Jump to content

ఎన్. సి. కారుణ్య

వికీపీడియా నుండి
(ఎన్.సి.కారుణ్య నుండి దారిమార్పు చెందింది)
కారుణ్య
జననం (1986-03-01) 1986 మార్చి 1 (వయసు 38)[1]
వృత్తిగాయకుడు

ఎన్. సి. కారుణ్య (ఆంగ్లం:N. C. Karunya)సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు. ఇతడు ఇండియన్ అయిడల్ (సీజన్ 2) లో రెండవ స్థానాన్ని పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

తొలి జీవితం

[మార్చు]

కారుణ్య 1 మార్చి 1986 తేదీన హైదరాబాదు లో ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు. నాలుగు సంవత్సరాల వయసునుండే సంగీతంలో శిక్షణ పొందాడు. మామయ్య ఎన్.సి.మూర్తి వద్ద 14 సంవత్సరాలకే కఠోరమైన శిక్షణ పొందాడు. ఇతడు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. చిన్నతనంలోనే చిరు సరిగమలు పేరుతో ఆల్బమ్ చేసాడు. దీనిని చిరంజీవి ఆవిష్కరించారు. తర్వాత ఈటీవీ లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురి ని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు. సోనీ టెలివిజన్ లో పాల్గొన్న ఇండియన్ ఐడల్ రెండవ సంచికలో పాల్గొని అశేష జనావళికి ప్రీతి పాత్రుడై రెండవ విజేతగా నిలిచాడు.

సినిమా పాటలు

[మార్చు]
సినిమా పాటలు
క్రమ సంఖ్య సంవత్సరం చిత్రం పాట సంగీత దర్శకుడు భాష
1 2005 వంశం పల్లె పల్లె హెచ్. మధుసూదన్ తెలుగు
2 2006 లగే రహో మున్నాభాయ్ ఆనే చర్ ఆనే శంతను మొయిత్రా హిందీ
3 2006 అశోక్ ఏకాంతంగా ఉన్నా మణిశర్మ తెలుగు
4 2006 సైనికుడు ఓరుగల్లుకే పిల్లా హారిస్ జయరాజ్ తెలుగు
5 2007 చిరుత ఎందుకో పిచ్చి పిచ్చిగా మణిశర్మ తెలుగు
6 2008 కంత్రి 123 నేనొక కంత్రి మణిశర్మ తెలుగు
7 2010 మర్యాద రామన్న అమ్మాయి కిటికీ పక్కన ఎం. ఎం. కీరవాణి తెలుగు
8 2010 ఖలేజా ఓం నమో శివరుద్రాయ మణిశర్మ తెలుగు
9 2010 ఆరెంజ్ ఓల ఓలాల హారిస్ జయరాజ్ తెలుగు
10 2011 శక్తి యమగా ఉందే మణిశర్మ తెలుగు
11 2011 తీన్ మార్ వయ్యారాల జాబిల్లి మణిశర్మ తెలుగు
12 2011 సీమ టపాకాయ్ ధీరే ధీరే ధీరే దిల్లే వందేమాతరం శ్రీనివాస్ తెలుగు
13 2015 భమ్ బోలేనాథ్ వన్స్ అపాన్ ఏ టైమ్ సాయి కార్తీక్ తెలుగు
14 2021 వెన్నెల వచ్చే పదమని వెన్నెల వచ్చే పదమని పివిఆర్ రాజా తెలుగు

మూలాలు

[మార్చు]
  1. "ఎన్. సి కారుణ్య". littlemusiciansacademy.com. Archived from the original on 11 జూన్ 2019. Retrieved 9 July 2017.