Coordinates: 16°20′32″N 80°29′28″E / 16.342214°N 80.491061°E / 16.342214; 80.491061

ఉప్పలపాడు (పెదకాకాని మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పలపాడు
—  రెవిన్యూ గ్రామం  —
ఉప్పలపాడు is located in Andhra Pradesh
ఉప్పలపాడు
ఉప్పలపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°20′32″N 80°29′28″E / 16.342214°N 80.491061°E / 16.342214; 80.491061
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదకాకాని
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కర్నాటి శ్రీనివాసరావు
జనాభా (2011)
 - మొత్తం 6,175
 - పురుషుల సంఖ్య 3,074
 - స్త్రీల సంఖ్య 3,101
 - గృహాల సంఖ్య 1,700
పిన్ కోడ్ 522509
ఎస్.టి.డి కోడ్ 0863

ఉప్పలపాడు గుంటూరు జిల్లా పెదకాకాని మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెదకాకాని నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1780 ఇళ్లతో, 6175 జనాభాతో 1660 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3074, ఆడవారి సంఖ్య 3101. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1456 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 201. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590255[1].గుంటూరు నగరం నుండి 8 కిలోమీటర్ల దూరములో తెనాలినందివెలుగు మర్గంలో ఈ గ్రామం ఉంది.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

ఉప్పలపాడు పక్షుల వలస కేంద్రం[మార్చు]

ఉప్పలపాడు పక్షుల వలస కేంద్రము ఆంధ్రప్రదేశ్ లో ఉంది. పెయింటెడ్ స్పాట్-బిల్ల్‌డ్ పెల్లికాన్ లు,ఇంకా రక రకాల పక్షులు సైబీరియా, ఆస్ట్రేలియా మొదలగు దేశాల నుండి వలస వస్తాయి. గతంలో 12,000 దాకా పక్షులు ఉండగా ఇప్పుడు 7000 మాత్రమే ఉన్నాయి.

శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ నాగమాంబ సమేత శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ రెండు ఆలయాలు, పూర్వం రాజుల కాలంలోనే నిర్మించారు. ఈ ఆలయాల ధూప, దీప నైవేద్యాలకు 21 ఎకరాల మాగాణి భూమి ఏర్పాటుచేసారు. కాలక్రమేణా ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నవి. దీనితో గ్రామస్థులు, దాతలు అందరూ కలిసి మొత్తం 40 లక్షల రూపాయాలు జమచేసి, దేవాదాయశాఖ వారి సహాయం లేకుండానే, 364 రోజులలో ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం పూర్తిచేసారు. ఈ ఆలయాలకు ముందు భాగంలో మహాత్మా గాంధీ విగ్రహం గూడా ఏర్పాటు చేసారు. అనంతరం ప్రతి సంవత్సరం దసరా, మహాశివరాత్రి, ఆలయ పునఃప్రతిష్ఠా వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించుచున్నారు. నేడు ఈ గ్రామం గురించి, ఆలయాల గురించి, చుట్టుప్రక్కల పది మండలాల ప్రజలు విశేషంగా చెప్పుకొనుచున్నారు.

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయానికి అవసరమైన స్థలాన్ని గ్రామానికి చెందిన దాతలు శ్రీ పెద్ది రఘు దంపతులు అందజేసినారు.స్వామి వారి విగ్రహాన్ని మన్నవ శ్రీనివాస్ చౌదరి దంపతులు అందజేశారు, దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే-27,28,29 తేదీలలో నిర్వహించారు. 29వ తేదీ శుక్రవారంనాడు, తెల్లవారుఝామున 5 గంటల నుండియే, యఙ్లాలు, హోమాలు ప్రారంభించారు. ఉదయం వేదపండితుల ఆధ్వర్యంలో ధజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామి, వినాయకస్వామి కుమారస్వామివారల విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ 15వ వార్షికోత్సవాన్ని, 2016,జనవరి-27 బుధవారంనాడు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యమనికి విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేసారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

సమీప గ్రామాలు[మార్చు]

నంబూరు 6 కి.మీ, మద్దిరాల కాలని 6 కి.మీ, వేజెండ్ల 6 కి.మీ,

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు, 2009-10 నుండి 2013-14 వరకు రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎన్నికై పతకాలు సాధించుచున్నారు. నరసరావుపేటలోని పురపాలక సంఘం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో, 2014,నవంబరు-5న నిర్వహించిన జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో, "వాతావరణంపై అవగాహన - శీతోష్ణస్థితిపై ప్రభావం" అను అంశంపై పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో ఉప్పలపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థినులు తయారుచేసిన "వాట్ హ్యాపెండ్ టు మై ఫ్లోక్స్" అను ప్రాజెక్ట్, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈ పాఠశాలలో చదువుచున్న భావన, అమృత, భార్గవి, హిమజ, పావని అను విద్యార్థినులు ఒక జట్టుగా ఏర్పడి పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులైన శ్రీ వీరప్పయ్య ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును రూపొందించారు. అనంతపురంలో 2014,నవంబరు-8 నుండి నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలలో ఈ విద్యార్థినులు పాల్గొంటారు. సమీప బాలబడి గుంటూరులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుంటూరులోను, ఇంజనీరింగ్ కళాశాల నంబూరులోనూ ఉన్నాయి. సమీపవైద్యకళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఉప్పలపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఉప్పలపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఉప్పలపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 226 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1433 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 4 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1429 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఉప్పలపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1429 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఉప్పలపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
 2. ఆంధ్రా బ్యాంక్

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కర్నాటి శ్రీనివాసరావు, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా చెరుకూరి కోటేశ్వరరావు ఎన్నికైనాడు

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఉప్పలపాటి సైదులు

గ్రామంలోని విశేషాలు[మార్చు]

 1. ఈ గ్రామములో ఉన్న పక్షి సంరక్షణ కేంద్రము గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
 2. ఈ గ్రామములో శ్రీమతి సంపూర్ణం అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె తన 103వ ఏట, 2014, జూలై-6, ఆదివారం నాడు ఎండతీవ్రత వలన అస్వస్థతకు గురై కాలధర్మం చెందాడు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,309. ఇందులో పురుషుల సంఖ్య 3,154, స్త్రీల సంఖ్య 3,155, గ్రామంలో నివాస గృహాలు 1,733 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,660 హెక్టారులు.

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.