ఉప్పల్ స్కైవాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పల్ స్కైవాక్
ప్రదేశం
ఉప్పల్, హైదరాబాదు, తెలంగాణ
జంక్షన్ వద్ద
రహదార్లు
రామంతాపూర్‌-బోడుప్పల్‌
హబ్సిగూడ-ఎల్బీనగర్
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్1
నిర్మాణం చేసినవారునిర్మాణంలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
గరిష్ట
వెడల్పు
640.0 మీటర్లు పొడవు
6 మీటర్ల ఎత్తు

ఉప్పల్ స్కైవాక్‌, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ జంక్షన్‌లో పాదచారుల భద్రతకు నిర్మిస్తున్న స్కైవాక్‌.[1] 25 కోట్ల రూపాయలతో 640.0 మీటర్లు పొడవు, 6 మీటర్ల ఎత్తులో లూప్‌ ఆకారంలో నిర్మిస్తున్న ఈ స్కైవాక్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి.[2]

వివరాలు[మార్చు]

రామంతాపూర్‌-బోడుప్పల్‌ రోడ్డుకు, హబ్సిగూడ-ఎల్బీనగర్ వైపు మార్గాలను అనుసంధానం చేస్తూ పాదచారులు అన్ని వైపులా వెళ్ళేందుకు వీలుగా ఈ స్కైవాక్‌ అందుబాటులోకి వచ్చింది. ఎలివేటెడ్‌ కారిడార్‌తోపాటు ఎండ, వర్షం పడకుండా నిర్మిస్తున్న ఈ స్కైవాక్ ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు అనుసంధానం చేశారు.[3]

విశేషాలు[మార్చు]

స్కైవాక్‌ మొత్తం పొడవు 640.0 మీటర్లు, వెడల్పు (వర్టికల్‌ వెడల్పు) 3, 4, 6 మీటర్లు, ఎత్తు 6 మీటర్లుగా ఉంది. దీనికి 6 లిఫ్టులు, 4 ఎస్కలేటర్స్‌, 12 మెట్ల సౌకర్యం కూడా ఉంటుంది. నాగోల్‌ రోడ్‌ మెట్రోస్టేషన్‌, రామంతాపూర్‌ రోడ్‌, జీహెచ్‌ఎంసీ థీమ్‌ పార్కు, వరంగల్‌ బస్టాప్‌ (జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద), ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ (ఎమ్మార్వో కార్యాలయం), ఉప్పల్‌ ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ వంటి ప్రాంతాలలో ఆరు చోట్ల ఎగ్జిట్‌/ఎంట్రీ పాయింట్స్‌ ఉన్నాయి.[4]

మూలాలు[మార్చు]

  1. India, The Hans (2022-10-28). "Hyderabad: Skywalk to adorn Uppal junction soon". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-10-28. Retrieved 2023-01-23.
  2. "uppal skywalk: కొత్త ఏడాదిలో ఉప్పల్‌ స్కైవాక్‌". EENADU. Archived from the original on 2023-01-23. Retrieved 2023-01-23.
  3. Today, Telangana (2022-02-18). "Hyderabad: 660-metre skywalk to ease traffic congestion at Uppal". Telangana Today. Archived from the original on 2022-02-18. Retrieved 2023-01-23.
  4. telugu, NT News (2022-10-28). "ఉప్పల్‌ జంక్షన్‌లో..స్కై వాక్‌ రెడీ!". www.ntnews.com. Archived from the original on 2022-11-14. Retrieved 2023-01-23.