ఇ.ఎం.సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇ.ఎం.సుబ్రహ్మణ్యం
వ్యక్తిగత సమాచారం
జననం(1948-12-13)1948 డిసెంబరు 13
కోయంబత్తూరు, తమిళనాడు
మరణం2015 ఏప్రిల్ 23(2015-04-23) (వయసు 66)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాద్య కళాకారుడు
వాయిద్యాలుఘటం

ఎలప్పులి మహదేవ అయ్యర్ సుబ్రహ్మణ్యం ఒక కర్ణాటక సంగీత శాస్త్రీయ వాద్యకారుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు 1948, డిసెంబరు 23వ తేదీన కోయంబత్తూరులో జన్మించాడు.[1] ఇతడు ఘటవాద్యాన్ని తన తండ్రి ఇ.పి.మహదేవ అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. ఇతడు 8 యేండ్ల వయసులో తొలి కచేరీ చేశాడు. దేశ విదేశాలలో అనేక సోలో ప్రదర్శనలు ఇవ్వడమే కాక ఇతర సంగీతకారుల కచేరీలలో సహకార వాద్యకళాకారుడిగా అనేక ప్రదర్శనలలో పాల్గొన్నాడు. ఇతడు చెంబై వైద్యనాథ భాగవతార్, కె.బి.సుందరంబాళ్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారి వంటి గాత్ర విద్వాంసులకు, టి.ఆర్.మహాలింగం వంటి వేణుగాన విద్వాంసులకు, కున్నకూడి వైద్యనాథన్, టి.ఎన్.కృష్ణన్, మైసూర్ చౌడయ్య, లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్ వంటి వయోలిన్ విద్వాంసులకు, మైసూరు దొరైస్వామి అయ్యంగార్ వంటి వీణ విద్వాంసులకు, పాల్గాట్ మణి అయ్యర్, ఉమయల్పురం కె.శివరామన్, టి.కె.మూర్తి వంటి మృదంగ విద్వాంసులకు, అల్లా రఖా, కిషన్ మహరాజ్, జాకిర్ హుసేన్ వంటి తబలా విద్వాంసులకు ఘటవాద్య సహకారాన్ని అందించాడు. ఇతడు ఆకాశవాణిలో ఏ గ్రేడు కళాకారుడిగా 40 యేళ్ళకు పైగా అనేక సంగీత కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. ఇతడు ఘటవాయిద్య గురువుగా అనేక మంది శిష్యులను విద్వాంసులుగా తయారు చేశాడు. ఇతడు అనేక పత్రికలలో ఘటం వాయిద్యంపై రచనలు చేశాడు. ఇతడు అడయార్‌లోని తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

అవార్డులు

[మార్చు]

ఇతడిని తమిళనాడులోని అనేక సంస్థలు సత్కరించాయి. 2000లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" కళైమామణి పురస్కారాన్ని ఇచ్చింది. 2011లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం వాద్యపరికరాలు- ఘటం విభాగంలో అవార్డును ప్రకటించింది.[2] మద్రాసు సంగీత కళాశాల ఇతనికి "కళై వితగర్" బిరుదును ప్రదానం చేసింది.

మరణం

[మార్చు]

ఇతడు 2015, ఏప్రిల్ 23న తన 67వ యేట మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. web master. "E. M. Subramaniam". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 8 March 2021.[permanent dead link]
  2. Sumathi, Saigan Connection. "Review - The Sangeet Natak Akademi Awards for 2010 - 2011". Narthaki.com. Retrieved 2012-03-16.
  3. Special Correspondent. "Ghatam exponent dead". The Hindu.