ఎవరిని ఎవరు క్షమించాలి
ఎవరిని ఎవరు క్షమించాలి | |
---|---|
రచయిత | ఉదయ్ భాగవతుల |
దర్శకుడు | ఉదయ్ భాగవతుల |
తారాగణం | పుణ్యదాస్ – జోగారావు, సుజన్ – మంజునాథ్ శర్మ/లక్ష్మణ్ మీసాల, ప్రకృతి – జయశ్రీ (శ్రీజయ), శ్రీజ సాధినేని, ఇంద్ర – ఉదయ్ భాగవతుల/శ్రీధర్ బీచరాజు/పుండరీ, జావీద్ భాయ్ - కొమరవోలు శ్రీనివాసరావు |
ఒరిజినల్ భాష | తెలుగు |
విషయం | సాంఘిక నాటిక |
నిర్వహణ | కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్, సికింద్రాబాద్ |
ఎవరిని ఎవరు క్షమించాలి కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్, సికింద్రాబాద్ వారిచే ప్రదర్శించబడుతున్న సాంఘిక నాటిక.[1] ఉదయ్ భాగవతుల రచన, దర్శకత్వం వహించిన ఈ నాటిక అనేక పరిషత్తులలో ప్రదర్శించబడి, వివిధ విభాగాల్లో బహుమతులను అందుకుంది.
కథ
[మార్చు]అన్ని మతాల కంటే మానవత్వం అనే మతం గొప్పది. ఆ మతంలో క్షమించడాన్ని మించిన గొప్ప పనిలేదు. పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయిన పుణ్యదాసు, వృత్తి పరంగానేకాదు, వ్యక్తిగతంగా కూడా గౌరవం కలిగినవాడు. ఒకరోజు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అతని కొడుకు సుజన్, తను ప్రేమించిన అమ్మాయి ప్రకృతిని పరిచయం చేయడానికి, ఆ అమ్మాయితో సహా భారతదేశా నికి వస్తాడు.
పుణ్యదాసు, తన డైరీ మీద మాత్రం ఎవ్వరి చెయ్యి పడనివ్వడు. అలాంటిది ఒకరోజు కాబోయే కోడలు ఆ డైరీ ముట్టుకుందని అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. మామూలుగా చాలా మంచిగా వుండే ఆయన ఆ డైరీ ముట్టుకోగానే ఎందుకు అంత అసహనానికి గురి అయ్యాడు అన్న సందేహం ఆ అమ్మాయిలో కలుగుతుంది. ఎలాగైనా ఆ డైరీ చదవాలని ప్రయత్నిస్తుంది. ఈ దశలో ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చిన పుణ్యదాసు, తన శిష్యుడు తన కొడుకుగా భావించే ఇన్స్‌పెక్టర్ ఇంద్రాతో అమ్మాయి గురించి వాకబు చేయమన్నాడు. ఇంద్రా వాకబులో ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్ధమనీ, ఆమె పోలీస్ ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఒక వ్యక్తి కూతురని తెలుస్తుంది.
ఇంద్రా ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుజన్ కూడా ఆ అమ్మాయిని నిలదీస్తాడు. కాని పుణ్యదాసు మాత్రం... ఆ అమ్మాయి తన చేతుల్లో పొరపాటుగా చనిపోయిన వ్యక్తి కూతురని, అతని క్రిమినల్ కాడని... చెప్పి... అసలేం జరిగిందో వివరించి, జరిగిన తప్పుకు తనని క్షమించమని ప్రకృతిని కోరుతాడు. తన గతం దాచి ప్రేమించినందుకు ప్రకృతి సుజన్ తో తనని క్షమించమంటుంది.
నట, సాంకేతికవర్గం
[మార్చు]నటవర్గం
- పుణ్యదాస్ – జోగారావు
- సుజన్ – మంజునాథ్ శర్మ/లక్ష్మణ్ మీసాల
- ప్రకృతి – జయశ్రీ (శ్రీజయ), శ్రీజ సాధినేని
- ఇంద్ర – ఉదయ్ భాగవతుల/శ్రీధర్ బీచరాజు/పుండరీ
- జావీద్ భాయ్ - కొమరవోలు శ్రీనివాసరావు, వాసన్, జార్జ్
సాంకేతికవర్గం
- సంగీతం – సురభి ఆనంద్
- రంగాలంకరణ – సురభి ఉమాశంకర్
- ఆహార్యం – జోగారావు/పుండరీ
బహుమతులు
[మార్చు]- ఉత్తమ ప్రదర్శన, దర్శకత్వం - వీరవాసరం కళాపరిషత్, వీరవాసరం[2]
- ఉత్తమ ప్రదర్శన, రచన, దర్శకత్వం - గురజాడ కళాభారతి, విజయనగరం[3]
- ఉత్తమ ప్రదర్శన, నటుడు, దర్శకత్వం - ద్రాక్షారామ నాటక కళాపరిషత్, ద్రాక్షారామం[4]
- ఉత్తమ ప్రదర్శన, దర్శకత్వం - తపస్వి కల్చరల్ ఆర్ట్స్, విజయవాడ[5]
మూలాలు
[మార్చు]- ↑ నవతెలంగాణ. "ఆ'ఎవరిని ఎవరు క్షమించాలి' నాటకం ఉత్కంఠ భరితం". Retrieved 26 July 2017.
- ↑ సాక్షి. "ఉత్తమ ప్రదర్శనగా 'ఎవరిని ఎవరు క్షమించాలి'". Retrieved 26 July 2017.
- ↑ సాక్షి. "ఉత్తమ నాటిక 'ఎవరిని ఎవరు క్షమించాలి?'". Retrieved 26 July 2017.
- ↑ ఆంధ్రజ్యోతి. "ద్రాక్షారామలో ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు". Retrieved 26 July 2017.[permanent dead link]
- ↑ ది హన్స్ ఇండియా. "Best Production award to Evarini Evaru Kshaminchali". Retrieved 26 July 2017.