౌశలియా వాఘేలా ఆస్ట్రేలియా పార్లమెంటులో భారతీయ సంతతికి చెందిన మొదటి హిందూ పార్లమెంటు సభ్యురాలు.

జనాభా వివరాలు

[మార్చు]

సంవత్సరం వారీగా హిందూ జనాభా

[మార్చు]

రాష్ట్రం లేదా భూభాగం వారీగా హిందువులు

[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలోని మొత్తం జనాభాలో హిందూ మతంతో అనుబంధం ఉన్న వ్యక్తులు

న్యూ సౌత్ వేల్స్ కాకుండా అన్ని రాష్ట్రాల్లో (A.C.T, నార్తర్న్ టెరిటరీ లతో సహా) హిందూ జనాభా 2006 జనాభా లెక్కల కంటే రెట్టింపుగా ఉన్నట్లు 2011 జనాభా లెక్కల డేటా చూపించింది. న్యూ సౌత్ వేల్స్ లో కనీసం 2001 నుండి అత్యధిక సంఖ్యలో హిందువులున్నారు.

సంవత్సరం శాతం పెంచు
1986 0.14% -
1991 0.25% +0.11%
1996 0.38% +0.13%
2001 0.51% +0.13%
2006 0.75% +0.24%
2011 1.28% +0.53%
2016 1.90% +0.62%
2021 2.70% +0.80%
రాష్ట్రం లేదా భూభాగం జనాభా 2016 జనాభా లెక్కలు 2016 జనాభా లెక్కల శాతం జనాభా 2011 జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల శాతం 2011-2016 వృద్ధి సూచన
న్యూ సౌత్ వేల్స్ 181,402 2.4% 119,843 1.7% +61,559 [16]
విక్టోరియా 134,939 2.3% 83,102 1.6% +51,837 [17]
క్వీన్స్‌ల్యాండ్ 45,961 1.0% 28,609 0.7% +17,352 [18]
పశ్చిమ ఆస్ట్రేలియా 38,739 1.6% 21,048 0.9% +17,691 [19]
దక్షిణ ఆస్ట్రేలియా 22,922 1.4% 13,616 0.9% +9,306 [20]
ఆస్ట్రేలియన్ రాజధాని ప్రాంతం 10,211 2.6% 6,053 1.7% +4,158 [21]
ఉత్తర భూభాగం 3,562 1.6% 1,642 0.8% +1,920 [22]
టాస్మానియా 2,554 0.5% 1,608 0.3% +946 [23]

మెజారిటీ ఆస్ట్రేలియన్ హిందువులు ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి నివసిస్తున్నారు. వీరు ప్రధానంగా మెల్బోర్న్, సిడ్నీ నగరాల్లో ఉన్నారు. దాదాపు 39% హిందువులు గ్రేటర్ సిడ్నీలో, 29% మంది గ్రేటర్ మెల్‌బోర్న్‌లో, 8% మంది గ్రేటర్ బ్రిస్బేన్, గ్రేటర్ పెర్త్‌లలో నివసిస్తున్నారు . హిందువులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు, భూభాగాలు ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (2.57%), న్యూ సౌత్ వేల్స్ (2.43%). అత్యల్పంగా ఉన్నవి క్వీన్స్‌లాండ్ (0.98%), టాస్మానియా (0.50%). [24]

2006 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో జన్మించిన మొత్తం ఆస్ట్రేలియన్లలో 44.16% హిందువులు. ఫిజీలో జన్మించిన వారిలో 47.20% మంది, ఇండోనేషియాలో జన్మించినవారిలో 1.84% మంది, మలేషియా వారిలో 3.42% మంది, శ్రీలంక నుండి వచ్చినవారిలో 18.61% మంది హిందువులు. [25]


టాస్మానియాలో, హిందూమతం ప్రధానంగా భూటాన్‌కు చెందిన లొత్షాంప జాతి ప్రజలు ఆచరిస్తున్నారు. [26]

హిందూమతం ఆంగ్లో-ఆస్ట్రేలియన్లలో కూడా ఎక్కువ ప్రజాదరణ పొందింది. [27] ఆస్ట్రేలియాలోని చాలా మంది కాకేసియన్లు కారమ్ డౌన్స్ (శ్రీ శివ విష్ణు దేవాలయం) వద్ద ఉన్న హిందూ దేవాలయాన్ని సందర్శిస్తారు. తమిళంలో వేద హిందూ గ్రంధాలను నేర్చుకుంటారు. [28] ఆస్ట్రేలియాలోని ఇస్కాన్ హిందూ సంఘంలో 60,000 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 70% మంది విదేశాల నుండి వచ్చిన హిందువులు, మిగిలిన 30% మంది ఆంగ్లో ఆస్ట్రేలియన్లు. [29] 2016 జనాభా లెక్కల ప్రకారం, ఆస్ట్రేలియాలోని స్థానిక సమాజానికి చెందిన 415 మంది హిందువులున్నట్లు ( మూలవాసులు, టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసులు ) గుర్తించారు. [30]

భాషలు

[మార్చు]

ఆస్ట్రేలియన్ హిందువులలో 17% కంటే తక్కువ మంది ఇంగ్లీషును తమ ఇంటి భాషగా ఉపయోగిస్తున్నారు. 2006 జనాభా లెక్కల ప్రకారం ఇంటిలో వివిధ భాషలు మాట్లాడే ఆస్ట్రేలియా హిందువుల సంఖ్య: [31]

భాష Y 2011 Y 2016 మార్పు
మొత్తం 2,75,534 4,40,300 59.80%
హిందీ 81,892 119,284 45.66%
ఆంగ్ల 39,800 58,855 47.88%
తమిళం 36,940 53,766 45.55%
నేపాలీ 21,766 50,629 132.61%
గుజరాతీ 29,250 45,884 56.87%
తెలుగు 16,717 30,723 83.78%
పంజాబీ 9,442 16,546 75.24%
మలయాళం 5,938 11,687 96.82%
మరాఠీ 8,774 11,589 32.08%
కన్నడ 5,383 8,783 63.16%
బెంగాలీ 5,685 8,481 49.18%
దక్షిణాసియా nfd 3,531 3,770 6.77%
ఇండోనేషియన్ 1,171 1,755 49.87%
ఫ్రెంచ్ 1,180 1,401 18.73%
ఫిజియన్ హిందీ 572 1,257 119.76%
మారిషస్ క్రియోల్ 514 883 71.79%
కొంకణి 609 845 38.75%
ఒరియా 282 694 146.10%
ఇండో-ఆర్యన్ nfd 1,988 633 -68.16%
మలయ్ 435 591 35.86%
తుళు 348 543 56.03%
సింధీ 277 521 88.09%
అస్సామీ 165 302 83.03%
వియత్నామీస్ 109 225 106.42%
ఫిజియన్ 129 213 65.12%
సింహళీయులు 232 163 -29.74%
ఇటాలియన్ భాష 158 158 0.00%
బాలినీస్ 129 156 20.93%

ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలు

[మార్చు]

మొదటి హిందూ మత కేంద్రం సిడ్నీలో స్వామి ప్రభుపాద స్థాపించిన హరే కృష్ణ కేంద్రం. [32] 1977లో ఆస్ట్రేలియాలో మొట్టమొదటి హిందూ దేవాలయం, శ్రీ మందిర్ దేవాలయం నిర్మించబడింది. [33] ఆస్ట్రేలియాలో దాదాపు నలభై మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి. [34]

  • సిడ్నీ దుర్గా దేవాలయం
  • BAPS ఆలయం, మెల్బోర్న్
  • శ్రీ వెంకట కృష్ణ బృందావన, మెల్బోర్న్
  • శ్రీ వెంకట కృష్ణ బృందావన, సిడ్నీ
  • శివ విష్ణు దేవాలయం, మెల్బోర్న్
  • దుర్గా టెంపుల్, మెల్బోర్న్
  • షిర్డీ సాయి సంస్థాన్, మెల్బోర్న్
  • సంకటమోచన్ హనుమాన్ మందిర్, మెల్బోర్న్
  • మెల్బోర్న్ మురుగన్ ఆలయం, మెల్బోర్న్
  • శ్రీ వక్రతుండ వినాయగర్ టెంపుల్, మెల్బోర్న్

సమకాలీన సమాజం

[మార్చు]

2019లో చేసిన జాతీయ సర్వే ప్రకారం, హిందూ ఆస్ట్రేలియన్లు అత్యధిక వివక్షను అనుభవించారు. [35] సర్వేకు స్పందించినవారిలో మూడొంతుల మంది (75%) ప్రజా రవాణాలోనో, వీధిలోనో వివక్షను అనుభవించినట్లు చెప్పారు. [36] హిందువులలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 1.81. ఇది ఆస్ట్రేలియాలో రెండవది. మొదటి స్థానంలో బౌద్ధులు ఉన్నారు. క్రైస్తవుల్లో 2.11, ముస్లిముల్లో 3.03 గా ఉంది. [37]

విదేశీ భూభాగాలు

[మార్చు]

క్రిస్మస్ ద్వీపంలో కొద్ది సంఖ్యలో ఉన్న మలేషియా భారతీయులు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [38] [39]

చిత్ర గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Census reveals Australia's religious diversity on World Religion Day". Australian Bureau of Statistics. 18 January 2018. Retrieved 5 August 2021.
  2. "Melbourne's fastest-growing religion". Theage.com.au. 30 June 2008. Retrieved 10 July 2013.
  3. "Archived copy". Archived from the original on 23 March 2015. Retrieved 17 May 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Archived copy". Archived from the original on 30 April 2015. Retrieved 13 May 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Indian overseas Population - Indians in Australia. Non-resident Indian and Person of Indian Origin". NRIOL.
  6. "Archived copy". Archived from the original on 24 September 2015. Retrieved 13 May 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. "Archived copy". Archived from the original on 4 March 2016. Retrieved 13 May 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  8. "Early Disciples Celebrate Forty Years of ISKCON in Australia". Archived from the original on 2021-10-26. Retrieved 2022-01-17.
  9. "History - SRI MANDIR". www.srimandir.org.
  10. "Archived copy". Archived from the original on 26 March 2016. Retrieved 13 May 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  11. Statistics, c=AU; o=Commonwealth of Australia; ou=Australian Bureau of. "Main Features - Census shows non-Christian religions continue to grow at a faster rate". www.abs.gov.au.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  12. "Hinduism". www.ncls.org.au.
  13. "Archived copy". Archived from the original on 24 September 2015. Retrieved 15 May 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  14. "Hindu fastest growing religion in australia - visareporter". Archived from the original on 2018-08-05. Retrieved 2022-01-17.
  15. Hasham, Nicole (12 May 2015). "Labor MLC Daniel Mookhey makes Australian political history by swearing on the Bhagavad Gita". The Sydney Morning Herald.
  16. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  17. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  18. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  19. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  20. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  21. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  22. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  23. "Religion - Australia - Community profile". profile.id.com.au. Archived from the original on 2022-11-09. Retrieved 2022-01-17.
  24. "Census TableBuilder - Dataset: 2016 Census - Cultural Diversity". Australian Bureau of Statistics – Census 2016. Archived from the original on 14 జనవరి 2023. Retrieved 29 July 2017.
  25. "2914.0.55.002 2006 Census Ethnic Media Package" (Excel download). Census Dictionary, 2006 (cat.no 2901.0). Australian Bureau of Statistics. 27 June 2007. Retrieved 14 July 2008.
  26. http://religionsforpeaceaustralia.org.au/upload/diverse-faiths.pdf
  27. "This Is How Hinduism Is Getting Popular In Australia - Boldsky.com".
  28. "The rise of Hinduism in Australia, will it continue? | SBS News".
  29. "More Australians putting their faith in Hinduism – The Citizen".
  30. "2071.0 - Census of Population and Housing: Reflecting Australia - Stories from the Census, 2016".
  31. "Census 2011 Australia | ABS Population Income | SBS Census Explorer". Sbs.com.au. Archived from the original on 17 జూలై 2013. Retrieved 10 July 2013.
  32. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-26. Retrieved 2022-01-17.
  33. "History | SRI MANDIR".
  34. "Australian Hindu Temples and Associations - Hindu Council of Australia". Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-17.
  35. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-20. Retrieved 2022-01-17.
  36. https://www.westernsydney.edu.au/newscentre/news_centre/story_archive/2017/national_survey_finds_australians_worried_about_relatives_marrying_muslims
  37. http://theconversation.com/factcheck-qanda-the-facts-on-birth-rates-for-muslim-couples-and-non-muslim-couples-in-australia-81183
  38. "Archived copy". Archived from the original on 3 August 2017. Retrieved 23 September 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  39. Simone Dennis (2008). Christmas Island: An Anthropological Study. Cambria Press. pp. 91–. ISBN 9781604975109.