Jump to content

ఉప్పల్ శిల్పారామం

వికీపీడియా నుండి
ఉప్పల్ శిల్పారామం
సాధారణ సమాచారం
రకంకళల నైపుణ్య గ్రామం
నిర్మాణ శైలిజాతి
ప్రదేశంఉప్పల్ , హైదరాబాద్, తెలంగాణ
పూర్తి చేయబడినది2019
ప్రారంభం2019 జూన్ 22
జాలగూడు
మినీ శిల్పారామం వెబ్సైటు

ఉప్పల్ శిల్పారామం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న ఒక పర్యాటక కేంద్రం.[1] ఆర్ట్స్, చేతిపనులతో రూపొందించిన ఈ కేంద్రం, ఉప్పల్-నాగోల్ మధ్యన మూసీ నది ఒడ్డున నిర్మించబడింది.[2]

ప్రారంభం

[మార్చు]

ఏడున్నర ఎకరాల స్థలంలో, రూ.5 కోట్లతో నిర్మించిన ఈ ఉప్పల్ మినీ శిల్పారామం 2019, జూన్ 22న తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్, సి.హెచ్. మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు ప్రారంభించారు.[3][4]

నిర్మాణం

[మార్చు]

2018 జూలైలో దీని నిర్మాణం ప్రారంభమై, 2019 మే నెలలో పూర్తయింది. హైదరాబాదు నగర తూర్పు ప్రాంత ప్రజలకు పల్లె అందాలను, అనుభూతిని కలిగించేందుకు నిర్మించబడిన ఈ కేంద్రంలో హస్తకళలు, చేనేత వస్ర్తాల కోసం 50 స్టాళ్లను ఏర్పాటుచేశారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పెద్దలు సేదతీరడానికి పచ్చని మైదానం, ఆకట్టుకొనే ప్రవేశ తోరణం, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 32 అడుగుల తాత్కాలిక ఫౌంటేన్‌, ఫుడ్‌కోర్టు, సాంస్కృతిక కార్యక్రమాలకు యాంఫీ థియేటర్‌ (దాదాపు 40 మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శన ఇచ్చేలా వేదిక, 1000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు సీటింగ్ ఏర్పాటు) వెదురు బొంగులతో ఆకర్షణీయంగా స్టాళ్లు నిర్మించబడ్డాయి.[1][5]

కన్వెన్షన్‌ సెంటర్‌

[మార్చు]

ప్రజలు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా శిల్పారామంలో 10కోట్ల రూపాయలతో అత్యాధునిక శైలిలో గోడలతో కాకుండా పెద్ద మొత్తంలో స్టీల్‌ స్ట్రక్చర్స్‌తో మల్టీపర్సప్ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించబడింది. ఇందులో ఒకేసారి 1000 మంది అతిథులు హాయిగా కూర్చుని కార్యక్రమాలను వీక్షించే, నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక వేదిక ఏర్పాటుచేయబడింది.

2023, జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి శుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]

ఇతర వివరాలు

[మార్చు]

రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి 8గంటల వరకు... శనిఆదివారాల్లో, సెలవు దినాల్లో ఉదయం 11గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఈ శిల్పారామం తెరువబడుతోంది. అంతేకాకుండా ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.[7] ప్రవేశ టిక్కెట్ ధర పెద్దలకు రూ. 40, పిల్లలకు రూ. 20 గా ఉంది.[8]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 telugu, NT News (2021-06-02). "పర్యాటకంపై ప్రత్యేక దృష్టి: ఉప్పల్ భగాయత్ లో శిల్పారామం ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2021-06-30. Retrieved 2022-04-07.
  2. "మినీ శిల్పారామాన్ని చూశారా?". EENADU. Archived from the original on 2020-06-03. Retrieved 2022-04-07.
  3. "మినీ శిల్పారామం ఫోటోలు". azozooloo.info. Archived from the original on 2022-04-07. Retrieved 2022-04-07.
  4. "Mini Shilparamam at Uppal to be opened tomorrow". The Hindu. Special Correspondent. 2019-06-20. ISSN 0971-751X. Archived from the original on 2021-02-25. Retrieved 2022-04-07.{{cite news}}: CS1 maint: others (link)
  5. Namasthe Telangana (15 April 2022). "పల్లె సోయగం.. ఉప్పల్‌ శిల్పారామం". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  6. telugu, NT News (2023-06-26). "Minister KTR | ఉప్పల్‌లో స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  7. "ఉప్పల్ శిల్పారామం... 22న ప్రారంభం...!". ETV Bharat News. 2019-06-21. Archived from the original on 2022-04-07. Retrieved 2022-04-07.
  8. "Uppal 'Mini Shilparamam' open to public". The Hindu (in Indian English). Special Correspondent. 2019-06-23. ISSN 0971-751X. Archived from the original on 2021-02-25. Retrieved 2022-04-07.{{cite news}}: CS1 maint: others (link)

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.